Suryaa.co.in

Andhra Pradesh

యేసు చూపిన బాటలో జగన్ పరిపాలన

– వైయస్ విజయమ్మ బైబిల్ చేతబట్టి ధైర్యం పొందారు
-యేసు క్రీస్తు బోధనలు అనుసరణీయం
-యేసు చూపిన బాటలో పరిపాలన సాగిస్తున్న వైఎస్ జగన్ కు అందరూ అండగా నిలవాలి
-కుల, మత,ప్రాంతీయ,జాతి భావన లేకుండా పేద,ధనిక అంతరాన్నివైయస్ జగన్ తగ్గిస్తున్నారు
– వైయస్ జగన్ కు ఏ సైతాన్ కూడా అడ్డుపడకుండా అందరూ అండగా నిలవాలి
– క్రిస్మస్ వేడుకల్లో శాసన మండలిలో ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి

యేసు క్రీస్తు చూపినబాటలో ప్రయాణిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తున్న వైఎస్ జగన్ కి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని శాసన మండలి లో ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి కోరారు. తాడేపల్లి లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన గ్రాండ్ సెమీ క్రిస్మస్ ఆరాధన వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా యేసుక్రీస్తు బోధనల గొప్పదనం గురించి క్రైస్తవ మత పెద్దలు వివరించారు.సమాజంలోని ప్రతి ఒక్కరూ క్రీస్తు సూచించిన మార్గం అనుసరించడం ద్వారా జీవితంలో నమ్మకాన్నివిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం క్రీస్తును ఎంతగానో ఆరాధిస్తుందన్నారు. దురదృష్టవశాత్తు వైయస్ రాజశేఖరరెడ్డి మృతి చెందిన సమయంలో వైయస్ విజయమ్మ బైబిల్ చేతబట్టి ధైర్యం పొందారన్నారు.

చాలామంది కుసంస్కారులు ఎన్ని విమర్శలు చేసినా వెరవక బైబిల్ నా చెంత ఉంటే జీవితం పట్ల అత్యంత ధైర్యం,నమ్మకం కలుగుతుందని ఆమె స్వయంగా చెప్పారన్నారు. అదే విధంగా వైయస్ రాజశేఖరరెడ్డి యేసు చెప్పిన విధంగా పేదల హృదయాలను చూరగొని వారి విశ్వాసాన్ని నమ్మకాన్ని పొందారన్నారు. వైయస్ జగన్ కూడా కులం,మతం,ప్రాంతం,జాతి అనే బేధం లేకుండా అందరికి సంక్షేమ ఫలాలు అందే విధంగా పరిపాలన సాగిస్తున్నారన్నారు.రానున్న కాలంలో వైయస్ జగన్ కు ఎటువంటి సైతాన్లు అడ్డుపడకుండా అందరూ అండగా నిలవాలని కోరారు.

ఈ సందర్భంగా అధికారప్రతినిధులు కాకుమాను రాజశేఖర్,నవరత్నాల నారాయణమూర్తి,నారమల్లి పద్మజ,జేసిఎస్ జోన్ అధ్యక్షుడు పుత్తాప్రతాపరెడ్డి, మాదిగ కార్పోరేషన్ ఛైర్మన్ కనకారావు మాదిగ,లిడ్ క్యాప్ డైరక్టర్ కోనేరు సత్యప్రియ,పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE