Suryaa.co.in

Telangana

సాయుధ రైతాంగ పోరాటంతోనే తెలంగాణాకు గుర్తింపు

– బి యన్ స్ఫూర్తిని దిశ,దశల వ్యాప్తింప చెయ్యాలి
– నైజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు జెండాను ఎగరేసిన ధీశాలి
– దోపిడి పీడన పాలన అంతానికి అగ్గిరాజేషిన యోధుడు
– భవిష్యత్ తరాలకు బి యన్ చరిత్రను అందించే బాధ్యత మనదే:
మంత్రి జగదీష్ రెడ్డి
-దివంగత బీమిరెడ్డి నర్సింహారెడ్డి 14 వ వర్ధంతి
– హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,
మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ తదితరులు

సాయుధ రైతాంగా పోరాటాల ద్వారానే తెలంగాణాకు ప్రత్యేక గుర్తింపు లభించిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.నైజాం నిరంకుశత్వపై మొదలైన తిరుగుబాటు సాయుధ రైతాంగా పోరాటంగా మారి ఉధృత రూపం దరిస్తున్న సమయంలో ఇది యావత్ భారత దేశానికి వ్యాప్తి చెందుతుందన్న భయంతోటే బ్రిటిష్ పాలకులు దేశం నుండి తోక ముడిచిరాన్నారు.అందుకు దివంగత బీమిరెడ్డి నరసింహా రెడ్డి చేసిన తిరుగుబాటు ప్రధాన కారణంగా నిలిచిందన్నారు.తెలంగాణా సాయుధ రైతాంగా పోరాట నిర్మాత ,మార్కిస్టు కమ్యూనిస్టు నేత దివంగత బీమిరెడ్డి నరసింహా రెడ్డి 14 వ వర్ధంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి మంత్రి జగదీష్ రెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నైజాం నిరంకుశత్వపై మొట్టమొదటి సారిగా తిరుగుబావుటా జరిపిన మొట్టమొదటి నేతగా దివంగత బి యన్ చరిత్ర సృష్టించారన్నారు.అటువంటి చరిత్రను దిశ దశలు వ్యాపించ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.

దోపిడీ పాలన అంతానికి అగ్గి రాజేసిన మహా యోధుడు గా ఆయన కీర్తించబడుతున్నారని ఆయన చెప్పారు.అటువంటి మహానేత స్ఫూర్తి వర్తమాననికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే ఆయన స్ఫూర్తి ప్రతిబింబించేలా సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో వచ్చే వర్ధంతి నాటికి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణా సాయుధ రైతాంగా పోరాటం ద్వారానే యావత్ భారతదేశంలో ప్రజా చైతన్యం రగిల్చిండన్నారు.ఈ దేశంలో ఒక రోజు బానిస మనస్తత్వంతో వెట్టి చాకిరిలో మగ్గుతున్న కాలంలోనే భూస్వామ్య కుటుంబం నుండి వచ్చినప్పటికీ చుట్టూ ఉన్న వారిని చూసి పరిస్థితులను అధ్యయనం చేసి అసహ్యం వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. అటువంటి దోపిడీ పాలన అంతానికి తనకున్న యవాదాస్తిని ఫణంగా పెట్టి ప్రజల కొరకు త్యాగం చేసిన యోధుడు బీమిరెడ్డి నరసింహా రెడ్డి అని ఆయన గుర్తుచేశారు.

పాత సూర్యాపేట తాలూకా తో పాటు తుంగతుర్తి, జనగామ ప్రాంతంలో ఇప్పటికీ బీమిరెడ్డిని కొలుస్తుంటారని ఆయన తెలిపారు. తనకు జన్మనిచ్చిన అటువంటి ప్రాంతంలో గోదావరి నది జలాలతో సస్యశ్యామలం కావలన్నదే ఆయన తపన అన్నారు.ఆ తపన ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాకారం చేశారన్నారు.తాను నిర్మించిన పార్టీలో ఎన్ని కుట్రలు జరిగినా ప్రజల హృదయాలలో ఆయన చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకున్నారని ఆయన కొనియాడారు.యింకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, టి ఆర్ యస్ రాష్ట్ర కార్యదర్శి వై వి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE