“చెరిపేస్తే చెరిగిపోతే.. సత్యమేవ జయతే అనే మన దేశ అధికార నినాదానికి అర్థం లేదు. కర్మ డబుల్ ఎంట్రీ ఖాతా వ్రాస్తుంది”.
డమ్మీ జీఎస్టీ – మహా మేధావుల ప్లాన్స్!
డమ్మీ జీఎస్టీలు, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించేంత ‘క్రియేటివ్’ బుర్ర ఉన్నప్పుడు, లీగల్‌గా వ్యాపారం చేసి వుంటే దేశానికే జీఎస్టీ కట్టే కింగులు అయ్యేవారు ఈ జాకో బ్రదర్స్.
ఫినాయిల్ అని పార్సెల్ బుక్ చేసి, లోపల ‘మహత్తరమైన’ స్పిరిట్ తరలించడం చూస్తే… ఈ జాకో బ్రదర్స్ వ్యాపారం కాదు, ఒక చౌకబారు జేమ్స్‌బాండ్ మిషన్ అని అర్థమవుతోంది.
నిందితులు కీలక ఆధారాలు ఫోన్ల నుంచి తొలగించారట! కానీ ఏం లాభం? మన ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల ముందు, ఆ డిలీటెడ్ డేటా కూడా ‘సత్యమే జయతే’ అంటూ బయటికొచ్చింది! స్కాములకు డిలీట్ బటన్ వుంటే గురువు జగన్ గారు కోర్టుకు దగ్గర కాలాక్షేపం చేసేవారు కాదు కదా. బాదల్ దాస్ (ఏ7)తో నకిలీ మద్యం తయారుచేసేటప్పుడు వీడియో తీయడం పరాకాష్ట. ఏదో ఈ జాకో బ్రదర్స్ కొత్త ‘బ్రాండ్ లాంచ్ ఈవెంట్’ కోసం ప్రమోషన్స్ కోసం అన్నట్లు?
అచ్చం గురువు జగన్ లిక్కర్ స్కాములో కరెన్సీ డంపులలో కోట్ల రూపాయల గుట్టలను కూడా ఇలా వీడియోలు తీసి మరీ బాసులకు పంపి, చెవిరెడ్డి నుండి అందరూ అడ్డంగా దొరికారు.
సీసాలు సరఫరా చేసిన శ్రీనివాస్ రెడ్డి (ఏ11) గారు, కంప్యూటర్లో దొరికిన వాట్సప్ సంభాషణలు, కాల్ రికార్డులు అన్నీ మావి కావు, ఏ13 (శ్రీనివాస రావు) వి అని తప్పించుకోలేరు! ఆ డమ్మీ జీఎస్టీ పక్కన ఈ డమ్మీ కవర్ స్టోరీ అవసరం లేదు! కర్మ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ మెయింటైన్ చేస్తుంది. ఒక ప్రక్క దొరికితే అవతలి పక్క భాగస్వామి కూడా అడ్డంగా దొరికిపోక తప్పదు. మొన్న అనంతపురంలో వైకాపా కామాత్ముడు ఇలా రికార్డు చేసి మరో మహిళపరువు తీశాడు.
లేబుళ్లు & క్యారమెల్: ‘కళాత్మక’ స్కామ్!
రవి (ఏ4) గారు, శ్రీనివాస రావు (ఏ13) గారూ, వాట్సప్‌లో పంపిన లేబుళ్ల డిజైన్లు చూస్తే… మీరు మద్యం మాఫియా కాదు, నకిలీ లేబుళ్ల డిజైనర్లు అనిపిస్తోంది! ఆ నకిలీ లేబుళ్లు తయారుచేయడానికి వీరు పడినంత కష్టం, నిజమైన మద్యం బ్రాండ్ వాళ్ళు కూడా పడరేమో!
కల్తీ లిక్కర్‌కి ఒరిజినల్ ‘రంగు, రుచి’ ఇవ్వడానికి బెంగళూరు నుంచి తెప్పించిన క్యారమెల్ తెప్పించినట్లున్నారు.
ఆంధ్రప్రదేశ్ బోర్డర్లలో సామాన్యుడు ఒక్క సీసా అడ్డుకున్న జగన్ జమానాలో.. హైదరాబాద్‌లో కొని, 35 లీటర్ల క్యాన్లలో నింపి, ఆటోల్లో తెచ్చి మన ఆర్టీసీ బస్సుల్లో తరలించడం… కేవలం లిక్కర్ స్మగ్లింగ్ కాదు, గురువు మహా తెలివితేటల లిక్కర్ స్కామునే హైజాక్ చేసిన జాకో బ్రదర్స్ కల్తీ లిక్కర్ స్కాం ఇది.
చివరికి గురుదక్షిణగా చంద్రబాబు పాలనను అప్రదిష్టపాలు చెయ్యాలని మొలకలచెరువులో దొరికి, మొదలెట్టిన చెడ్డీ దోస్తులుగా పుట్టి పెరిగిన ఇబ్రహీం పట్నంలో వరకు ఇరుక్కుపోయిన జాకో బ్రదర్స్ చిప్పకూడు తింటున్నారు.
– చాకిరేవు