Suryaa.co.in

Andhra Pradesh

జబర్దస్త్ ఆంటీ, నారాయణస్వామి తిరుమల దర్శనం టిక్కెట్లను అమ్ముకుంటున్నారు

-జగన్ ది గవర్నమెంట్ ఆర్డర్… లోకేష్ ది పబ్లిక్ ఆర్డర్
-జగన్ రెడ్డి జలగలాంటి వ్యక్తి
-జగన్ రెడ్డిది ఓ దరిద్రపు పాదం… ఆయన పాలనలో రాష్ట్రానికి అన్నీ అరిష్టాలే
-రాయలసీమకు పట్టిన శని జగన్ రెడ్డి
-చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ బహిరంగసభలో యువనేత నారా లోకేష్

నేడు వెంకటేశ్వరస్వామి పాదాల చెంత నిలబడి మీతో మాట్లాడడం నా అదృష్టం.విజయనగరం సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన గడ్డ ఈ చంద్రగిరి గడ్డ. విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా కూడా ఉంది చంద్రగిరి.ఈ పవిత్రమైన గడ్డపై నిలబడి మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ల్యాండ్, శాండ్, వైన్, మైన్, ఎర్రచందనం మాఫియా ఈ నియోజకవర్గంలో నేడు పేట్రేగిపోతోంది. తాడేపల్లి ప్యాలెస్ లో పిల్లి 4 సంవత్సరాలు ఇంట్లో పడుకుని…యువగళం దెబ్బకు భయపడి పల్లెనిద్రకు వెళతానని అంటున్నాడు. అది యువగళం దెబ్బ… నేను యువగళం ప్రారంభించే ముందే తాడేపల్లి పిల్లి జీఓ-01ను తెచ్చారు. దాన్ని అడ్డుపెట్టి నన్ను రోడ్డపై నిలబడనివ్వడం లేదు. మైక్ పట్టుకోనివ్వడం లేదు. సౌండ్ వాహనాలు లాక్కుంటున్నారు. నేను నిలబడే స్టూల్ లాక్కుంటున్నారు. జగన్ ది గవర్నమెంట్ ఆర్డర్… లోకేష్ ది పబ్లిక్ ఆర్డర్.జగన్ గవర్నమెంట్ ఆర్డర్ తో నన్న ఆపాలని చూస్తున్నారు…కానీ పబ్లిక్ ఆర్డర్ ను మాత్రమే నేను గౌరవించి మీ వద్దకు వస్తున్నాను.

గవర్నమెంట్ ఆర్డర్ తో నా దగ్గర వందలాది పోలీసులు, వజ్ర వాహనం, ఇంటెలిజెన్స్ వాళ్లను తిప్పుతున్నారు.2019ఎన్నికల సమయంలో మీరు యువతకు ఇచ్చిన హామీలు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతియేటా 6500పోలీసు ఉద్యోగాలు, మెగా డీఎస్సీ లను నెరవేరిస్తే నా సౌండ్ వెహికల్స్ స్వచ్చందంగా ఇచ్చేస్తా.మహిళలకు ఇచ్చిన 45 ఏళ్లకే బీసీ,ఎస్సీ,ఎస్టీ మహిళలకు పెన్షన్, ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి, మద్యపాన నిషేదం లాంటి హామీలను నిలబెట్టుకుంటే నా మైక్ సరెండర్ చేస్తా. పోలీసులకు జగన్ రెడ్డి చాలా బాకీ పడ్డారు. పెండింగ్ లో ఉన్న 4 సరెండర్లు, 8 టీఏ, డీఏ బిల్లులు, మెడికల్ బిల్లులు ఇచ్చేస్తే నా స్టూల్ కూడా జగన్ రెడ్డి కి ఇచ్చేస్తాం. జగన్ రెడ్డి జలగలాంటి వ్యక్తి. ఇతను మనల్ని జలగలా పట్టి పీల్చేస్తున్నాడు. వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరుతో రూ.10వేలు లాక్కుని మనకు పనికిరాని పట్టాలు ఇచ్చారు. అవి బ్యాంకుల్లో చెల్లడం లేదు. ఒక్క రూపాయి రుణం ఇవ్వడం లేదు.

నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇసుక, సిమెంట్, ఇంటిపన్ను, చెత్తపన్ను, విద్యుత్ ఛార్జీలు ధరలు విపరీతంగా పెంచేశారు. పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుస్తున్నారు. రానున్న కాలంలో పీల్చే గాలిపై జలగ జగన్ పన్ను వేస్తాడు జాగ్రత్తగా ఉండండి. జగన్ రెడ్డి పాలనలో వైసీపీ నాయకులు దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తున్నారు. దళితులను చంపిన వాళ్లకు జైలు నుండి విడుదలైన వారికి పాలాభిషేకాలు, గజమాలలతో సత్కరిస్తున్నారు. సుబ్రమణ్యం ని చంపేసిన అనంతబాబు కి సన్మానాలు చేశారు. డాక్టర్ సుధాకర్, కిరణ్, ఓం ప్రతాప్ వంటి దళితులను జగన్ రెడ్డి పొట్టనబెట్టుకున్నారు.వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేశారు. దళితుల నిధులు పక్కదారి పట్టించారు. ఇలాంటి పాలనలో దళితులు పైకి వస్తారా? దళితుల ఓట్ల తో గెలిచిన జగన్ ఇప్పుడు దళితులకు గుండు కొట్టిస్తున్నారు. జగన్ రెడ్డిది ఓ దరిద్రపు పాదం… ఆయన పాలనలో రాష్ట్రానికి అన్నీ అరిష్టాలే.

కచ్చులూరు బోట్ ప్రమాదం లో 51మంది, ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 15మంది, అన్నమయ్య డ్యామ్ ఘటనలో 62మంది చనిపోయారు. రాయలసీమకు పట్టిన శని జగన్ రెడ్డి. కడపజిల్లాకు స్టీల్ ఫ్యాక్టరీ లేదు. అప్పర్ తుంగభద్రకు రూ.5,300కోట్లను కేంద్రం కేటాయిచింది. అప్పర్ తుంగభద్ర పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుంది.అమర్ రాజా బ్యాటరీ కంపెనీని మన రాష్ట్రం నుండి జగన్ రెడ్డి తరిమేశాడు…తెలంగాణ మంత్రి కేటీఆర్ అమర్ రాజా కంపెనీకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాడు.ఈ కంపెనీ మన రాష్ట్రం నుండి పోవడం వల్ల 20వేల మంది మన యువకులు ఉద్యోగాలు కోల్పోయారు. జగన్ రెడ్డి ముసలోడి మాదిరిగా కొబ్బరికాయ కొట్టడానికి కూడా వంగలేకపోతున్నాడు. వెయ్యి మంది పోలీసులు అడ్డుకున్నా, 7కిలోమీటర్లు వేగంగా నడిచి సభ పెట్టిన యువకుడు చంద్రబాబు. రాయలసీమకు చంద్రబాబు అనేక కంపెనీలు తీసుకొస్తే…జగన్ రెడ్డి వాటిని రాష్ట్రం నుండి తరిమేస్తున్నాడు.ఇదే వీరిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం. జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి.

జగన్ రెడ్డి పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు…ఫ్యాక్షనిస్టు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. కలియుగదైవం వెంకటేశ్వరస్వామి ఆలయంలోని బోర్డు మెంబర్ పోస్టులను జగన్ రెడ్డి అమ్ముకున్నాడు. నేర చరిత్ర ఉన్న వారు కూడా బోర్డు లో వేసి జంబో బోర్డు ఏర్పాటు చేసారు. టీటీడీ భూములను కూడా జగన్ రెడ్డి అమ్మాలని ప్రయత్నం చేశారు. జబర్దస్త్ ఆంటీ, నారాయణస్వామి, చిత్తూరుజిల్లా వైసీపీ నాయకులు వెంకటేశ్వరస్వామి ఆలయం దర్శనం టిక్కెట్లను అమ్ముకుంటున్నారు. తిరుమల కొండ పై గంజాయి దొరికింది అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం అవుతుంది. సామాన్య భక్తులకు దేవుడ్ని దూరం చేసాడు జగన్. జగన్ రెడ్డి పింక్ డైమండ్ ఎక్కడుంది? తాడేపల్లి ప్యాలెస్ లాకర్లో ఉందా? ఎక్కడుంది? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. సొంతబాబాయ్ ని చంపినవాడిని, పేదవాళ్లను వేదించేవారంతా సైకోలే. ఈ సైకోలు జిల్లాకొక పిల్ల సైకోలను తయారుచేస్తున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా కి పెద్ది రెడ్డి ఒక సైకో. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా లు అన్నీ పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి. చంద్రగిరిలో మూడు సీ లు ఉన్నాయి. అవి 1.చంద్రగిరి 2. చెవిరెడ్డి. 3.చెవిలో పువ్వు.

చంద్రగిరిలో చెవిరెడ్డి కొండంత దోచుకుని ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నాడు.చెవిరెడ్డి ఎమ్మెల్యే, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్, ప్రభుత్వ విప్ అనే 4 పదవులు చేతిలో పెట్టుకుని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.నియోజకవర్గంలో కనీసం సాగు,తాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయలేదు. రోడ్లు లేవు. చెవిరెడ్డి మీ ఓట్లతో గెలిచి వెయ్యి రూపాయలు దోచుకుని…మీకు రూ.10 ఇస్తున్నారు. చెవిరెడ్డి, ఆయన అనుచరులు ఎర్రచందనంతో వెయ్యికోట్లు దోచుకున్నారు. వెంకటేష్ ఆచార్య అనే వైసీపీ నాయకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు.కారణం తెలుసుకుంటే కాంట్రాక్టు పనులు చేస్తే డబ్బులు ఇవ్వకుండా..అతన్ని బెదిరించి భూములు బలవంతంగా రాయించుకున్నారు.చెవిరెడ్డి తమ్ముడు రఘ ఎమ్మెల్యే కంటే ఎక్కువగా అధికారం చెలాయిస్తున్నాడు. చెవిరెడ్డికి చీటీల ఎమ్మెల్యే అని పేరు ఉంది.ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ చెవిరెడ్డి తమ్ముడు రఘు దోచుకుంటున్నాడు. రూ.120కోట్ల విలువగల 60ఎకరాల భూమిని దోచుకున్నాడు.చెరువుల భూములను దోచుకుంటున్నాడు. స్వర్ణముఖి నదిలో నుండి రోజుకు 300ట్రక్కుల ఇసుక టిప్పర్లతో దోచుకుంటున్నాడు. చంద్రగిరి ప్రజలను గంజాయి బానిసలుగా చేస్తున్నాడు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏపీని డ్రగ్స్ కు హబ్ గా మార్చాడు. చంద్రగిరి నియోజకవర్గంలో పసుపుజెండా ఎగిరి 30ఏళ్లు అయ్యింది. చరిత్ర తిరగరాయండి…నానిని భారీ మెజారిటీతో గెలిపించండి..చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగురవేయండి. చంద్రగిరిని అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటా. టిడిపి అధికారంలోకి వచ్చాక చంద్రగిరి లో వరి, మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం.

గాలేరు-నగరి, హంద్రీనీవా పూర్తిచేస్తాం. సాగు, తాగు నీరు ఇస్తాం.వరదల్లో కొట్టుకుపోయిన వంతెనలను కట్టిస్తాం.నిత్యావసర ధరలు, ఇసుక ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు కల్పిస్తాం.మహిళలు, కార్మికులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు అందరూ ఏకమై చంద్రబాబును సీఎం చేయండి.నిరుద్యోగ యువత కు ప్రతి ఏడూ నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రైవేట్ రంగంలో కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం. స్వయం ఉపాధి కి సహకారం అందిస్తాం. మీ సమస్యల్నింటినీ మేం పరిష్కరిస్తాం అని హామీ ఇస్తున్నాం. మన బాధలు పోవాలంటే… బాబు రావాలి. సైకో పోవాలి….సైకిల్ రావాలి…

LEAVE A RESPONSE