Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పాలనకు ఫిట్ కాడని కోర్టులో వేసిన అఫిడవిట్ తో తేలిపోయింది

– బీజేపీ ఫీడ్‌బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్

జగన్ పాలనకు ఫిట్ కాడని అమరావతి నిర్మాణం పైన కోర్టులో వేసిన అఫిడవిట్ తో తేలి పోయింది.ఒక్క రాజధాని కి 60 నెలలు అయితే, మూడు రాజధానులకు 180 నెలలా?
అదే భూసేకరణ లేదా సమీకరణ కూడా జగన్ చేయాల్సి వస్తే 1800 నెలలు కావాలేమో.

నాడు ప్రపంచ బ్యాంక్ అమరావతి భూముల భవిష్యత్తు నగదీకరణ హామీతో ఇవ్వడానికి సిద్దమైన 25 వేల కోట్ల రుణం కాలరాసింది ఎవరు?
నేడు 480 ఎకరాలు అమరావతి రాజధాని భూములు తాకట్టు పెట్టి 3 వేల కోట్ల రుణం తెచ్చి, ఆ భూములనే అమ్మి ఆ అప్పు తీరుస్తామన్న ప్రతిపాదన ఎవరిది? 3 సంవత్సరాల సమయం వృథా చేసి, ఇప్పుడు ఆగిన పనులకు కాంట్రాక్టర్లను వెతుకు తున్నారా?

రాజధాని విషయంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం మాటలు ఒకదానికొకటి పొంతన లేదు, రాష్ట్రంలో నిర్మాణల కోసం ఒక ఇటుక వేసే శక్తి లేదు. రాష్ట్రంలో జగన్ పాలన పోవడంతోనే రాజధాని అమరావతి నిర్మాణం దానంతట అదే పరుగులు తీస్తుంది అనేది ప్రజల నమ్మకం.

LEAVE A RESPONSE