Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపారాల నుంచి డబ్బులు తెచ్చి ఇస్తున్నారా?

-డబ్బులు ఇచ్చేది కేంద్రం.. పేర్లు పేట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి
-పులివెందులకు సుమారు 25 వేల ఇల్లు కేటాయిస్తే కట్టినవి కేవలం 1900 మాత్రమే
– ఉజ్వల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన భాజపా జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్

భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి ఆధ్వర్యంలో భాజపా జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ ముఖ్య అతిథిగా ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 కార్యక్రమంలో లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు స్టవ్ రెగ్యులేటర్ మొదలగు వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.

జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన దేశ ప్రధాని నరేంద్ర మోడీజీ మహిళలు కట్టెల పొయ్యలపై వంట చేస్తున్న సందర్భంలో వారికి ఎదురవుతున్న సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండి వారు అనారోగ్యానికి గురి కావడం ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా మహిళలను ఉద్దేశించి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మొదట విడతగా 9 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు.

ఇప్పుడు మరల రెండవ విడత సుమారు 75 లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పథకాలన్నిటికీ జగనన్న తోడు చేయూత దీవెన అని పలు రకాల పథకాలకు వారి పేర్లు పెట్టుకోవడం విడ్డూరమని అన్నారు.

డబ్బులు ఇచ్చేది కేంద్రం. పేర్లు పేట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి అని వారి సొంత వ్యాపారాల నుంచి ఏమైనా డబ్బులు తెచ్చి ఇస్తున్నారా ? అని ప్రశ్నించడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి సుమారు 25 లక్షల ఇల్లు కేటాయిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కఠినవి ఎన్ని ఆయన సొంత నియోజకవర్గ పులివెందులకు సుమారు 25 వేల ఇల్లు కేటాయిస్తే కట్టినవి కేవలం 1900 మాత్రమేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీరంగం దానేష్, ఎన్.వి.ఎస్ దిలీప్ వర్మ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమ్మిడి సుజాత రాజ్, మురళీమోహన్ రాజు, అత్తిలి శంకరరావు, కారాల మహేష్, కెవి రమణ, కొప్పిశెట్టి శంకరరావు, చల్లా మంజుల, మొదలగు వారు పాల్గొన్నారు

LEAVE A RESPONSE