– బాబు జీవితం ఆధ్యంతం అవినీతిమయమే
– లోకేష్ 2500 కిమీ పాదయాత్రకు రూ. 250 కోట్లట
– వెంటిలేటర్ పై ఉన్న టీడీపీకి 2024లో తీసేస్తారు
– రాజకీయ భవిష్యతను చేజేతులా నాశనం చేసుకుంటున్న పవన్
– 9 నెలలకు ముందే వైఎస్సార్ సీపీ నైతిక విజయం
– రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
అమరావతి, 22 ఆగస్టు: అబద్ధాలు చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్న పిట్టల దొర చంద్రబాబు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు. అందరికి రాఖీలు పంపుతాడంట, 45 రోజులు పూజా మందిరంలో పెట్టి.. చేతులు కట్టుకుని తనను తలుచుకుంటే దేవుడితో చెబుతాడంట.. అప్పుడు వారికి మంచి జరుగుతుందట. అదే రాఖీ బాబా అవతారం. దీనినిబట్టి అతని మానసిక స్థితి ఎలా ఉందో ప్రజలకు ఇప్పటికే అర్ధమైపోయిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
ఈ రోజు రాఖీ అంటాడు..రేపు తాయత్తు అంటాడు. అటువంటి గారడీ వ్యక్తితో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాఖీ బాబాలాంటి పిచ్చోళ్ళను రోడ్డుపై తిరగనిస్తే ప్రమాదమని హెచ్చరించారు. మోసం, దగా, వంచన, వెన్నుపోట్లకు పేటెంట్ అయిన బాబు జీవితం ఆధ్యంతం అవినీతిమయమేనని, అతను ఏ అవతారం ఎత్తినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. లక్షల కోట్లు దోచేసి సింగపూరులో దాచిన చంద్రబాబు అవినీతి అనకొండ అన్నారు.
టీడీపీ పని అయిపోఇందని వారికి అర్ధమైనట్లు లేదు, అర్థమైనా సొంతంగా పోటీ చేసే దమ్ము లేదు. అంటే నైతికంగా వైఎస్సార్ సీపీకి విజయం అందించినట్లేనని అన్నారు ప్రస్తుతం టీడీపీ వెంటిలేటరుపై ఉందని, 2024 ఎన్నికల్లో ప్రజలే దానిని తీసేస్తారని అన్నారు.