ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
పరిపాలనా వికేంద్రీకరణ చాలా బావుంది, అందరూ అనుకున్నదానికంటే ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఉదయం మీటింగ్‌లో కూడా సీఎంగారు అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజన్, సీఎంగారి విజన్ ఏదైతే ఉందో అందులో బాగంగా మిడిల్ లెవల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా సమూలంగా
సంస్కరింపబడింది. పరిపాలనా వికేంద్రీకరణ అనేది, పూర్తిగా జరిగింది. విలేజ్ సెక్రటేరియట్, వలంటీర్ సిస్టమ్, డెలివరీ మెకానిజం ఎలా సక్సెస్ అయ్యాయో దీని ఫలాలు కూడా వచ్చే ఐదారు నెలల్లో వస్తాయి. సంక్షేమ పధకాలు పారదర్శకంగా ఏ విధంగా జనానికి చేరాయో ఆ విధంగా పాజిటివ్ రిజల్ట్ త్వరలోనే వస్తుందని గట్టిగా నమ్ముతున్నాం.
ప్రభుత్వం సూత్రబద్దమైన వైఖరి తీసుకోవడం, పార్లమెంట్ నియోజకవర్గాన్ని కొలబద్దగా తీసుకోవడం వల్ల సమస్యలు తక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని కూడా అడ్జస్ట్ చేయడం వల్ల 12 అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలోకి వచ్చాయి. వీలైనంతవరకూ చేశారు, అందరి కోరిక తీర్చడమనేది ఎప్పుడూ అసాధ్యమే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని చేయడం వల్లనే ఇంత సజావుగా జిల్లాల పునర్విభజన జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి కూడా సీఎంగారు చెప్పారు, నిర్ణయం కూడా అయిపోయింది, అధికారుల వద్ద కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంత ఆలస్యం జరిగింది, 7 వ తేది జరిగే క్యాబినెట్లో పెట్టి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.