Suryaa.co.in

Telangana

అది ఫార్మాసిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్

– కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటు
– వామపక్ష నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్: కొడంగల్‌లో ఏర్పాటుచేసేది ఫార్మాసిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ మాత్రమేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనను కలిసేందుకు వచ్చిన సీపీఐ-సీపీఎం నేతలకు సీఎం ఈ స్పష్టత ఇచ్చారు. ‘‘నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం నా బాధ్యత. అలాంటిది సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బందిపెడతా’ అని ప్రశ్నించారు. కాలుష్య రహిత పరిశ్రమలే తీసుకువస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో యువత, మహిళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉందని, ఆ మేరకు పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా భూసేకరణ పెంపు అంశాన్ని పరిశీలించాల్సిందిగా వామపక్ష నేతలు సూచించగా, రేవంత్ అందుకు సానుకూలంగా స్పందించారు. లగచర్ల సంఘటనకు సంబంధించి వామపక్ష నాయకులు సీఎంకు వినతిపత్రం సమర్పించారు.

LEAVE A RESPONSE