– మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్: శీతాకాల సమావేశాలు నేటి తో ముగిసినవి. నిన్న పార్లమెంటు లో అతిముఖ్యమైన బిల్లు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్ లో మోదీ ఒక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. . వీబీ జీ రామ్ జీ అని తెచ్చారు. ఈ చట్టానికి వీబీ జీ రామ్ జీ పేరు పెట్టమని మంత్రులు చెప్పారు.
మహాత్మా గాంధీ పేరు తీయడం మంచిది కాదు. జాతిపిత అని పిలిచే గాంధీ పేరు తొలగించడం దేశానికి మంచిది కాదు. ఇది గత 20 సంవత్సరాల క్రితం వచ్చిన చట్టం. 2005లో వచ్చిన చట్టం అయితే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మార్పులు జరిగాయి అని చెప్పడం జరిగింది.కాబట్టి మేము మెరుగుపరుస్తున్నాము అన్నారు.
రెండు ముఖ్యమైన తప్పిదాలు చేశారు.ఒక్కటి మహాత్మా గాంధీ పేరు తీసివేయడం. రెండవది కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చేవి. ఇప్పుడు దీన్ని కేంద్ర ప్రభుత్వం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించాలి అని నిబంధన పెట్టారు. దేశంలో నేషనల్ కమిటీ,రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ లు పెట్టడం మంచిదే.
నేను ఆనాడు చట్టం చేసినప్పుడు చర్చలో పాల్గొన్న. మా చిన్నతనంలో పని హక్కును ప్రాథమిక హక్కు కావాలని చెప్పి పోరాటాలు చేశాం. పార్లమెంట్ లో చట్టం వచ్చినప్పుడు మేము మద్దతు ఇచ్చాం. ప్రాథమిక హక్కును ఈ మోడీ ప్రభుత్వం నీరుగార్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు పెడితేనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తున్నారు.
మన దేశంలో ఒక్క రాష్ట్రం తో ఒక్క రాష్ట్రం పోలిక లేవు. దక్షిణ భారత దేశంలో రాష్ట్రాలు ఒకలా.. ఉత్తర భారతదేశంలో రాష్ట్రాలు,ఈశాన్య రాష్ట్రాలు ఇంత మెరుగుగా లేవు. అయితే ఆ రాష్ట్రాలు 40శాతం నిధులు ఇవ్వలేవు. ఆ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం పేదరికాన్ని పెంచే అవకాశం ఉన్నది.
దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ లను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. ఉదాహరణకు కేరళ రాష్ట్రంలో సర్వశిక్షా అభియాన్ అమలు చేయడం లేదు. డబ్బులు వేరే రూపంలో ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం అవుతుంది. మెల్లిగా ఇది రద్దు అవుతుంది. ఆనాడు వామపక్ష పార్టీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడం వలన, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వచ్చింది.
ఈరోజు దేశంలో 8.9కోట్ల మంది ప్రజలు జాబ్ కార్డులు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నారు.వీరందరికీ నష్టం జరుగుతుంది. మహిళలకు చాలా నష్టం జరిగే అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పేరు మార్చి, మెరుగులు దిద్దుబాటు చేశాం అంటున్నారు.పేరు మార్పు నే కాదు చాలా మార్పులు చేశారు కాబట్టి, ఈ పథకం పేదలకు ఒక్క హక్కుగా చేయాలని మా డిమాండ్.