– సీఎం సూచన
– జీవో జారీ
– రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కలిగిన ఊరట
అమరావతి: రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట లభించింది. గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయే కు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్ లలో అసైన్డ్ అని ప్రభుత్వం పేర్కొన్నది. అసైన్డ్ అని ఉండటంతో తమ ప్లాట్ లు అమ్ముడు పోవడం లేదని ప్రభుత్వానికి రైతులు తెలిపారు.
అసైన్డ్ రైతులు ఇచ్చిన భూములకు కూడా రిటర్నబుల్ ప్లాట్ల లో అసైన్డ్ అనే పదం తీసివేసి పట్టా భూమి అని పేర్కొనాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ మేరకు ఈ రోజు ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24 లోని కాలం నంబర్ 7, రూల్ నంబర్ 11 (4) క్లాజ్ ను మారుస్తూ జీవో నంబర్ 187 ను పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ విడుదల చేశారు. దీంతో రైతులు ఆనంద పడుతున్నారు.