Suryaa.co.in

Andhra Pradesh

కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల్లోని ప్రముఖులపై జగన్ వేధింపులు

– భయపెట్టి లొంగదీసుకొని కొందరిని తనపంచనచేర్చుకొని, ఆయావర్గాలన్నీ తనతో ఉన్నాయని నమ్మించే దుష్ట ఆలోచనలో జగన్ ఉన్నాడు
• నంద్యాలలో ప్రముఖవిద్యావేత్త శాంతారాముడిని వేధించి దారికి తెచ్చుకోవాలని జగన్ చూస్తున్నాడు
• గతంలో పొంగూరి నారాయణ ను అక్రమకేసులతో వేధించాడు
• పవన్ కల్యాణ్ ఉభయగోదావరి జిల్లాల్లో జోరుపెంచడంతో, ముద్రగడతో చిలుకపలుకులు పలికిస్తూ, తానేదోకాపుల్ని ఉద్ధరించినట్టు మాట్లాడిస్తున్నాడు
• కాపులద్రోహి జగన్ ..కాపుల నిజమైననేస్తం చంద్రబాబే
• స్వర్గీయ వంగవీటిరంగాను చావుకుకారకులైనవారి వారసుల్ని జగన్ అక్కున చేర్చుకున్నాడు రంగాను దూషించి, అవమానించిన గౌతమ్ రెడ్డిలాంటి వారికి కీలకపదవులు కట్టబెట్టాడు
• జగన్ ఎన్నికుట్రలుచేసినా, సామదానబేధదండోపాయాలు ప్రయోగించినా కాపుజాతిని లొంగదీసుకోలేడు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు

జగన్మోహన్ రెడ్డి పాలన కక్షలు, కార్పణ్యాలు, కేసులు, వేధింపులు, దాడులే పరమా వధిగా సాగుతోందని, కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలే లక్ష్యంగా జగన్ సాగిస్తున్న వేధింపులపర్వం పతాకస్థాయికిచేరిందని, రాష్ట్రంలో నూటికి 70శాతంమంది జగన్ పాలనను వ్యతిరేకిస్తుంటే, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులు 99 శాతం వ్యతిరేకి స్తున్నారని జగన్ కు ఐప్యాక్, ఇంటిలిజెన్స్ నివేదికలు అందాయని టీడీపీ పొలిట్ బ్యూ రోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …

“ ఐప్యాక్, సొంతపార్టీ, ఇంటిలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలను ఆధారం చేసుకొనే జగన్ కాపు, తెలగ, బలిజ, ఒంటరికులాలకు చెందిన పెద్ద వ్యక్తులు,పారిశ్రామికవేత్తలు, వ్యాపారులపై వేధింపులకు పాల్పడుతున్నాడు. తన చేతిలోని ప్రభుత్వ విభాగాలు, అధికార వ్యవస్థల్ని మీపైకి, మీసంస్థలపైకి ఉసిగొలుపుతానంటూ జగన్ వారిని బెదిరి స్తున్నాడు. తన పార్టీలో ఉండే ఆయాసామాజికవర్గాల వారిని వదిలేసి, ఇతరపార్టీల్లోని వారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నాడు.

కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాల్లోని ప్రముఖులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తల్ని నయానోభయానోదారికి తెచ్చి, తన పార్టీలో చేర్చుకొని, ఆ వర్గాలన్నీ తనతోనే ఉన్నాయని చెప్పుకోవాలన్న దుష్ట ఆలోచనలో జగన్ ఉన్నాడు.

నంద్యాలజిల్లాలోని విద్యావేత్త శాంతిరాముడిపై ఆజిల్లాలో మంచిపేరు ప్రఖ్యాతులన్నా యి. అలాంటివ్యక్తి ఆర్థిక మూలాల్ని దెబ్బతీసి, అతని విద్యాసంస్థలపై దాడులుచేయించి , శాంతిరాముడిని బలవంతంగా తనపార్టీలో చేర్చుకునేందుకు జగన్ ఎత్తుగడలు వేస్తు న్నాడు. గతంలో టీడీపీలో మంత్రిగాపనిచేసిన పొంగూరినారాయణను అక్రమకేసులతో వేధించిన జగన్, ఆయన విద్యాసంస్థలపై అధికారులతో దాడులుచేయించాడు.

పేపర్ లీకేజ్ ఘటనను తెరపైకితెచ్చి, కావాలనే దానిలో ఆయనపేరుచేర్చాడు. రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని న్యాయస్థానాలుచెప్పినా వినకుండా, నారా యణపై అక్రమకేసులుపెట్టి వేధించి, మనోవేదనకు గురిచేశాడు. ఈ విధంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరికులాల్లోని ప్రముఖుల్ని నయానో భయానో దారికితెచ్చుకొని ఆ వర్గాలన్నీ తనవెంటే ఉన్నాయని చెప్పుకోవడానికి జగన్ ఆరాటపడుతున్నాడు.

