-
ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
-
90 మత్స్యకార కుటుంబాల వారికి పురిటిగడ్డ ఐవీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.లక్షా ఎనిమిది వేల విలువైన నిత్యవసర సరుకులు దుప్పట్లు
నాగాయలంక : ఎదురు మొండి దీవుల్లో పూర్తిగా కోతకు గురైన గొల్లమంద – జింకపాలెం రోడ్డు శాశ్వత పునర్నిర్మాణ కార్యక్రమానికి కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.
శుక్రవారం నాగాయలంకలో ఏటికట్ట వద్ద పూర్తిస్థాయిలో వరద ముంపునకు గురైన 90 మత్స్యకార కుటుంబాల వారికి పురిటిగడ్డ ఐవీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.లక్షా ఎనిమిది వేల విలువైన నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వరద బాధిత మత్స్యకార కుటుంబాల వారికి ఐవీఎం ట్రస్ట్ సహాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి విపత్తు నేపథ్యంలో ఆపదలో ఆపన్న హస్తం అందిస్తున్న ఐవీఎం ట్రస్టు చైర్మన్ డాక్టర్ వేములపల్లి సురేష్ – రోజా దంపతుల సేవలు ఆదర్శనీయమన్నారు. విపత్తు వేళ ప్రభుత్వ సహాయంతో పాటు దాతల సహాయం తోడైతే వరద బాధితులకు ఉపశమనం లభిస్తుందన్నారు. 1977 ఉప్పెనకు మరుభూమిగా మారిన దివిసీమను దివ్యసీమగా మార్చేందుకు ప్రపంచ దేశాల నుంచి తరలివచ్చిన దాతలు సహాయమే కీలక భాగస్వామ్యంగా మారిందని తెలిపారు.