– కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రమేష్ తన కంపెనీ కోసం మా చుట్టూ తిరగలేదా?
– సీఎం రమేష్ చదివింది రేవంత్ స్క్రిప్టే
– ఈడీ కేసులకు భయపడి బీజేపీలో చేసిన రమేష్ మాటలకు విలువుందా?
– బిఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీలోనే కాదు ఏ పార్టీలో విలీనం కాదు
– బిఆర్ఎస్ పార్టీది తెలంగాణ భావజాలం
– బీజేపీది ఆర్.ఎస్.ఎస్ భావజాలం
– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్: బిఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇయర్ ఆఫ్ ది జోక్ అని ఎద్దేవా చేశారు. సీఎం రమేష్ ఎప్పుడు బీజేపీలో చేరారు? బీజేపీలో సీఎం రమేష్ కు ఉన్న పరపతి ఎంత అని ప్రశ్నించారు.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించి, 10వేల కోట్ల రుణాలు ఇప్పించారని అన్నారు. దీనికి సీఎం రమేష్ సమాధానం చెప్పకుండా, విలీనం అంశం ఎందుకు మాట్లాడుతున్నారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సీఎం రమేష్ మధ్యవర్తిగా ఉన్నారా? లేదా తెలంగాణ ప్రజలకు సీఎం రమేష్ చెప్పాలి.
కేటీఆర్ నా ఇంటికి వచ్చి కలిశారని అంటున్న సీఎం రమేష్.. నీ కంపెనీ కోసం,నీ కాంట్రాక్టుల కోసం అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ వెంటపడలేదా? బిఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీలోనే కాదు ఏ పార్టీలో విలీనం కాదని చెప్పారు. ఇప్పటి వరకు బిఆర్ఎస్, బీజేపీతో పొత్తు లేదనీ, భవిష్యత్ లో బీజేపీతో బిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి పొత్తు ఉండదన్నారు.
బిఆర్ఎస్ పార్టీది తెలంగాణ భావజాలం. బీజేపీది ఆర్.ఎస్.ఎస్ భావజాలం. నేడు రేవంత్ రెడ్డితో కుమ్మక్కు అయ్యి సీఎం రమేష్ రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని దుయ్యబట్టారు. టీడీపి నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యి ఈడీ,సీబీఐ కేసులకు భయపడి బీజేపీలో చేరిన సీఎం రమేష్ మాటలకు విలువ ఉందా?
సీఎం రమేష్ చరిత్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసన్నారు. ఆంధ్రా ఎంపీ సీఎం రమేష్ అక్కడ ఉన్న కుల పంచాయతీలు తెలంగాణకు తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రమేష్ లాంటి వాళ్ళతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
సీఎం రమేష్ ప్రస్తావన చేసిన కమ్మ,రెడ్డి సామాజిక వర్గాలకు కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు ఉందా? బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ,రెడ్డి సామాజిక వర్గాల వారు అత్యధికంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు,ఎంపీలుగా,పార్టీ పదవుల్లో ఉన్నారు
బిఆర్ఎస్ పార్టీని అస్థిరపరచాలని రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ను సీఎం రమేష్ చదివారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ నాయకత్వానికి అన్ని వర్గాలు మద్దతు తెలిపాయి. 2023లో బిఆర్ఎస్ అధికారంలోకి రాకపోయినా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బిఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిచింది. సెటిలర్స్,, కమ్మ, రెడ్డి,అన్ని సామాజిక వర్గాల వారు కేసీఆర్,కేటీఆర్ నాయకత్వానికి ఆమోదం తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సామాజికవర్గాల వారిని కేటీఆర్ ఎట్లా తిడతారు? ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లకు బ్రోకరిజం చేసే సీఎం రమేష్ మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవద్దు.