– అందరినీ గౌరవించారు
– సినీ సమస్యలు ఓపిగ్గా విన్నారు
– నటుడు ఆర్. నారాయణమూర్తి
హైదరాబాద్: ” అసెంబ్లీలో కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల చిరంజీవి స్పందించిన తీరు నూటికి నూరు శాతం కరెక్ట్. చిరంజీవిని ఎవరూ అవమానించలేదు. జగన్ ఆయనను గౌరవించార ” ని ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి స్పష్టం చేశారు.
“కరోనా మహమ్మారి కారణంగా పరిశ్రమ భవిష్యత్తు ఏమిటోనన్న ఆందోళన నెలకొన్నప్పుడు, చిరంజీవి గారే చొరవ తీసుకుని అప్పటి సీఎం జగన్తో సమావేశం ఏర్పాటుకు కృషి చేశారు. చిరంజీవి ఫోన్ చేసి ఆ భేటీకి నన్ను కూడా పిలిచారు. చిన్న సినిమాలు బతకాలని, నిర్మాతలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆ క్లిష్ట సమయంలో పరిశ్రమకు అండగా నిలిచిన చిరంజీవికి సెల్యూట్ చేస్తున్నాను. జగన్ గారు చిరంజీవిని కానీ, మరెవరినీ కానీ అవమానించలేదు. మా సమస్యలను ఓపిగ్గా విని, పరిశ్రమకు ఏం కావాలో అది చేస్తామని సానుకూలంగా హామీ ఇచ్చారు. ”
“జగన్ గారు చిరంజీవిని కానీ, మరెవరినీ కానీ అవమానించలేదు. మా సమస్యలను ఓపిగ్గా విని, పరిశ్రమకు ఏం కావాలో అది చేస్తామని సానుకూలంగా హామీ ఇచ్చారు. అయితే, అప్పుడు సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సమస్యలపై దృష్టి సారించి, వాటిని పరిష్కరించాలని అని నారాయణమూర్తి వివరించారు.