Suryaa.co.in

Andhra Pradesh

ఊస‌ర‌వెల్లిని మించిపోయాడు జ‌గ‌న్

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

దిమాక్ ఉన్న సీఎం చంద్ర‌బాబు దునియా మొత్తం చూసి దూర‌దృష్టితో కియా తెచ్చారు. కోడిక‌త్తి ఆలోచ‌న‌ల కోడి మెద‌డున్న విప‌క్ష‌నేత జ‌గ‌న్ అప్ప‌ట్లో కియాకి భూములు ఇవ్వొద్ద‌న్నాడు. కియా ఆరంభం కాకుండా కోర్టుకెళ్తాన‌న్నాడు. కియాని త‌రిమి కొడ‌తాన‌న్నాడు. కియా కార్లు అమ్ముడుపోవ‌ట్లేద‌ని, క‌మీష‌న్ల కోసం తెస్తున్నార‌ని ఆరోపించాడు.

సీబీఎన్ గారి ముందుచూపుతో తెచ్చిన కియా క‌ర‌వునేల‌లో కార్లు పండిస్తూ..ఓ వైపు ఉద్యోగాలు, మ‌రోవైపు రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెడుతూ అభివృద్ధికి చిహ్న‌మైంది. సీఎంగా వ‌చ్చిన జ‌గ‌న్ కియాపై మాట మార్చేశాడు. త‌న తండ్రి లేఖ వ‌ల్లే కియా వ‌చ్చింద‌ని ఫేక్ లెట‌ర్ రిలీజ్ చేయించుకున్నాడు. అదే కియా ప‌దిల‌క్ష‌ల కార్లు ఉత్ప‌త్తి చేసి రికార్డు క్రియేట్ చేస్తే…అది త‌న గొప్పే అంటూ ట్వీట్లు వేస్తున్నాడు.

రాజ‌కీయాల్లో ఇలా రెండు నాలుక‌లు, రెండు ముఖాలు ప్ర‌ద‌ర్శించి ఊస‌ర‌వెల్లిని మించిపోయాడు జ‌గ‌న్ . త‌న జె ట్యాక్స్ కోసం లులూ, అమ‌ర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్ట‌న్ మాదిరిగా కియాని త‌రిమేయ‌కుండా జ‌గ‌న్ ఉంటే అదే కియాకి ఇచ్చే అతి పెద్ద ఇన్సెంటివ్‌.

సీఎంగా చంద్ర‌బాబు గారు ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడి ప్ర‌య‌త్నాలు, తెలుగుదేశం ప్ర‌భుత్వం కృషితో వ‌చ్చిన కియా 10 ల‌క్ష‌ల కార్లు ఉత్ప‌త్తిని అధిగ‌మించిన సంద‌ర్భంగా సంస్థ యాజ‌మాన్యానికి, ఉద్యోగుల‌కి అభినంద‌న‌లు.

LEAVE A RESPONSE