Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం

– కేంద్ర బడ్జెట్ పై స్పందించాలంటే జగన్ భయపడుతున్నారు
– రాష్ట్ర సమస్యలపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఏపీకి జరిగిన అన్యాయంపై తక్షణమే రాజీనామా చేయాలి
– రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలంటే వైసీపీ పోవాలి
28 మంది ఎంపీలుంది ఊడిగం చేయడానికా.?
-టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వెంకటరెడ్డి

కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు బుధవారం ఆయన జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడారు.

బడ్జెట్ పై ప్రశ్నించాలంటే ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం 2022-23కు సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని, ఈ బడ్జెట్ లో కొన్ని అంశాలు రాష్ట్రానికి, మరికొన్ని కేంద్రానికి సంబంధించిన అంశాలు ఉంటాయన్నారు. జాతీయ స్థాయిలో ఈ బడ్జెట్ పెద్ద ఆశాజనకంగా లేదని, వేతన జీవులు, చిరు వ్యాపారులు కోరుకున్న పన్ను వెసులు బాటు లభించలేదన్నారు. 2014-15 బడ్జెట్ లో మాత్రమే కొంత వెసులు బాటు ఉందన్నారు. రూ.39.45 లక్షల కోట్ల బడ్జెట్ చేస్తే అందులో రూ.16.81 లక్షల కోట్లు లోటు ఉందని, బడ్జెట్ లో సుమారు 40 శాతం అప్పు తెచ్చుకుని దేశాన్ని నడిపిండచడం ఆందోళ కలిగిస్తోందన్నారు.

విభజిత రాష్ట్రమైన ఏపీని మిగతా రాష్ట్రాలతో శాఖాపరమైన కేటాయింపులు కాకుండా విభజన చట్టం ద్వారా హక్కుగా రావాల్సిన అంశాలు ఉన్నాయని, అవి కేంద్రం ఇవ్వాలి..మనం పోరాడి సాధించుకోవాలన్నారు. దేశం మొత్తంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కేంద్ర బడ్జెట్ పై స్పందించాయని, మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నోరుమెదపలేదని మండిపడ్డారు. ‘‘ఎన్డీయేలో వైసీపీ భాగం లేదు, మిత్రపక్షమూ కాదు మరి ఎందుకు కేంద్ర బడ్జెట్ ను సమర్థిస్తున్నారు.? ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంత వరకు బడ్జెట్ పై మీడియా ముందుకు రాలేదు.

కేంద్రాన్ని పల్లెత్తి మాట అనలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి కేంద్రం దగ్గరకు వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన వాటిపై వినతిపత్రం సమర్పిస్తారు. పార్టీ ఎంపీల ద్వారా సంబంధాలు కొనసాగిస్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి అలాంటివేమీ పట్టించుకోలేదు. కనీసం పార్లమెంట్ లో పోరాడాలని తన ఎంపీలకు చెప్పలేదు. కేంద్రానికి ముఖ్యమంత్రి భయపడి, ముఖం చాటేస్తున్నారు. రాష్ట్ర

ప్రయోజనాలు కాపాడలేనప్పుడు ఇంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు.? వాళ్లు ఉంటే ఎంత..ఊడితే ఎంత.? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూనియన్ బడ్జెట్ పెట్టిన ప్రతిసారి టీడీపీపై ఒంటికాలి మీద వచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కేంద్రాన్ని బడ్జెట్ కు ముందు, తర్వాత కావాల్సిన వాటిని గురించి వెళ్లి ప్రస్తావించేవారు. నాడు టీడీపీ భయపడిందని మాట్లాడిన మీరు నేడు చేసేదేంటి.?

బీజేపీకి ఎంత వత్తాసు పలుకుతున్నారో తెలుసుకోండి.? బీజేపీ సీఎంలు బయటకు వచ్చి మాట్లాడినా ఏపీ ముఖ్యమంత్రి మాత్రం బయటకు రాలేదు. కేంద్ర బడ్జెట్ అంటే భయమా.. అవగాహన లేదా.? హక్కుగా రావాల్సిన వాటిని కూడా సాధించుకోలేకపోతే 25 మంది ఎంపీలు ఎందుకు.? కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి వదిలేశారు. రామాయపట్నంపోర్టు, రైల్వే జోన్, రాజధాని నిధలు, వెనకబడిన జిల్లాలకు నిధులు ఎందుకు అడగడం లేదు.? మనం అడగలేనప్పుడు ఎంపీలు రాజీనామా చేయాలన్నారు కదా..చేయించండి.

వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రం 4 బడ్జెట్ లు పెట్టింది. మోడీని పొడగటానికి తప్ప హక్కుల కోసం పోరాడటం లేదు. పక్క రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు కేసీఆర్ కూడా కేంద్రాన్ని విమర్శించారు. కేసీఆర్ కు ఉన్న ధైర్యంలో 10 శాతం కూడా జగన్ కు లేదు. ఎవర్నైనా ఎదిరించి నిలబడతారని మీ కార్యకర్తలు గొప్పలు చెప్తుంటారుగా..ఇదేనా మీ ధైర్యం.? 20 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి హక్కులు సాధిస్తామన్న హామీ ఏమైంది.

జగన్ చేష్టలతో వైసీపీ అభిమానులు సైతం సిగ్గుపడుతున్నారు. ఇంత చేతకాని ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నారా.? రెవెన్యూ లోటు గురించి మాట్లాడుతున్నారా.? మీడియా ముందుకు వచ్చి ఎందుకు ప్రశ్నించడం లేదు.? ఇప్పుడే మాట్లాడలేనివాళ్లు ముందుముందు ఏం మాట్లాడతారు.? ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడమే వచ్చు. పోటీ పడాల్సింది రాష్ట్రానిక సాధించాల్సి అంశాలపైన కానీ వెనకబడిన దక్షణ ఆఫ్రికాతో కాదు.

వైసీపీ ఎందుకు మాట్లాడలేకపోతోందో అర్థం కావడం లేదు. ప్రత్యేక హోదా గురించి ఊదరగొట్టి మాట్లాడి ఇప్పుడు చేతులు ముడుచుకున్నారు. హోదాపై నిరుద్యోగ యువత, రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. రాష్ట్ర సమస్యల పట్ల వైసీపీ మనస్సాక్షి ఉంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తక్షణమే రాజీనామా చేయాలి. ఎంపీ పదవుల్లో కొనసాగే హక్కు వైసీపీకి లేదు. రాజీనామా చేసి పోరాడితే మేము కూడా మీతో నిలబడతాం.

పనిచేసే చంద్రబాబును చేయనీయకుండా గతంలో అడ్డంకులు సృష్టించారు. బూతులు తిట్టడం, వెకిలి చేష్టలు చేయడం తప్ప చేసిందేంటి.? ప్రతిపక్షాలను బెదిరించి ప్రశ్నించేవారిని అరెస్టు చేయడమే వైసీపీకి తెలుసు. సమాఖ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రశ్నించి రావాల్సిన వాటిని దక్కించుకోవాలి. సామంత రాజుల్లాగా ఊడిగం చేస్తున్నారు. కేంద్రం నుండి రావాల్సినవి సాధించుకోవాల్సిన హక్కు ఉంది. రాష్ట్ర ప్రజల గౌరవాన్ని జగన్ కేంద్రం కాళ్ల దగ్గర పెట్టారు.

ఆత్మాభిమానం ఉంటే చెంపలేసుకుని, రాజీనామా చేసి తప్పుకోవాలి. వైసీపీ ఇంకా రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీగా మిగిలిపోతుంది. వైసీపీ సాధించడం ఏమీ చేతకాదని నాలుగు బడ్జెట్లలో స్పష్టమైంది. వైసీపీ రాష్ట్రాన్ని వదిలేస్తే బాగుంటుంది. ఇప్పటికే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆర్థిక మంత్రిగా బుగ్గన వందశాతం విఫలమయ్యారు. అప్పులు తెచ్చుకోవడం తప్ప రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించడం చేతకాదు. కేంద్రాన్ని నిలదీయడం వైసీపీకి చేతకాదని తేటతెల్లమైంది. రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలంటే వైసీపీ పోవాలి. రాష్ట్రానికి రావాల్సినవి కూడా వైసీపీ చేతకాని తనం చూసి రాకుండో పోతాయి’’ అని జీ.వీ.రెడ్డి విమర్శలు గుప్పించారు.

LEAVE A RESPONSE