– రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
అమరావతి: ఏపీ బ్రాండ్ ను దెబ్బతీసేందుకై మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఆర్థిక శాఖ మంత్రి కుట్రలు చేస్తూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నదంటూ గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ ఖజానా మరియు ప్రజలపై అవ్యాజమైన ప్రేమను చూపిస్తున్నట్లు నటిస్తూ రాష్ట్రాభివృద్దిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రజలు తమకు ఓట్లు వేయలేదనే అక్కసుతో ప్రజల సంక్షేమాన్ని, అభివృద్దిని అడ్డుకునేందుకు పరోక్షంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాభివృద్దికై ఏపీఎండీసీ ద్వారా రూ.9 వేల కోట్ల మేర ఋణా తెచ్చేందుకు ప్రభుత్వం జి.ఓ. నెం.32 ను ఈ ఏడాది మార్చిలో జారీ చేసినప్పటి నుండి ఆ ఋణం రాకుండా అడ్డు పడేందుకు విఫలయత్నం చేశారు.
జర్మనీలో పనిచేస్తున్న విప్రో ఉద్యోగి ఉదయభాస్కర్ అనే అతనితో బాంబో మార్కెట్లోని పెట్టుబడిదాలు అందరికీ పెట్టుబడులు పెట్టవద్దు అంటూ దాదాపు 200 మెయిల్స్ పంపించారు.వారి పార్టీకి చెందిన రాజ్య సభ సభ్యులు మరియు ఫైనాన్సు స్టాండింగ్ కమిటీ సభ్యులతో కేంద్ర ప్రభుత్వానికి /ఆర్.బి.ఐ.కి / సెబీ కి కంప్లైంట్స్ పెట్టించారు, వారి పార్టీ సభ్యులు లేళ్ల అప్పరెడ్డితో హైకోర్టులో పిల్ వేయించారు.
గతంలో వారు ప్రవేశ పెట్టిన డైరెక్టు డెబిట్ మెకానిజమ్ తప్పని గగ్గోలు పెడుతూ ఎంతో రాద్దాంతం చేశారు, కానీ ఈ విధానాన్నే దేశ వ్యాప్తంగా అనుసరిస్తున్నారు. ఇన్ని చేసినప్పటికీ ఆర్.బి.ఐ., సెబీ వారు క్లియరెన్సు ఇవ్వడంతో పెట్టుబడిదారులు ఓవర్ గా సబ్ స్క్రైబ్ చేయడం జరిగింది, అయినా వాళ్ల ఏడుపులు ఆపలేదు.
వారి ప్రభుత్వ హయాంలో ఎన్నో తాకట్టు పెట్టారు, ఏపిఎండిసి ద్వారా రూ.7 వేల కోట్ల మేర ఋణాన్ని పొందేందుకు జి.ఓ.నెం.35 ను 2024 మార్చిలో జారీ చేశారు.వీళ్లు ఎన్ని కుట్రలు చేసినా ఏపీ బ్రాండ్ ఎక్కడా తగ్గలేదు, ఓవర్ గా సబ్ స్క్రైబ్ చేశారు.
ఇప్పటికైనా వాళ్లు ఏడుపులు ఆపితే మంచిది. రాష్ట్రాభివృద్దిని అడ్డుకునేలా వీరు చేసిన తప్పుడు ప్రచారానికి, రాద్దాంతానికి దేశ ద్రోహం కేసులు వీరిపై పెట్టాలి.