Suryaa.co.in

Andhra Pradesh

ఉద్దానం కిడ్నీ బాధితులను అన్ని విధాల ఆదుకుంది తెలుగుదేశం పార్టీనే

– ఏడాదిలో పూర్తికావాల్సిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 4 సంవత్సరాల 7 నెలలైనా.. పనులన్నీ పూర్తికాకుండానే ఎన్నికల కోసం ప్రారంభోత్సవ నాటకం ఆడిన జగన్ రెడ్డి
– రూ.1,900 కోట్ల వ్యయంతో ఉద్దానంలో సురక్షిత తాగునీటి పనులకు శ్రీకారం చుట్టిన చంద్రన్న ప్రభుత్వం
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు

ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం భూమి కేటాయించడంతో పాటు అన్ని అనుమతులతో 12-02-2019న జీవో నెం.111ను జారీ చేసి పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది. ఏడాదిలో పూర్తికావాల్సిన ప్రాజెక్టు 4 సంవత్సరాల 7 నెలలు దాటినా అన్నిపనులు పూర్తికాకుండానే ఎన్నికల స్టంట్ కోసం ప్రారంభోత్సవం చేశారు. అంతా తానే పూర్తిచేసినట్లు అసత్యాలు చెబుతున్నారు.

ఇచ్ఛాపురం, కవిటి, పలాస, టెక్కలి, పాలకొండ, శ్రీకాకుళంలో టీడీపీ హయాంలో 6 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటుచేస్తే వాటిని కూడా నిర్వీర్యం చేసిన చరిత్ర జగన్ రెడ్డిది. సురక్షితమైన తాగునీరు ఇచ్చేందుకు టీడీపీ హయాంలో 175 ప్లాంట్లను ఏర్పాటుచేస్తే వాటిని కూడా నిర్వీర్యం చేశారు. అలాగే రూ.700 కోట్ల విలువైన సుజలధార ప్రాజెక్టుకు మొత్తం నిధులు తమ ప్రభుత్వమే వ్యయం చేసినట్టు జగన్ రెడ్డి కలరింగ్ ఇస్తున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జలజీవన్ మిషన్ 50%, రాష్ట్ర వాటాగా నాబార్డు నుంచి 50% నిధులతోనే ప్రాజెక్టు పనులు జరిగాయి.

అలాగే ఉద్దానంలో రోగులకు జగన్ రెడ్డి ప్రభుత్వం నుంచి వైద్యం సరిగా అందడం లేదు. వారికి కావాల్సిన మందులు అరకొరగా అందిస్తున్నారు. వైద్యుల కొరత ఎక్కువగా ఉంది. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోగులకు అందాల్సిన వైద్య సేవలూ అంతంతమాత్రంగా ఉన్నాయి. మొత్తంగా చంద్రబాబు ఉద్దానం బాధితులకు ప్రయోజనకరమైన పనులు చేయగా.. జగన్ రెడ్డి కొసరు పనులతో బిల్డప్ ఇస్తున్నారు. ఎన్నికల స్టంట్లు చేస్తూ ప్రజలను మళ్లీ మోసంచేసేందుకు సిద్ధమయ్యారు.

కిడ్నీ బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం విశేష కృషి
1. 200 పడకల ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు 4.50 ఎకరాల భూసేకరణ, నిధులు మంజూరు చేయడమైంది.
2. రూ.1,900 కోట్ల వ్యయంతో ఉద్దానంలో సురక్షిత తాగునీటి పనులకు శ్రీకారం-తొలి విడతగా రూ.468 కోట్లు ఖర్చు
3. 27 రకాల ఉచిత మందుల పంపిణీ
4. 1,20,000 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు

LEAVE A RESPONSE