– వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రాజకీయం మారుతుంది
– తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది
– భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: బీహార్ ఎన్నికల ఫలితాలు మన భవితరాల ఆలోచనలు ఏ దిశలో ఉన్నాయో ప్రతిబింబిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, నేపాల్లో ‘జెంజీ’ (Gen Z) తరం అల్లర్లు సృష్టించినట్టుగా, ఎన్నికల కమిషన్ను తగలబెడతామని బెదిరించినా, బిహార్ ప్రజలు ఎన్డీఏకు బంపర్ మెజారిటీ ఇచ్చారు. ఇది కేవలం అభివృద్ధిని చూసి, డబుల్ ఇంజన్ సర్కార్ పాలనపై విశ్వాసంతో ప్రజలు ఇచ్చిన తీర్పు.
కాంగ్రెస్ కూటమిలోని ముఖ్య నాయకులు ఓడిపోవడం, కాంగ్రెస్ కేవలం ఒక్క సీటుకే పరిమితం కావడం ప్రజలు వారిని ఏ మాత్రం నమ్మలేదనడానికి నిదర్శనం. ఇక తెలంగాణ విషయానికి వస్తే… ముఖ్యంగా జూబ్లీహిల్స్లో బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు, పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు నా కృతజ్ఞతలు. ఇక్కడ కాంగ్రెస్ గెలుపు కాదు, అది నిజానికి ఎంఐఎం (AIMIM)కి ఇచ్చిన తీర్పు. గతంలో గెలిచిన అభ్యర్థి ఎంఐఎం నుండి పోటీ చేయడం, అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు అయినప్పటికీ, మేము గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించాం. కానీ బీఆర్ఎస్ ఓడిపోయిన ఇప్పటికి మాదే అధికారం అని చెప్పుకుంటుంది.
ఇది ప్రజల తీర్పు కాదు. అయితే, డబ్బు, అధికారం, ప్రలోభాలతో కాంగ్రెస్ అక్కడ గెలిచింది. కానీ, గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడ వార్డు మెంబర్ కూడా లేని త్రిపురలో ఈ రోజు బీజేపీ అధికారం చేపట్టింది. అందుకే నేను నమ్ముతున్నాను. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రాజకీయం మారుతుంది, తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. మేము ప్రజా వంచన పార్టీ అయిన కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతాం. రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయం అవుతుంది.