– 2014-19 మధ్య కాలంలో తూర్పులో 8 విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మాణం చేశాం
– విద్యుత్ రెవెన్యూ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ: విద్యుత్ రంగంలో సంస్కరణలు మొదటిగా మొదలు పెట్టింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు.
శనివారం ఉదయం 3వ డివిజన్ పరిధిలోని కనకదుర్గా నగర్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించి స్థానికులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కనకదుర్గా నగర్ నూతనంగా నిర్మాణం చేసిన విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ విద్యుత్ రంగంలో మొట్టమొదటి సారిగా సంస్కరణలను ప్రవేశపెట్టి నాణ్యమైన విద్యుత్ను వినియోగదారులకు అందచేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడేదనని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగా మన రాష్ట్రంలోనే విద్యుత్ సంస్కరణలను చంద్రబాబునాయుడు మొదలు పెట్టారన్నారు.
గతంలో తాను ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏ గ్రామానికి వెళ్ళినా మొదటిగా ఎదురయ్యేది విద్యుత్ సమస్యలేనని అన్నారు. సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోవడం లేదా నాణ్యమైన విద్యుత్ అందడం లేదని ప్రజలు చెప్పేవారని అన్నారు. ఈ వ్యవస్థలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క వినియోగదారుడికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావించి ముందుకు సాగారన్నారు.
ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ను రాష్ట్రం మొత్తం అందివ్వగలుగుతున్నారని చెప్పారు. 2014 సంవత్సరంలో ఈ విద్యుత్ సబ్ స్టేషన్ పరిసరాల్లోకి రావడానికి కూడా స్థానికులు భయపడేవారని చెప్పారు. ఎక్కడ విద్యుత్ వైర్లు తగిలి షాక్ కోడుతుందోనని పిల్లలను ఇటువైపునకు పంపే సాహసాన్ని తల్లిదండ్రులు చేసేవారు కాదన్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఆధునీకరణ చేయడంతో పిల్లలు సైతం ఈ విద్యుత్ సబ్ స్టేషన్కు ధైర్యంగా రావచ్చునని అన్నారు.
2014-19 సంవత్సరంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తూర్పు నియోజకవర్గంలో 8 నూతన విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మాణం చేశానని చెప్పారు. ఈ విద్యుత్ సబ్ స్టేషను మోడరన్ విద్యుత్ సబ్ స్టేషన్గా నిర్మాణం చేశామన్నారు. ఇలాంటి విద్యుత్ సబ్ స్టేషన్లను మరిన్ని నిర్మాణం చేస్తామని చెప్పారు.
విద్యుత్ శాఖ ఎస్.ఈ మురళీమోహన్ మాట్లాడుతూ నూతన విద్యుత్ సబ్ స్టేషన్ను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ విద్యుత్ సరఫరాతో పాటుగా ఈ కేంద్రంలో విద్యుత్ బిల్లులను కూడా వినియోగదారులు చెల్లించవచ్చునని అన్నారు. 3600 సర్వీస్లతో విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించామన్నారు.
డీ.ఈ. హరిబాబు మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల చెల్లింపుతో పాటుగా విద్యుత్ శాఖకు సంబంధించిన ఏ ఇతర సమస్యలనైనా ఈ కేంద్రానికి వచ్చిన వినియోగదారులు పరిష్కరించుకోవచ్చునని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, తాడి బాబూరావు, గుత్తికొండ కృష్ణమోహన్, గుల్లపల్లి నారాయణరావు, గుత్తికొండ మోహనరావు, యలమంచిలి పండు, దాడి సుబ్బారావు, యలమందరావు, సీతారామయ్య, గోగినేని రాజేంద్రప్రసాద్, కె.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు