– ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూసేకరణను, నిర్మాణాన్ని తప్పుపట్టి, చంద్రబాబుని నిందించిన జగన్, ఇప్పుడు మరలా శంఖుస్థాపన ఎందుకు చేశాడు? ఎవరి బినామీ భూములున్నాయని 3 ఏళ్లలో నిర్మిస్తానంటున్నాడు?
• 2019లో ఫిబ్రవరిలో అన్నిఅనుమతులతో చంద్రబాబుగారు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయనిర్మాణానికి శంఖుస్థాపనచేస్తే, ప్రతిపక్షనేత హోదాలో జగన్ నానా యాగీ చేశాడు
• రైతుల భూములు లాక్కున్నారని, విశాఖవిమానాశ్రయం పక్కనున్నభూములు ఎందుకు తీసుకోలేదని, జీ.ఎం.ఆర్ కంపెనీకి చంద్రబాబు మేలు చేస్తున్నాడని నోటికొచ్చినట్టు మాట్లాడాడు
• భోగాపురం విమానాశ్రయం నిర్మించే చోట అయ్యన్నపాత్రుడు, అవంతి, గంటా శ్రీనివాసరావుకు భూములున్నాయని కూడా చెప్పాడు
• అన్ని నిందలేసిన జగన్.. మరలా ఇప్పుడు అదేభూముల్లో రెండోసారి శంఖుస్థాపన ఎందుకు చేశాడు?
• జగన్ మాటలు, చేష్టలు, చర్యలు చూస్తే ఆయనకు మతిభ్రమించిందేమో అనిపిస్తూ ఉంటుంది
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
ముఖ్యమంత్రి పనులుచూస్తుంటే చెల్లిపెళ్లి జరగాలి మళ్లీమళ్లీ అన్నట్టున్నాయని, చంద్రబాబు గారు శంఖుస్థాపనలుచేసిన వాటికి మరలాచేయడం, చంద్రబాబుగారు కట్టించిన భవనాలకు రంగులేయించడమే అందుకు నిదర్శనమని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వంగ లపూడి అనిత ఎద్దేవాచేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆమె మాటల్లోనే…
“2019 ఫిబ్రవరి 14న చంద్రబాబుగారుశంఖుస్థాపన చేసిన భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి నిన్న జగన్ మరలా శంఖుస్థాపనచేస్తూ, వంగలేకనిలబడే ఇనుప చువ్వలపై కొబ్బరికాయకొట్టాడు. భోగాపురం విమానాశ్రయం మణిహారమనే విషయం జగన్ కు గతంలో తెలియదా? చంద్రబాబుగారు శంఖుస్థాపనచేసినప్పుడు దాని విలువు తెలియదా? డిఫెన్స్ ఎయిర్ పోర్ట్ కి, సివిల్ ఎయిర్ పోర్ట్ కి ముఖ్యమంత్రికి తేడా తెలుసా అన్నసందేహం కలుగు తోంది.
చంద్రబాబు గతంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శంఖుస్థాపనచేసి, 2,600 ఎకరాలు సేకరించారు. దానిలో ప్రభుత్వభూమి 422 ఎకరాలు, డీపట్టా 822ఎకరాలు, జిరాయితీ భూమి 1300ఎకరాలు కలిపి దాదాపు 2,624 ఎకరాలు సేకరించారు. ఆరోజున 2,365 ఎకరాలకు రైతులకు పరిహారం కూడాఇవ్వడంజరిగింది. నిర్వాసితులకు ఎలాంటి సమస్యలు లేకుండా కేంద్రప్రభుత్వచొరవతో సమస్యను పరిష్కరించడం జరిగింది.
ఈ వ్యవహా రంలో 171 ఎకరాలకు సంబంధించి చిన్నచిన్న సమస్యలుపెండింగ్ లో ఉన్నాయి. అన్నీ క్లి యర్ చేసి, అన్ని అనుమతులతో 2019 ఫిబ్రవరి 14నముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి శంఖుస్థాపనచేశారు.
బుర్ర, బుద్ధిలేని జగన్మోహన్ రెడ్డి గతంలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణంపై మాట్లాడిందేమిటి.. ఇప్పుడు చేసిందేమిటి?
ఇన్నేళ్లలో జగన్ కు ఏనాడు గుర్తుకురాని భోగాపురం విమానాశ్రయ నిర్మాణం ఇప్పుడే ఎం దుకు గుర్తుకొచ్చింది? త్వరలోనే విశాఖపట్నం వెళ్లాలని ఉబలాడుపడుతున్నాడు కాబట్టి, అక్కడిప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్నభయంతో ఇప్పుడు హడావుడిగా మరలా శంఖుస్థా పనచేశాడు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ భోగాపురం విమానాశ్రయ నిర్మాణం జరగని వ్వను అంటూ ఉద్యమాలు చేశాడు. విశాఖపట్నం విమానాశ్రయంపక్కనే వేలఎకరాల భూమిఉంటే, ఎక్కడోభోగాపురంలో చంద్రబాబురైతులభూముల లాక్కొని శనక్కాయలు బెల్లం పంచినట్టు తనకునచ్చినవారికి పంచేస్తున్నాడని నోటికొచ్చినట్టు మాట్లాడాడు.
ఆనాడు అలా మాట్లాడిన వ్యక్తి, నేడు ఏముఖం పెట్టుకొని విమానాశ్రయ నిర్మాణానికి శంఖుస్థాప న చేశాడని ప్రశ్నిస్తున్నాం. విశాఖ విమానాశ్రయం డిఫెన్స్ ఎయిర్ పోర్ట్, జాతీయస్థాయిలో ఏవైనా ఇబ్బందులు, సమస్యలు, అనుకోని పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు విశాఖ విమా నాశ్రయం డిఫెన్స్ విభాగం అధీనంలోకి వెళ్లిపోతుంది. అప్పుడు దాన్ని వినియోగించుకోవడం సాధ్యంకాదు. అలాంటి ఎయిర్ పోర్ట్ ని వినియోగించుకోవడం సాధ్యంకాదని భావించే చంద్రబా బు ప్రత్యామ్నాయంగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి శంఖుస్థాపనచేశారు.
అదికూడా తెలుసుకోకుండా, ఈబుర్ర బుద్ధిలేని ముఖ్యమంత్రి విశాఖవిమానాశ్రయం పక్కన ఉన్నభూమినే తీసుకోవాలని, రైతులభూములు లాక్కొని భోగాపురంలో విమానాశ్రయం నిర్మిస్తే కోర్టుకు వెళ్లి అయినా ఆపుతానని ప్రగల్భాలు పలికాడు. ఆనాడు ప్రతిపక్షంలోఉండి అలా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డిని నేడు ఏపురుగు కుట్టిందో తెలియదుగానీ, మరలా దానికే శంఖుస్థాపనచేసి, మణిహారం, మకుటం అని నత్తినత్తిగా మాట్లాడాడు.
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ముఖ్యమంత్రి మాటలు, చేతలు ఉన్నాయి.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమంలో సరిగా వంగి కొబ్బరికాయకొట్ట లేని జగన్, దాన్ని 3ఏళ్లలో నిర్మిస్తాననిచెప్పడం సిగ్గుచేటు. విశాఖపట్నం విమానాశ్రయం నగరానికి మధ్యలోఉంటే, భోగాపురం విమానాశ్రయం ఎక్కడో 25కిలోమీటర్ల దూరంలో ఉంద న్న జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక దూరాన్ని తగ్గిస్తాడా?
4 ఏళ్లు దానిముఖం కూడా చూడకుండా, ఇప్పుడు అధికారం ముగిసిపోయేసమయంలో తూతూ మంత్రంగా ఎవరిప్రయోజనం కోసమే శంఖుస్థాపనచేసి, నిర్మాణంపూర్తిచేసి డబుల్ డెక్కర్ విమానాలు తిప్పతాను అంటు న్న ముఖ్యమంత్రి మాటలు వింటుంటే, ప్రజలు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. 2019లో చంద్రబాబుగారు అన్నిఅనుమతులు క్లియర్ చేసి, విమానా శ్రయ నిర్మాణాన్ని బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ కు జ్ఞానోదయం అయ్యిఉంటే ఇప్పటికే భోగాపురం విమానాశ్రయనిర్మాణం పూర్తై ఉండేది.
