– సీఎం నన్ను కలిస్తే 6లక్షల కోట్లు తెస్తా
– నేను ఏసు బిడ్డను… నన్ను నడిపిస్తున్నాడు
– చంద్రబాబు దేశ ద్రోహి, కుల ద్రోహి, గురు ద్రోహి, ప్రజాద్రోహి
– నన్ను కలవాలని నిన్న నాకు కబురు పెట్టారు
– ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్
చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం అయ్యాడు.చంద్రబాబు దేశ ద్రోహి, కుల ద్రోహి, గురు ద్రోహి, ప్రజాద్రోహి. చంద్రబాబు స్వార్థ పరుడు లోకేష్ కోసం ఎన్టీఆర్ కుటుంబానికి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు నన్ను కలవాలని నిన్న నాకు కబురు పెట్టారు. సీక్రెట్ మీటింగ్ లు వద్దని నేను వెళ్ళలేదు. నా వెహికల్స్ సీజ్ చేశారని అబద్ధాలు ప్రచారం చేశారు. నా వెహికల్స్ సీజ్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా?
లక్షల కోట్లు దానం చేసిన నేను.. అప్పు ఉన్నాను అంటే నమ్ముతారా?నా కార్లూ ఎత్తుకెళ్లిన వాళ్ళకి దేవుడే శిక్ష వేస్తారు. చంద్రబాబు కుట్రలో నా కార్లు అడ్డుకున్నారు. సీఎం జగన్ కు దైర్యం లేక నన్ను కలవడం లేదు. వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదు డిపాజిట్ కూడా రాదు. కాపులు, దళితులను ఎవరు కొనలేరని జగన్ తెలుసుకోవాలి. సీఎం నన్ను కలిస్తే 6లక్షల కోట్లు తెస్తా లేదంటే నా పాస్ పోర్ట్ మీ దగ్గరే ఉంచుకోండి. పాల్ రావాలి.. పాలన మారాలి పేరుతో యాత్ర చేపడతాం యాత్రలో పాల్గొనే వారు 7998055552 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి.
తెలంగాణలో కేసిఆర్ కుటుంబం తప్ప ఎవరూ ఎదగ కూడదు. అన్ని పదవులు వాళ్లకేనా… పార్టీ లో సమర్ధులు లేరా?ఏపీ లో రాజకీయ పార్టీలు నాయకులు నాతో కలవండి.కోట్ల రూపాయలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా.నేను ఏసు బిడ్డను… నన్ను నడిపిస్తున్నాడు.ప్రజా శాంతి పార్టీ అధికారం లోకి రావడం ఖాయం.టి.ఆర్.యస్, టిడిపి, జనసేన పార్టీ లు బిజెపి పార్టీ లే. కెసిఆర్ మోడీ పెట్టిన ప్రతి బిల్లుకి జై అన్నారు. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పదవీ కాంక్షతో మోడి ని తెగ పొగిడారు.బిలీయనర్లతో నాకు ఉన్న పరిచయాలతో డబ్బు ఇప్పించగలను. బడుగు, బలహీన వర్గాల కు రాజ్యాధికారమే మా లక్ష్యం.