Suryaa.co.in

Andhra Pradesh

భువనేశ్వరి, బ్రాహ్మణిలపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు

-మహిళలకు ఆదర్శంగా నిలిచిన భువనేశ్వరి, బ్రాహ్మణిలపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు
– టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర

జగన్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక మహిళలకు ఆదర్శంగా నిలిచిన భువనేశ్వరి, బ్రాహ్మణిల మీద తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని తెలగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అతని సతీమణి వై.యస్. భారతి, ఎంపీ విజయసాయి రెడ్డి లకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో మూలాలు ఉన్నాయని దేశ వ్యాప్తంగా కోడై కూస్తోంది. వారిపై ఆరోపణలు వచ్చాయి కావున సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఆరోపణలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు దేశంలో ఎక్కడా జరిగి ఉండవు. జగన్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడు. అత్యంత ప్రమాదకర వ్యక్తి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాసి వైసీపీ ఎమ్మెల్యేలతో, మహిళలతో మాట్లాడిస్తున్నాడు. మహిళలంటే రాష్ట్రంలో, దేశంలో అత్యంత గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు.

పోతిన సునీత తెలుగుదేశం చరిత్ర, విధానాలు తెలుసుకుని మాట్లాడాలి. పోతిన సునీత చంద్రబాబు నాయుడు దయ వల్ల రాజకీయాల్లోకి వచ్చారనే విషయం మరచిపోకూడదు. జెడ్పిటిసిగా గెలవడానికి, ఎమ్మెల్యేగా పోటి చేసే అవకాశం రావడానికి, ఒడిపోయిన రాజికీయ ప్రాధాన్యత ఇచ్చి శాసనమండలి సభ్యురాలు కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడే అని గుర్తుచేసుకోవాలి.

గతంలో పోతిన సురేష్, పరిటాల రవీంద్ర, చమన్ అంటే ఎంతో విలువ ఇచ్చేవారు. నేడు స్వార్థ రాజికీయాలు, స్వప్రయోజనాల కోసం దిగజారి మాట్లాడటం బాధాకరం. గతంలో టీడీపీతో కలిసి పని చేసిన విధానాలకు, నేటి విధానాలకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రజలలోకి వచ్చి మీ మోహాలు చూపించుకోవాల్సి వుంటుంది కావున విజ్ఞతతో వ్యవహరించాలి. తాడేపల్లి ప్యాలెస్ లో రాసిచ్చిన స్ర్కీప్ట్ గురించి ముందూ వెనుక ఆలోచించకుండా మందు, ముక్క, మగువ అని మాట్లాడి ప్రజలలో దిగజారి పోయారు. అసలు ఆడవారు మాట్లాడాల్సిన బాషేనా? ఇది. జగన్ రెడ్డి చెప్పింది చేస్తే మీ పదవులు ఉంటాయని భావిస్తున్నారు.

మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు పై శాసన మండలి చర్చలో ఏ లబ్ధి చేకూరిందని జగన్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నారు. నేడు మీకు పదవి ఇచ్చారంటే జగన్ రెడ్డికి మీరు లొంగారా లేక మీకు జగన్ రెడ్డి లొంగారా? లేదా అమ్ముడు పోయారా? మీ మనసాక్షిని మీరు ప్రశ్నించుకోవాలి. బలహీన వర్గంలో పుట్టిన మీరు ఆ వర్గానికి గౌరవం పెంచేలా ప్రవర్తించాలి. నిన్న మాట్లాడిన మాటలు విన్న ప్రతి ఒక్క నాయకుడికి వైసీపీ స్వార్ధ రాజకీయం కోసం అలా మాట్లాడించారని తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు హెరిటేజ్ లో నారా భువనేశ్వరీ, బ్రాహ్మణి చేసేది పాల హెరిటేజ్ సంస్ధని రాష్ట్రానికి తలమానికంగా నిలిపారు. గౌరవంగా నడిపిస్తూ.. మహిళలకు ఏదైనా సాధ్యమే అని నిరూపించిన మహిళ నారా భువనేశ్వరి. నారా చంద్రబాబు నాయుడు రాజికీయాలలో తలమునకలు అవుతుంటే ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు ఆదర్శంగా నిలిచేలా హెరిటేజ్ సంస్థని లాభాల వైపు నడిపించిన ఘనత భువనేశ్వరిది.