రాజధాని అమరావతిని జగన్ కాదనుకున్నా అక్కడ జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లడానికి 2019 వరకు 8విమాన సర్వీసులు నడిచేవి, జగన్ వచ్చాక కేవలం 2మాత్రమే నడుస్తున్నా యి. విశాఖపట్నం నుంచి ఒకే సర్వీస్ నడుస్తోంది. గతంలో రాష్ట్రంనుంచి సక్రమంగా నడిచిన విమానసర్వీసులు నడిపించలేని ముఖ్యమంత్రి, మూడేళ్లలో విమానాశ్రయం కట్టేసి డబుల్ డెక్కర్ సర్వీసులు నడిపిస్తాడా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ముఖ్యమంత్రి మాటలున్నాయి. 6, 7 నెలల్లో ఎన్నికలు వచ్చేట్టున్నాయి. ఎప్పుడు లోపలికి వెళతాడో ఆయనకే తెలియని పరిస్థితి. అలాంటి జగన్ 3ఏళ్లలో భోగాపురం విమానాశ్రయం నిర్మిస్తాడా ?
చంద్రబాబు విజన్, ఆలోచనను అందుకోవడం 100 జగన్‌ల వల్ల కూడా కాదు
చంద్రబాబు విజన్ ను, ఆలోచనను అందుకోవడం 100 జగన్మోహన్ రెడ్లవల్ల కూడా కా దు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం వెనుక చంద్రబాబుగారి ఆలోచన, దూరదృష్టి చాలా ఉంది. డిఫెన్స్ ఎయిర్ పోర్ట్ అయిన విశాఖవిమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా మరో విమా నాశ్రయం నిర్మించాలన్న ఆలోచన ఒకటైతే, భోగాపురం విమానాశ్రయనిర్మాణానికి కేటాయిం చిన స్థలం పక్కనే 500ఎకరాల్లో M.R.O (మెయింటెనెస్స్ రిపేర్ ఆపరేషన్స్ సెంటర్) నిర్మా ణాన్ని కూడా చేపట్టాలని చూశారు. దానిలో విమానాశ్రయాల నిర్వహణ, మరమ్మతులు వం టివి జరిగేలా ప్లాన్ చేశారు. దానికోసం 500ఎకరాలు పక్కనపెట్టి, అప్పుడే జీ.ఎం.ఆర్ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు.
దానిపై కూడా జగన్అప్పట్లో విషప్రచారంచేశాడు. అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మాదిరే విమానాశ్రయం నిర్మాణంలో కూడా రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడాడు. ప్రజలకు ఉపయోగపడే ఒక్కపనిచేయకుండా 4ఏళ్లు గడిచాక మరలా జీ.ఎం.ఆర్ సంస్థకే పనులు అప్పగించాడు. అదీ జగన్మోహన్ రెడ్డి తెలివి. జగన్మోహన్ రెడ్డి మాటలు, తెలివి చూస్తుంటే అప్పుడప్పుడు అతనికి మతిభ్రమించిం దేమో అన్న అనుమానం కలుగుతూ ఉంటుంది.
గతంలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికిసేకరించిన భూముల్లో చంద్రబాబు బినామీల భూములున్నాయన్న జగన్, ఇప్పుడు ఎవరిభూములున్నాయని మరలా శంఖుస్థాపన చేశాడు?
జగన్ మాటలు చేతలు ప్రజలు, ఆయన భజనబృందం మర్చిపోయినా గూగుల్ తల్లి మర్చిపోదు. తనకుకమీషన్లు బాగావస్తే అది ఎలాంటి పని అయినా జగన్ ఓకే అంటాడు. గతంలో భోగాపురం విమానాశ్రయనిర్మాణానికి సేకరించిన భూముల్లో చంద్రబాబు బినామీలు ఉన్నార ని, అయ్యన్నపాత్రుడు, అవంతి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు వంటివారికి భూము లున్నాయని జగన్ విషప్రచారం చేశాడు.
అధికారంలోకి వచ్చాక ఆ భూములు ఎవరివో విచారణ చేయకుండా, మరలా అదే అవంతిశ్రీనివాసరావుని జగన్ మంత్రిని చేశాడు. మరలా ఇప్పుడుసిగ్గులేకుండా ఆ భూముల్లోనే విమానాశ్రయ నిర్మాణానికి శంఖుస్థాపన చే శాడు. ఇప్పుడు ఎవరి బినామీలు ఉన్నారని జగన్ మరలా చేసిన పనే చేశాడు? చంద్రబాబు చేసుకున్న ఒప్పందంప్రకారమే అదానీ డేటాసెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటయ్యేలా చూస్తే ఈపాటికే రాష్ట్రానికి రూ.70వేలకోట్ల పెట్టుబడులువచ్చేవికదా! అదిరద్దుచేసి, కేవలం రూ.7,500కోట్ల పెట్టుబడి, అదికూడా ఎప్పుడో రెండేళ్లకు పెట్టేటట్టు ఒప్పందంచేసుకోవడం జగన్ చేతగానితనం కాదా?
