– లిక్కర్ స్కాంలో తన బిడ్డ ప్రమేయంపై చర్చను దారి మళ్లించేందుకు చేస్తున్న కుట్ర
– వరంగల్ సభ సక్సెస్ తో మరోసారి బీజేపీ సత్తా చాటుతాం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
కరీంనగర్ లోని పీఎం కన్వెన్షన్ హాలులు ఈరోజు సాయంత్రం 6 ఉమ్మడి జిల్లాల నేతలతో జరిగిన బీజేపీ జోనల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతల సమస్యపై సీఎం ఉన్నతస్థాయి రివ్యూ నిర్వహించడం విడ్డూరం.వచ్చే శుక్రవారం నాడు హైదరాబాద్ లో ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నది కేసీఆరే.పాదయాత్రను అడ్డుకుని, టీఆర్ఎస్ గూండాలతో దాడి చేయించి గొడవకు కారకుడు కేసీఆరే. లిక్కర్ స్కాంలో తన బిడ్డ ప్రమేయంపై జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకు సీఎం చేస్తున్న కుట్రలో భాగమే ఇదంతా.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనుకుంటున్న కేసీఆర్ శాంతి భద్రతలపై సమీక్ష పెట్టడం విడ్డూరం.ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేక అడ్డుకునే కుట్ర. సీఎం ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా, బెదించినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదు. మునుగోడు బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలకు, భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు.
ఒక ఏడాదిలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలు మరే పార్టీ నిర్వహించలేదు.. ఆ ఘనత బీజేపీదే. వరంగల్ ఈనెల 27న జరగబోయే 3వ విడత పాదయాత్రను సైతం సక్సెస్ చేసి తీరుతాం. కేసీఆర్ రాక్షస పాలన నుండి విముక్తి కల్పించడంతోపాటు బీజేపీ అధికారంలోకి రావడమే మన ముందున్న లక్ష్యం.
బీజేపీ అధికారంలోకి రావాలంటే మునుగోడు ఎన్నికల్లె గెలిచి తీరాల్సిందే.. అందుకోసం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త మునుగోడుకు వచ్చి ఇంటింటికీ తిరిగి పువ్వుకు ఓటేసి గెలిపించాలి. ఈనెల 27న వరంగల్ లోని ఆర్ట్స్ కాలేజీలో 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను నిర్వహించి తీరుతాం. వరంగల్ సభ సక్సెస్ తో మరోసారి బీజేపీ సత్తా చాటుతాం.