Suryaa.co.in

Andhra Pradesh

జగన్ కు రక్త సంబంధాల విలువలు తెలియవు

సజ్జల పరిధి దాటి మాట్లాడుతున్నారు
జైలు జీవితం ఏమైనా జగన్ కు ఉన్నట్లు పురంధేశ్వరి కి ఉందా?
బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజి

విజయవాడ: ప్రజా సమస్యల పరిష్కారం లో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం.ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యలు ప్రతి పక్షాలు తీసుకుని వస్తాయి.అయితే ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయాలి. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే ఉద్యోగం చేస్తున్న సజ్జల అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది.

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పంచాయితీ నిధులు మళ్లింపు పై పురంధేశ్వరి విమర్శించారు.దానికి సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా విమర్శ లు చేస్తున్నారు.మద్యం పై సిబిఐ అంక్వైరీ జరగాలని కేంద్రాన్ని పురంధేశ్వరి కోరారు.2019 నుంచి ఇప్పటిదాకా మద్యం పై డిజిటల్ లావాదేవీలను బయటపెట్టగలిగే దమ్ముందా?మద్యం పై ఏడాదికి 25 వేల కోట్లు, నాలుగేళ్లలో లక్ష కోట్లు నిధులు కాజేశారు.

జగన్ కు రక్త సంబంధాల విలువలు తెలియవు.రాష్ట్రంలో పాలన స్తంభించిపోయింది.ప్రభుత్వం పై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో వైసిపి కి భయం పట్టుకుంది.మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలకు అనుమతివ్వడం బిజెపి విజయం.సజ్జల పరిధి దాటి మాట్లాడుతున్నారు.జైలు జీవితం ఏమైనా జగన్ కు ఉన్నట్లు పురంధేశ్వరి కి ఉందా?

వైసిపి ప్రభుత్వ తప్పులను ప్రజల్లోనే ఎండగడతాం.రాష్ట్రంలో రాక్షస రాజ్యం ఏలుతున్నప్పుడు ప్రతిపక్షాలు ఏకమవుతాయి. ఎన్నికల లోపు ఏం జరగబోతుందో చూడండి. పాత్రికేయుల సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమార స్వామి పాల్గొన్నారు.

LEAVE A RESPONSE