Suryaa.co.in

Andhra Pradesh

సజ్జల ముద్దాయిల తరుపున వకాల్తా పుచ్చుకోవడం సిగ్గుచేటు

• ప్రాసిక్యూషన్ కు సపోర్ట్ చేయాల్సిన వ్యక్తి, ముద్దాయిలకు సపోర్ట్ చేయడం ఏమిటి?
• హత్యకేసులో సీబీఐ ఏ8గా తేల్చిన అవినాశ్ రెడ్డి తరపున మాట్లాడినంత మాత్రాన సజ్జల తాను బయటపడేయాలనుకుంటున్నవారిని రక్షించలేడు
• ప్రభుత్వసలహాదారుగా ఉండి, ప్రజలసొమ్ము జీతం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి వివేకాహత్యకేసులో ముద్దాయిల తరుపున వకాల్తా పుచ్చుకోవడం తీవ్ర అభ్యంతరకరమైనది
• ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతుల్ని విచారించాల్సి ఉంది
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య

వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ తీరుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముద్దాయిల తరుపున వకాల్తా పుచ్చుకొని అడ్వకేట్ లా మాట్లాడుతున్నారని, ఈ కే సులో ఎవరినీ ఇకపై ముద్దాయిలుగా పెట్టకూడదన్నట్టు మాట్లాడ టానికి అసలు ఆయ న ఎవరని, అతనికేమి సంబంధమని, కోర్టులను తప్పుపట్టేలా మాట్లాడటం ఏమిటని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య ప్రశ్నించారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడిన రామయ్య, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు, వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఉండి, ప్రజలసొమ్ము జీతంగా తీసుకుంటున్న సజ్జల, వివేకా హత్యకేసులో ఏ8 ముద్దాయిగా ఉన్న అవినాశ్ రెడ్డి తరుపున వకాల్తా పుచ్చుకోవడం ఎక్కడి న్యాయమన్నారు. వివేకా హత్యకేసు నుంచి తాను బయటపడేయాలనుకుంటున్న వారిని సజ్జల ఎలా బయటపడేయగలరని, ఈ కేసులో ఇంకా దర్యాప్తు పూర్తి కా లేదని, విచారణ ఇంకా పెండింగ్ లో ఉందని, ఫుల్ ప్లెడ్జ్ ఛార్జ్ షీట్ ఇంకా వేయలేదనే వాస్తవాన్ని సజ్జల సహా, ప్రభుత్వంలోని వారంతా తెలుసుకోవాలన్నారు.

వివేకానందరెడ్డి హత్యకేసులో వ్యవస్థల్ని మభ్యపెడుతున్నది, ప్రభావితం చేస్తున్నది ముద్దాయిలు, ముద్దాయిలు కాబోయేవారేననే విషయం విస్మరించినర సజ్జల ఏదో తెలిసినవాడిలా మైకుముందుకొచ్చి మాట్లాడుతున్నాడున్నారు. చేతిలో సొంత మీడి యా ఉందని ఏదిపడితే ప్రచారంచేస్తే, ప్రజలు నమ్మరన్నారు. ఈ కేసువిచారణను సీబీఐ సమర్థవంతంగా చేయకపోతే, సదరు దర్యాప్తుసంస్థ ప్రజల్లో నవ్వులపాలు కాదా అన్న రామయ్య, సీబీఐ ఎప్పూడూ తమఉనికికి ప్రమాదం కలిగేలా వ్యవహరించదన్నారు.

హత్య జరిగినప్పుడు ఘటనాస్థలంలో దొరికిన లేఖను సీబీఐ నిన్ హైడ్రిన్ టెస్ట్ కు పంపి, రిపోర్ట్ కోసం ఎదురుచూస్తుంటే, సజ్జల అసలు ఆ లేఖను సీబీఐ పరిగణన లోకి తీసుకోలేదని ఎలా చెబుతాడని రామయ్య ప్రశ్నించారు. ఆ లేఖ తాలూకా రిజల్ట్ రాకుండా అసలు విచారణ ఎలా పూర్తవతుందన్నారు. అలానే సీజ్ చేసిన సెల్ ఫోన్లు కేరళలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లోఉన్నాయని, వాటిలోని డేటా వివరాలు బయటకురా వాల్సి ఉందన్నారు.

