– సామాజిక న్యాయం బీజేపీకే సాధ్యం
– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా
– గుంటూరులో ఇంటింటికీ ముర్ము చిత్రపాటలు పంపిణీ చేసిన బీజేపీ
గుంటూరు: ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు చేపట్టడమంటే అది గిరిజనులకు దక్కిన అపురూప గౌరవమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. సామాజికన్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. కులాలు, మతాలు చూసి కాకుండా, ప్రతిభను చూసి ఎంపిక చేసే ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. ముర్ము రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, గుంటూరులో రాజీవ్ గాంధీ నగర్ సుగాలి కాలనీ నందు మిఠాయిలు పంచి వారి చిత్రపటాన్ని ఇంటింటికి ఇవ్వడం జరిగింది. బిజెపి రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ కన్వీనర్ పాలపాటి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. గతంలో అబ్దుల్‌కలాం, రామ్‌నాధ్ కోవిందు, ఇప్పుడు గిరిజన మహిళ ముర్ముకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన ఘనత ఎన్డీఏయేదేనన్నారు. ఇది దేశంలోని గిరిజన జాతికి దక్కిన గౌరవమన్నారు. గిరిజనులను ఓటు బ్యాంకుగా పరిగణించే పార్టీలకు ఇది గుణపాఠం కావాలన్నారు. ఒక గిరిజన మహిళకు రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు స్వచ్ఛందంగా మద్దతునిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ వల్లూరు జయ ప్రకాష్ నారాయణ, బిజెపి రాష్ట్ర పబ్లిసిటీ కన్వీనర్ పాలపాటి రవికుమార్,బిజెపి ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉయ్యాల శ్యామ్ వరప్రసాద్, సివిల్ సప్లై జిల్లా కన్వీనర్ బొరుగడ్డ బుల్లి బాబు , SC మోర్చా జోనల్ ఛార్జ్ దారా అంబేడ్కర్, స్వచ్ఛభారత్ రాష్ట్ర కో కన్వీనర్ ఈదర శ్రీనివాస రెడ్డి , యువమోర్చా రాష్ట్ర పదాదికారి కొక్కేర శ్రీనివాస్,తానుచింతల అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి కరుణ శ్రీ , మహిళా మోర్చా నాయకురాలు నాగ మల్లీశ్వరి , సునీతా ,ఆవుల వీరశేఖర్ యాదవ్ , జిల్లా ప్రధాన కార్యదర్శులు చరక కుమార్ గౌడ్ , రాచమల్లు భాస్కర్ , కో ఆపరేటివ్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ వనమా నరేంద్ర కుమార్, జితేంద్ర గుప్త , రాజేష్ రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్,కొర్రపాటి సురేష్ కుమార్, అంకాల శ్రీను, 3వ మండల నాయకులు బాణావత్ బుజ్జి , బాణావత్ తావూ, తదితరులు పాల్గొన్నారు