– విశాఖను స్టేట్ క్యాపిటల్ గా మారుస్తానని చెప్పిన జగన్.. గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యంతో డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చారు
– సీబీఐ అధికారుల విధులకు ఏపీ ఉన్నతాధికారులు ఎందుకు ఆటంకాలు కల్పించారు?
– విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై సమగ్రవిచారణ జరపాలి
– ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ
టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో నెం.1 స్థానంలో ఉన్న ఏపీని జగన్ రెడ్డి.. గంజాయి, డ్రగ్ రవాణాలో నెం.1 స్థానానికి చేర్చాడని ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ పత్రికా ప్రకటన ద్వారా విమర్శించారు. ఈ సందర్భంగా నూకసాని మాట్లాడుతూ విశాఖను స్టేట్ క్యాపిటల్ గా మారుస్తానని చెప్పిన జగన్.. డ్రగ్ క్యాపిటల్ గా మార్చారు అని, దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే దొరుకుతున్నాయి అని అన్నారు.
వచ్చే ఎన్నికలలో గెలవడం కోసం ప్రభుత్వమే డ్రగ్స్ రప్పించదా అనే అనుమానాలు కలుగుతున్నాయని నూకసాని అన్నారు. విశాఖ పోర్టులో తనిఖీలకు వచ్చిన సిబిఐ ,కష్టమ్స్ అధికారులను కంటైనర్ తెరవకుండా ఆపడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నం చేశారని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ సీజ్ చేయడానికి వెళ్లిన సమయంలో స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రతిఘటించారని సీబీఐ అధికారులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
తాడేపల్లి ప్రమేయం లేకుండా సీబీఐ అధికారుల్ని స్థానిక పోలీసులు అడ్డుకోగలరా, బ్రెజిల్ నుంచి మత్తు పదార్దాలు దిగుమతి చేస్తున్నారని తెలిసే జగన్ రెడ్డి తన అధికారులను పంపారా? అని ప్రశ్నించారు. కల్తీ మద్యం మాఫియాతో ఇన్నాళ్లూ ప్రజల ఇళ్లూ, ఒళ్లూ, ప్రాణాలు నాశనం చేశారు. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని డ్రగ్స్ కేపిటల్ గా మారుస్తున్నారని అన్నారు.
విశాఖ తీరానికి చేరిన కంటైనర్ డ్రగ్స్ ను చూస్తుంటే చిన్న విషయం కాదని, చేపల మేత తయారీలో వినియోగించే డ్రైఈస్ట్ పేరుతో దిగుమతి చేసుకున్న కంపెనీ వ్యవహారాలు వెనుక ఎవరున్నారు, దీనికి కారకులు ఎవ్వరో ఆ సంస్థకు యజమానులెవ్వరో బయటకు తీయాలని డాక్టర్ నూకసాని బాలాజీ డిమాండ్ చేశారు.