గూగుల్ టేకౌట్ పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని సజ్జల ఎలా ఏ ఆధారాలతో చెబుతాడన్నారు? హూ కిల్డ్ బాబాయ్ ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి సమాధానం కోసం నేటికీ రాష్ట్రమంతా ఎదురుచూస్తుంటే, మీ సాక్షిమీడియాలో మీరు ఏమీలేదని ఎలా నిర్ణ యిస్తారన్నారు. ఈ కేసువిచారణలో సీబీఐ ఎలుకను పడుతుందో, ఏనుగుకుంభస్థలా న్ని కొడుతుందో సజ్జల వేచిచూడాలన్నారు. సీబీఐ దర్యాప్తు ఎలా ఉంటుందో సజ్జలకు అవగాహన లేనట్టుందన్న రామయ్య, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని, ఆయనసతీమణి భారతిరెడ్డిని ఫ్రశ్నించకుండా కేసువిచారణ ముగియదన్నారు.

అలానే అవినాశ్ రెడ్డిని ఇంకా తరవుగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. కోకిల తొందరపడి ముందే కూసినంత మాత్రాన, సీబీఐ విచారణ దారితప్పదన్నారు. చనిపోయిన వివేకానందరెడ్డికి చెడ్డపేరు రాకూడదని అవినాశ్ రెడ్డి, అతని కుటుంబం మూడేళ్లుగా ఇబ్బందుల్ని దిగమింగుతోందని సజ్జల అనడం దొంగేదొంగ అని అరిచిన ట్టుగా ఉందన్నారు. ఏమీలేకపోతే సీబీఐ విచారణాధికారి రామ్ సింగ్ ను ఎందుకు వెం టాడారో, అతనిపై ఎందుకు తప్పుడుకేసులు పెట్టారో సజ్జల సమాధానం చెప్పాలన్నా రు.

సజ్జల రామకృష్ణారెడ్డి గారు కిందిప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
1. గతంలో వివేకాహత్యకేసు విచారణ సీబీఐకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక ఆ పిటిషన్ ఎందుకు వెనక్కు తీసుకున్నాడు?
2. హత్యజరిగిన రోజున తెల్లవారుజామున 5.30నిమిషాలకు వచ్చిన ఫోన్ కాల్ పై జగన్ సమాధానంచెప్పాలి.
3. వివేకాహత్యకేసుపై, సీబీఐ దర్యాప్తుపై జగన్ ఎందుకు నోరువిప్పడంలేదు?

వివేకానందరెడ్డి హత్యకేసు ఇన్ని మలుపులు తిరగడానికి కారణం ముఖ్య మంత్రేనన్న రామయ్య, సీబీఐకి సహకరించవద్దని తానే పోలీసులకు చెప్పాడ న్నారు. అడుగుడుగునా సీబీఐని ఇబ్బందిపెట్టారన్నారు. అవినాశ్ రెడ్డి తల్లి గారు కర్నూల్లోని ఆసుపత్రిలో చేరితే, ఆరోజు మీరు ఎంత డ్రామా ఆడారో, సీబీఐ ని ఎలా ముప్పుతిప్పలు పెట్టారో రాష్ట్రమంతా చూసిందన్నారు. విచారణాసంస్థ ఎలా దర్యాప్తుచేయాలో ముద్దాయిలు శాసించడం ఏమిటని, డబ్బు, అధికారం ఉందని సీబీఐని ప్రలోభపెట్టాలనిచూసి చివరకు భంగపడ్డారన్నారు.

వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు సీబీఐకి ఒక ఛాలెంజ్ అని, ఎంతమంది దీనిలో జోక్యంచేసుకున్నా, అసలు నేరస్తుల్ని చట్టానికి పట్టించేవరకు సీబీఐ వెనకడుగు వేయకూడదని రామయ్య సూచించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న మీడియతో మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలేనని, ప్రాసిక్యూషన్ కు సపోర్ట్ చేయాల్సిన వ్యక్తి, ముద్దాయిల బృందానికి చేయడం సిగ్గుచేటన్నారు. సజ్జలకు సలహాదారుగా కొనసాగే నైతిక అర్హతలేదని రామ య్య తేల్చిచెప్పారు. వివేకాహత్యపై రోజుకో కథ అల్లుతున్నవారే, తిరిగి సీబీఐని, మీడియాను తప్పు పట్టడంపై రామయ్య అభ్యంతరం వ్యక్తంచేశారు.

LEAVE A RESPONSE