కాపులకు నిజంగా మేలుచేసింది చంద్రబాబే. రూ.5వేలకోట్లతో చంద్రబాబు కాపుకార్పొ రేషన్ పెడితే, జగన్ దాన్నినిర్వీర్యంచేశాడు. చంద్రబాబు తీసుకొచ్చిన 5శాతం రిజర్వేష న్లను ఒక్కజీవోతో రద్దుచేశాడు.

జగన్ ఎన్నికుట్రలుకుతంత్రాలుచేసినా, ఆవర్గాలను బెదిరించిభయపెట్టి దారికి తెచ్చుకోవాలని చూసినా చివరకు అతనికి మిగిలేది శూన్యమే. కాపులకు నిజంగా మేలు చేసిందిచంద్రబాబునాయుడే. కాపు, తెలగ, బలిజ, ఒంటరికులాలకు చంద్రబాబు కల్పిం చిన 5శాతం రిజర్వేషన్లను జగన్ ఒక్కజీవోతో రద్దుచేశాడు. చంద్రబాబు రూ.5వేలకోట్ల తో కాపుకార్పొరేషన్ ఏర్పాటుచేసి, కాపువర్గంతోపాటు, దానిఅనుబంధవర్గాల్లోని వారి ని ఆదుకున్నాడు.

జగన్మోహన్ రెడ్డి మాత్రం 10వేలకోట్లతో కాపుకార్పొరేషన్ ఏర్పాటుచేస్తానని నమ్మించి, అధికారంలోకివచ్చాక ఈ నాలుగేళ్లలో 4రూపాయలు కూడా కాపులకు కేటాయించలేదు. ఆఖరికి కాపుకార్పొరేషన్ ను నిర్వీర్యంచేశాడు. చంద్రబాబుహాయాంలోకాపుబిడ్డలు విదేశీవిద్యపథకంతో చదువులకోసం విదేశాలకు వెళ్తే, జగన్ వచ్చాక దేశంకానిదేశంలో వారిపరిస్థితి హృదయవిదారకంగామారింది.

కాపుయువతకు చంద్రబాబు నెలనెలా రూ.18వేల స్టైఫండ్ ఇచ్చి, ఐ.ఏ.ఎస్. గ్రూప్ -1 వంటి పోటీపరీక్షలకు అవసరమైనశిక్షణను ఉచితంగాఅందించాడు. చంద్రబాబు అందు కోసం ఏర్పాటుచేసిన కోచింగ్ సెంటర్లన్నింటినీ జగన్ మూసేయించాడు. కాపుకార్పొరే షన్ ద్వారా లబ్ధిపొంది చిన్నచిన్నఉపాధిరంగాల్లో పైకిరావాలని చూసిన కాపుయువత ఆశలపై నీళ్లుజల్లాడు.

పవన్ కల్యాణ్ జోరుపెంచడంతో, జగన్ ముద్రగడతో చిలుకపలుకులు పలికిస్తున్నాడు. స్వర్గీయ వంగవీటిరంగాను దూషించి, అవమానించిన గౌతమ్ రెడ్డి లాంటివారికి కీలకపదవులు కట్టబెట్టిన జగన్ ను కాపుజాతి ఎప్పటికీ నమ్మదు.

ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరుపెంచడంతో, జగన్ కు ఇప్పటికిప్పుడు కాపులపై ప్రేమపుట్టుకొచ్చింది. ముద్రగడద్వారా చిలుకపలుకులు పలికిస్తున్న జగన్, తానేదో కాపుల్ని ఉద్ధరించినట్టు అతనితో చెప్పిస్తున్నాడు. రాజం పేట పార్లమెంట్ స్థానం తరతరాలనుంచి బలిజలకే దక్కుతోంది. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి కూడా ఆస్థానాన్ని బలిజవర్గానికే ఇచ్చారు.

కానీ జగన్ మాత్రం తనవర్గానికి కట్టబెట్టి, బలిజవర్గాన్ని అవమానించాడు. స్వర్గీయ వంగవీటిరంగా హత్యకేసులో ప్రధానముద్దా యిగాఉన్నవారి వారసుల్ని జగన్ అక్కునచేర్చుకోవడం, రంగాను ఉద్దేశించి గతంలో అనుచితంగా, అసభ్యంగా మాట్లాడి, ఆయన్ని ద్వేషించిన గౌతమ్ రెడ్డి లాంటివారికి కీలకపదవులు కట్టబెట్టడం కాపులపై ముఖ్యమంత్రికి ఉన్న ఈర్ష్యాద్వేషాలకు నిదర్శనం.

జగన్ కాపుజాతికి చేసిన ద్రోహం, వంచన మాటల్లోవర్ణించలేనిది. అలాంటి వ్యక్తి అధికారబలంతో, కేసులతోభయపెట్టి, కాపు, తెలగ, బలిజ, ఒంటరికులాలను తనవైపుకు తిప్పుకోవాలనిచూడటం అతనిలోని భయానికి నిదర్శనం.” అని రామానాయుడు తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE