– వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి
– భావోద్వేగాలకు గురికాకుండా ప్రజలు, టీడీపీ శ్రేణులు, అభిమానులు సంయమనం పాటించాలి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు
రాజకీయ కక్షతో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్న ఆయన పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిన తీరు, తదనంతర పరిణామాలతో మానసిక క్షోభకు గురై రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది గుండెపోటుతో మరణించడం బాధాకరం.
వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో ధర్మమే గెలుస్తుంది. ప్రజలు, టీడీపీ శ్రేణులు, అభిమానులు ఎవరూ భావోద్వేగాలకు గురికాకుండా సంయమనం పాటించాలి. మరణించిన వారి కుటుంబసభ్యులకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అండగా నిలుస్తుంది. విధ్వంస పాలకుడితో సాగిస్తున్న ఈ సమరంలో ప్రజలే న్యాయనిర్ణేతలు. వచ్చే ఎన్నికల్లో రాక్షస ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పడం ఖాయం.