– జగన్ మోడీతో హాట్ లైన్ లో ఉన్నాడు
– బైబిల్ మీద ప్రమాణం చేయగలరా ?
– దమ్ముంటే జగన్ ప్రమాణం చేయాలి
విజయవాడ: పచ్చ కామెర్లు సోకినోడి లెక్క ఉంది జగన్ తీరు… మీలాగా జనాలను టైర్ల మీద తొక్కడం రాహుల్ కి తెలియదు.. అక్రమ కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్లను అరెస్ట్ చేయడం రాహుల్ కి తెలియదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే…
ఈ దేశ పౌరుల కోసం రాహుల్ ది పోరాటం.. మోడీ,అమిత్ షా తో జగన్ దే హాట్ లైన్ టచ్. మోడీతో హాట్ లైన్ టచ్ లో నేనని జగన్ బైబిల్ మీద ప్రమాణం చేయగలడా? చంద్రబాబుతో రాహుల్ హాట్ లైన్ టచ్ లేదని మేం హామీ ఇస్తాం.
జగన్ కి దమ్ముంటే సవాల్ స్వీకరించాలి. జగన్ హాట్ లైన్ అంటూ మాట్లాడటం విడ్డూరం. జగన్ లాగ రాహుల్ బలప్రదర్శన యాత్రలు చేయడం లేదు. సొంత పార్టీ నేతలు తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయితే పరామర్శకు జగన్ లాగ రాహుల్ వెళ్ళడం లేదు. జగన్ లాగ మనుషుల మీద నుంచి రాహుల్ కార్లు ఎక్కించడం లేదు. రాహుల్ ఈ దేశ ప్రజల హక్కుల గురించి పోరాటం చేస్తున్నారు. పౌరుల హక్కుల కోసం చేసేది రాహుల్ పోరాటం. భారత రాజ్యాంగాన్ని కాపాడే పోరాటం రాహుల్ ది. అటువంటి రాహుల్ తో చంద్రబాబు తో హాట్ లైన్ అనడం హాస్యాస్పదం.
పచ్చ కామెర్లు కమ్మినోనికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అంట. జగన్ తీరు ఇలానే ఉంది. నిజానికి జగన్ కి మోడీకి హాట్ లైన్ ఉంది. అధికారంలో వచ్చిన నాటి నుంచి మోడీతో హాట్ లైన్ నడుపుతున్నాడు. తెరవెనుక పొత్తులకు బ్రాండ్ జగన్. బీజేపీ తో జగన్ ది తెరవెనుక పొత్తు. అందుకే అందరూ అలా ఉంటారు అనుకుంటున్నారు. అయ్యా జగన్ గారు.. రాహుల్ తో చంద్రబాబు ఎటువంటి హాట్ లైన్ లేదు. మేం హామీ ఇవ్వగలం. జగన్ మీరు హామీ ఇవ్వగలరా? మోడీతో, అమిత్ షా తో మీకు హాట్ లైన్ టచ్ లేదని బైబిల్ మీద ప్రమాణం చేయగలరా ? దమ్ముంటే జగన్ ప్రమాణం చేయాలి. మీరు హామీ ఇవ్వలేరు.. ఎందుకంటే మీకు మోడీతో హాట్ లైన్ ఉంది.
మోడీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. జగన్ ది నీతిమాలిన రాజకీయం. మోడీ కి వంగి వంగి దండాలు పెట్టారు. బీజేపీ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. ఇది మోడీ తో మీరు హాట్ లైన్ చర్చ అనరా? మాణిక్యం గురించి చాలా చులకనగా మాట్లాడాడు. ఇది జగన్ కు సభ్యత సంస్కారం లేదు అని నిరూపించుకున్నారు. మాణిక్యం ఠాగూర్ అడిగిన సవాల్ మీద మాత్రం చర్చ చేయలేదు. జగన్ కి దమ్ములేదు అని అర్థం అయ్యింది. బీజేపీ కి జగన్ చేసేది ఊడిగం. మత ఘర్షణలు జరిగినా జగన్ మౌనం. వైఎస్ఆర్ బీజేపీ వ్యతిరేకి.
కానీ జగన్ మాత్రం బీజేపీ కి బానిస.
జగన్ మోడీతో హాట్ లైన్ లో ఉన్నాడు కాబట్టే దత్తపుత్రుడు అన్నాం. జగన్ కి దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాలి. ఓటు చోరీపై పార్లమెంట్ లో వివాదం జరుగుతుంటే నోరు మెదపరు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తుంటే వైసీపీ ఎంపీలు మౌనం గా ఉంటారు. ఇది కాదా మీరు బీజేపీ కి మద్దతు ఇస్తున్న విధానం. దేశ భవిష్యత్ కోసం రాహుల్ పోరాటం చేస్తుంటే విమర్శ చేస్తారా? మోడీకి మద్దతు ఇస్తున్నట్టు మాట్లాడతారా? మీదో పార్టీ… మీరొక నాయకుడు!