Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీఆర్ పేరు తొలగించడానికి జగన్ ప్రభుత్వానికి హక్కు లేదు

-హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడానికి జగన్ ప్రభుత్వానికి హక్కు లేదు
-నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రివర్స్ పాలనలో భాగంగా హెల్త్ యూనివర్సిటీ కు ఎన్టీఆర్ పేరు తొలగించి వైస్సార్ పెరు పెట్టారని,అటువంటి తప్పుడు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.1986లో ఎన్టీఆర్ స్థాపించిన దేశంలోని మొదటి వైద్య విద్య విశ్వ విద్యాలయం కు ఎన్టీఆర్ మరణాంతర పరిస్థితులు ప్రకారం ఆయన పేరు హెల్త్ యూనివర్సిటీ కి పెట్టారని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయన పేరు తొలగించే హక్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి లేదని అన్నారు. తక్షణమే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ పేరు మార్పుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనం ప్రారంభమైంది అని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.

LEAVE A RESPONSE