జగన్ వెధవపనులు ఎందరు యువతజీవితాలను బలితీసుకుం టున్నాయో ఆయనే ఆలోచించాలి. సకల శాఖల మంత్రి సజ్జల, మంత్రులు జగన్ కు మంచి సలహాలు సూచనలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రజనీకాంత్ పై విమర్శలుచేయడం.. చంద్రబాబుగారిని తిట్టడం, టీడీపీనాయకుల్ని వేధించడం తప్ప ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి, మంత్రులకు మరోపనిలేకుండా పోయింది. తనకు కమీషన్లు వస్తేనే జగన్ చంద్రబాబు గారి హాయాంలో ప్రారంభమైనపనుల్ని కొనసాగిస్తాడా? కమీషన్లు వస్తేనే కంపెనీలను ఆహ్వానిస్తా డా.. నిర్మాణాలు చేపడతాడా?
రజనీకాంత్ , పవన్ కల్యాణ్ ల వ్యాఖల్ని తప్పు పడుతున్న వైసీపీనేతలు, మంత్రులకు గతంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు కనిపించలేదా…వినిపించలేదా?
జగన్ కు అతని ప్రభుత్వానికి కమీషన్లు ఇవ్వలేకనే జాకీ పరిశ్రమ, కియా అనుబంధపరిశ్రమ లు, అమర్ రాజా సంస్థలు రాష్ట్రం విడిచిపారిపోయాయి. వైసీపీప్రభుత్వ వేధింపులు తట్టుకోలే క, కమీషన్లు ఇవ్వలేక కంపెనీలు, పారిశ్రామికవేత్తలు పారిపోతుంటే, మరోపక్క యువతను గంజాయి, మాదకద్రవ్యాలకు బానిసల్ని చేస్తున్నారు. జగన్ నిన్న చేసింది కేవలం శంఖుస్థా పన మాత్రమేనని కోడిగుడ్డు-పిల్ల కథలమంత్రి తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక ఫెయి ల్యూర్ సీఎం. అతని అసమర్థత, చేతగానితనమే యువతీయువకుల పాలిట శాపమైంది.
ఎవరికీ జగన్ ఉద్యోగాలు ఇవ్వలేడు… ఉద్యోగులకుజీతాలు ఇవ్వలేడు.. విద్యార్థులకు సక్ర మంగా పాఠాలు, పాఠ్యపుస్తకాలు అందించలేడు. రైతులకు న్యాయంచేయలేడు. రోడ్లు వేయ లేడు. తాడేపల్లిలో కూర్చొని ఆశాఖపై ఈశాఖపైఉత్తుత్తి సమీక్షలు చేస్తుంటాడు. ఇంతకు ముందు రాష్ట్రంలో ఎక్కడైనా కేజీ గంజాయి దొరికితేనే వ్యవస్థలు అలర్ట్ అయ్యేవి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కంటైనర్లకు కంటైనర్లు దొరికినా ఏంలేదు. ఎప్పుడూ హోంలోనే ఉండే హోం మంత్రి కూడా నేడు ముఖ్యమంత్రితో సమీక్షచేశారు.. దాంతో ఏంసాధించబోతున్నారో చెప్పాలి.
రజనీకాంత్, పవన్ కల్యాణ్ లు ఏమైనా మాట్లాడితే ఓ నోళ్లు వేసుకొని మొరుగుతున్న వైసీపీనేతలు, మంత్రులకు గతంలో నాగార్జునవిశ్వవిద్యాలయంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు కనిపించలేదా…వినిపించలేదా? మహిళల్ని కించపరిచేలా మాట్లాడిన రామ్ గోపాల్ వర్మను వదిలేసి, అతని వ్యాఖ్యలతో ఆనందించి, సిగ్గులేకుండా రజనీకాంత్ గారిని అంటారా?
రజనీకాంత్ స్టేచర్ ఏమిటి.. ఇక్కడ జగన్ కు ఊడిగంచేసేవాళ్ల స్టేచర్ ఏమిటి? రజనీకాంత్ గారు ఒకశిఖరం, ఆయన రాజకీయశిఖరమైన చంద్రబాబుని పొగిడితే వైసీపీవా ళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు గారు మంచి ఉద్దేశంతో నిర్మించాలనుకున్నభోగా పురం విమానాశ్రయానికి మరలా జగన్ శంఖుస్థాపనచేయడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయమే.” అని అనిత స్పష్టంచేశారు.