Suryaa.co.in

Andhra Pradesh

బీజేపీ అండ లేకపోయినా పేదల అండ ఉందని ముఖ్యమంత్రి మాట్లాడటం చూస్తే జాలేస్తుంది

-నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం

బీజేపీ అండ లేకపోతే మనుగడ లేనట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది అనిపిస్తోంది అని,బీజేపీ అండ లేకపోయినా పేదల అండ ఉందని మాట్లాడటం ఆయన బేలతనాన్ని బయట పెట్టిందనిపించిందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు.

చిలకలూరిపేటలోని నవతరంపార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కలవడం,బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డా లతో చంద్రబాబు భేటి అనంతరం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆ ఇరువురు నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేయడం జగన్మోహన్ రెడ్డిని కలవరపాటుకు గురిచేసాయని ఆయన వ్యాఖ్యలు చూస్తే తెలుస్తోంది అని అన్నారు.

175 కి 175 గెలిచేస్తాం అనే వాయిస్ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట రావడం లేదని అన్నారు.రాష్ట్రంలో మద్యం ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి మద్యాన్ని అందించే పరిస్థితి కి రావడంతో తీవ్రంగా మహిళలు వ్యతిరేకిస్తున్నారు అన్నారు. టిడ్కో ఇల్లు ఇవ్వకుండానే వాటిని పబ్లిసిటీ కోసం వాడుకున్న ముఖ్యమంత్రి వైఖరికి ప్రజలు విసిగిపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 175 సీట్లు ఎలా గెలుస్తుందని అన్నారు.

ఇకనైనా ముఖ్యమంత్రి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుని మద్య నిషేధాన్ని అమలు చేయాలని నవతరంపార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పధకాలను తమవి అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారని బీజేపీ చేస్తున్న మాటలు తూటాల్లా పేలుతున్న సమయంలో ముఖ్యమంత్రి ఖండించేందుకు భయపడుతున్నారని రావుసుబ్రహ్మణ్యం అన్నారు. బీజేపీని చూసి ముఖ్యమంత్రి ఇంతగా భయపడటం గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇలా భయపడే ప్రత్యేక హోదా కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు.

LEAVE A RESPONSE