Suryaa.co.in

Andhra Pradesh

మార్గదర్శిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటు

ఫేక్ కంపెనీలు పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన జగన్ రెడ్డి మార్గదర్శిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటు
– తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు

ప్రజల సొమ్ము దోచుకుని ఫేక్ కంపెనీలు పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన సీఎం జగన్ రెడ్డి మార్గదర్శిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి షెల్ కంపెనీల మాదిరి మార్గదర్శి రాత్రికి రాత్రి పుట్టొకొచ్చిన సంస్ధ కాదు. 6 దశాబ్దాలకుపైగా డిఫాజిట్ల దారుల విశ్వాసం చూరగొని అవినీతికి తావు లేకుండా ప్రయాణం సాగిస్తోంది.

షెల్ కంపెనీలు, ఫేక్ కంపెనీలే పెట్టి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ జగన్ రెడ్డికి మార్గదర్శి విలువ ఏం తెలుస్తుంది? జగన్ రెడ్డి కేవలం ఈనాడు పత్రికలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్నారన్న కక్ష్యతోనే అక్రమ కేసులు బనాయించారు. పైగా దానిపై మాట్లాడిన న్యాయవాదులకు సీఐడీ నోటీసులు ఇస్తారా? రాష్ట్రం ఏమైనా జగన్ రెడ్డి తాత జాగీరా? ప్రజలెవరూ వైసీపీ ప్రభుత్వ అక్రమాల్ని, జగన్ రెడ్డి నియంతృత్వాన్ని ఖండించకూడదా?

చిట్ ఫండ్ యజమాని తన కమీషన్ ను పెట్టుబడిగా పెట్టుకోవచ్చని 1982 చిట్ ఫండ్ చట్టమే చెబుతోంది. కేవలం కంపెనీ ఆర్జించే కమీషన్, ఇతర ఆదాయ నిల్వలను మ్యూచువల్ ఫండ్స్, షేర్లు మొదలైన వాటిలో పెట్టుబడులుగా పెట్టారు. మార్గదర్శి చిట్ ఫండ్ రహిత వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని చెప్పడం అర్ధరహితం. జగన్ రెడ్డి అక్రమ కేసులు మార్గదర్శిని ఏం చేయలేవు, పాలన గాలికొదిలి అరాచక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.

LEAVE A RESPONSE