– అసందర్భ అంచనాల వల్ల నేడు గ్రామాలు మునిగి పోయాయి
– కాంట్రాక్టర్ ను మార్చడానికి పనులు కూడా ఆపేశారు
– జలవనరుల శాఖ మంత్రి రోజుకొక ప్రకటన గందరగోళం కలిగిస్తుంది
– డయా ఫ్రం వాల్ మళ్లీ నిర్మించాలి
– బిజెపి ఎమ్మెల్సీ మాధవ్
పోలవరం ప్రాజెక్టు ఎపికి వెన్నుముక లాంటిది. టిడిపి, వైసిపి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఆలస్యం జరుగుతుంది. కొత్త నినాదాలు, కొత్త వివాదాలకు ఇప్పుడు కేంద్రం గా మారింది.వీటికి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణం. పక్క రాష్ట్రానికి ముంపు గ్రామాల ప్రజలు వెళ్లిపోతాం అంటున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రోజుకొక ప్రకటన గందరగోళం కలిగిస్తుంది. ప్రజల్లో భరోసా కల్పించాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వానిదే.
15 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రి రివ్యూ చేస్తున్నారు.ఎక్కడ నిదులు ఆగాయో … కేంద్రం నుంచి ఏ సహకారం రాలేదో చెప్పాలి. అప్రోచ్ చానల్ పనులు పూర్తి చేయలేదు. వరద ముంపు లేకుండా డైవర్ట్ చేయడంలో విఫలమైంది.శాస్త్రీయ ధృక్ఫదంలో కాంటూరు సర్వే చేయలేదు. అసందర్భ అంచనాల వల్ల నేడు గ్రామాలు మునిగి పోయాయి.
నష్ట పరిహారం చెల్లించడానికి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు.మూడేళ్లుగా ఆర్ ఆర్ ప్యాకేజీ పై ఏపీ ప్రభుత్వానికి స్పష్టత లేదు.రీయింబర్స్ మెంట్ సిస్టం వచ్చాక… నిధులు ఎక్కడైనా అగాయా?బిల్లు వరకు ఒక్క రూపాయి అయినా నిలిపారా?రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పులను కేంద్రం పై నెట్టడం సరి కాదు.సరైన సమయంలో లో వారిని ఖాళీ చేయించాల్సింది.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తే.. ఇంతమంది ముంపు లో ఉండే వారు కాదు. డయా ఫ్రం వాల్ మళ్లీ నిర్మించాలి.గత, ప్రస్తుతం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పోలవరం పూర్తి కాలేదు. పునరావం ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయిస్తారు?ప్రాజెక్టు వద్ద శిలాఫలకాలను పెట్టడం లొ ఉన్న శ్రద్ధ పూర్తి చేయడంలో లేదు.ఎక్కువ ముంపు చూపితే ఎక్కువ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తారని చూపించారు.
పోలవరం కోసం ఎంత అప్పు చేశారో జగన్ ప్రభుత్వం చెప్పాలి.అనేక పధకాలకు అప్పులు తెచ్చిన జగన్… పోలవరం కు ఎందుకు ఖర్చు పెట్టలేదు? కాంట్రాక్టర్ ను మార్చడానికి పనులు కూడా ఆపేశారు. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం పెరగడానికి జగన్ ప్రభుత్వమే కారణం. పోలవరం జాతీయ ప్రాజెక్టు.. పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. గతంలో తామే నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడంతో ఆలస్యం అయిన మాట వాస్తవం. సాధ్యమైనంత త్వరలో పోలవరం కేంద్రం పూర్తి చేసి తీరుతుంది.