Suryaa.co.in

Telangana

బీఆర్ ఎస్ ను అంతం చేయడం కోమటిరెడ్డి జేజమ్మ తరం కూడా కాదు

-రేవంత్ రెడ్డి కూడా యూ ఎస్ వెళ్లారు.. ప్రభాకర్ రావు కు ఆయన ఏం చెప్పి వచ్చారు ?
– మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

నిన్న ఆలేరు లో మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడారు. బీ ఆర్ ఎస్ భవిష్యత్ గురించి కోమటి రెడ్డి కలలు కంటున్నారు. బీ ఆర్ ఎస్ ను అంతం చేయడం కోమటి రెడ్డి కాదు కదా ఆయన జేజమ్మ తరం కూడా కాదు.

కేసీఆర్ కుటుంబం మీద పడి ఏడుస్తున్నారు. ముందు కోమటి రెడ్డి ఆయన కుటుంబం లో విభేధాల సంగతి చూసుకోవాలి. పోలీసు అధికారి ప్రభాకర్ రావు హరీష్ రావు ,కే టీ ఆర్ వద్దంటే ఇండియా కు రావట్లేదా ?
ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా యూ ఎస్ వెళ్లారు. ప్రభాకర్ రావు కు ఆయన ఏం చెప్పి వచ్చారు? ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. మమ్మల్ని తప్పుబడితే జనం హర్షించరు.

కేసీఆర్ ,కే టీ ఆర్ ,హరీష్ రావు ,కవిత ల పై మాట్లాడే అర్హత కోమటి రెడ్డి కి లేదు. కాంగ్రెస్ బీజేపీ లు కుమ్మకై కవితను జైల్లో పెట్టారు. ఆధారాలు లేని కేసులో కవితను జైలు కు పంపారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కి కాంగ్రెస్ లో ఉంటూ ఓటు వేయాలని చెప్పిన చరిత్ర వెంకట్ రెడ్డి ది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రిగా కోమటి రెడ్డి చేసింది శూన్యం. జిల్లా విషయాలు పట్టించుకోకుండా రాష్ట్ర స్థాయి విషయాలు కోమటి రెడ్డి మాట్లాడుతున్నారు. తపాస్ పల్లికి నీళ్లు తెస్తా అని కోమటి రెడ్డి హామీ ఇచ్చారు ..ఆ హామీ ఏమైంది?

రిజర్వాయర్ల నుంచి జిల్లా చెరువులు నింపే అవకాశమున్నా ఆ పని కోమటి రెడ్డి చేయడం లేదు. గంధ మల్ల రిజర్వాయర్ పనులు పూర్తి చేయకుండా కోమటి రెడ్డి ఏం చేస్తున్నారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజిని పోచం పల్లి నుంచి రంగారెడ్డి జిల్లా కు రేవంత్ రెడ్డి తరలిస్తే కోమటి రెడ్డి ఏం చేస్తున్నారు?

జిల్లాకు జరుగుతున్న అన్యాయం పై కోమటి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? వేరే విషయాలు తగ్గించి జిల్లా విషయాలను సీఎం తో కోమటిరెడ్డి చర్చిస్తే బాగుంటుంది.ఉమ్మడి నల్లగొండ జిల్లా లో 18 కోట్ల రూపాయల మేర పాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. ముందు కోమటి రెడ్డి వాటిని ఇప్పించాలి.

చేనేత కార్మికులకు రావాల్సిన బకాయిల పై కోమటి రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు. యాదాద్రి కి మంజూరైన మెడికల్ కాలేజీ ని గతం లో కేటాయించిన ప్రదేశం లోనే ఉంచేలా కోమటి రెడ్డి ఎందుకు ప్రయత్నించడం లేదు? మెడికల్ కాలేజీలో సీట్ల సంఖ్య తగ్గిస్తుంటే కోమటి రెడ్డి ఏం చేస్తున్నారు ?

సాగు నీళ్ల పై మంత్రి కోమటిరెడ్డికి శ్రద్ద లేదు. మిషన్ భగీరథ పై కూడా కోమటి రెడ్డి అబద్దాలు మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇవ్వలేకపోతే ఓట్లు అడగమని చెప్పిన నేత కేసీఆర్. తన హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా మిషన్ భగీరథ కు సంబంధించి చిన్న చిన్న పనులు కూడా కావడం లేదు. కోమటిరెడ్డి కొంత అవగాహన పెంచుకుని మాట్లాడితే మంచిది. యాదాద్రి లో డంపింగ్ యార్డు కేసీఆర్ ప్రభుత్వం లో నిర్మాణం జరిగింది. అయినా దాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు వినియోగించుకోవడం లేదు?

అమృత్ స్కీం ద్వారా యాదాద్రి మున్సిపాలిటీ కి కేటాయించిన నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదు.అమృత్ పై కే టీ ఆర్ మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదు.రేవంత్ బావమరిది కి కాంట్రాక్టు ఇచ్చినట్టు కే టీ ఆర్ ఆధారాలతో సహా బయట పెట్టారు.

అమృత్ పై సీఎం ,కే టీ ఆర్ చూసుకుంటారు. కోమటి రెడ్డి కి ఏం పని?ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు కోసం కోమటి రెడ్డి పని చేయాలి. రైతు రుణ మాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయండి. జిల్లాకు జరుగుతున్నఅన్యాయంపై కోమటిరెడ్డి కళ్ళకు గంతలు కట్టుకున్నారా?

LEAVE A RESPONSE