ఎన్టీఆర్ ట్రస్ట్, కాన్సర్ ఆసుపత్రి లను బ్రాహ్మణి నడిపిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో అనేక మందికి ప్రాణ బిక్షపెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోడ్లని కూల్చారు. చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు చేశారు. అధికారులని లోబర్చుకొని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ తప్పు చేయని వ్యక్తి. పనికిరాని మద్యం బ్రాండ్లు మీరు పెట్టి బురద టీడీపీ, చంద్రబాబు నాయుడు మీద చల్లాలని చూస్తున్నారు.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వీధికో బెల్టు షాపు, విపరీతంగా సారా ఏరులై పారుతుంది. మీరు తెచ్చిన కల్తీ మద్యం బ్రాండ్లని తాగలేక, ఖరీదైన మద్యాన్ని కొనలేక మద్యానికి బానిసైన వారు సారా తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. జగన్ రెడ్డి రాష్ట్రంలో లిక్కర్ స్కాం చేస్తున్నాడు కనుకే డిజిటల్ పేమెంట్ అందుబాటులో పెట్టడం లేదు. నేడు చిన్న బడ్డీ కొట్టుకు వెళ్లిన డిజిటల్ పేమెంట్ సేవలు అందుబాటులో ఉంటున్నాయి.

గవర్నమెంటు వైన్ షాపులలో నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ అమ్మిస్తున్న జగన్ రెడ్డి. జగన్ రెడ్డి తీసుకున్న పాలసీ వల్ల మద్యం విక్రయాలు తగ్గాయి అని చెబుతున్నారు. అతను తీసుకున్న పాలసీ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గింది, జగన్ రెడ్డి ఖజానా పెరిగింది. క్యాష్ పెమెంట్ లు చేయించి తాడేపల్లి రాజప్రాసాదానికి తరలిస్తున్నారు. దాని వల్ల లిక్కర్ అమ్మకం తగ్గినట్టు రికార్డులలో కనిపిస్తుంది. లిక్కర్ అమ్మకం రాష్ట్రంలో పెరిగిందనేది వాస్తవం. వేలం పాటలు పెట్టి మరీ పిచ్చి సారాని గ్రామాలలో ఏరులై పారిస్తున్నారు. అరబిందోకి మొత్తం లిక్కర్ ని కట్టబెట్టారు. అధాన్ కి ఒక్క డిస్టలరీ కూడ లేదు. కాని లిక్కర్ వ్యాపారం మొత్తం అధాన్ పేరు మీద నడుస్తుంది. అదాన్ డిస్లరీస్ ని 2వేల కోట్లను ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ లో ఈఎండీ (ఎర్నస్ట్ మనీ డిపాజిట్) లుగా కట్టారని సిబిఐ తేల్చింది. ఇదంతా విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డి నడిపిస్తున్న మరో సూట్ కేస్ కంపెనీ.

రాష్ట్రాన్ని లిక్కర్, అక్రమ మైనింగ్ లతో దోచుకోవడం చేస్తూ పదవులకి కక్కుర్తి పడుతుంటే భవిష్యత్తు తరాలు నాశనమైపోతాయని వైసీపీ నాయకులకు కితాబిచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిబిఐ చేసిన విచారణలో వచ్చిన నిజాలని బయట పెట్టారు. విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్ అధినేత జగన్ రెడ్డి సతీమణి భారతికి దీనిలో సంబంధానాలు ఉన్నాయని స్వయాన సిబిఐ చెబుతుంది. ఆంధ్ర జగన్ రెడ్డి జే బ్రాండ్లు ఢిల్లీ వరకు ఏరులై పారుతుందని సిబిఐ పేర్కొంది.

ఈ కేసులో ఆధారాలతో సహా ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ అనే సంస్ధ ఏ5, సిబిఐ పేర్కొంది. ట్రైడెంట్ సంస్ధ డైరెక్టర్ గా ఉన్న పెనాక శరత్ చంద్రా రెడ్డి ఏ8 గా పెట్టింది. శరత్ చంద్రా రెడ్డి స్వయాన ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి తమ్ముడు. ఇది వాస్తవం కాదా.

అరబిందో కంపెనీలో 17 కంపెనీలకు విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, 12 కంపెనీలకు శరత్ చంద్రా రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇదంతా విజయసాయి రెడ్డి నడిపిస్తున్న లిక్కర్ వ్యాపారమే.ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి నిరూపించుకునే సాక్షాలు మీ దగ్గర లేవు. కనుకనే డైవర్ట్ పాలసీని అవలంబిస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు.

LEAVE A RESPONSE