Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌కు ప్రధాని కావాలని ఆశ

– సీఎం పదవితో తృప్తి లేదు
– వివేకా హత్య కేసు దర్యాప్తు చేయాలని అమెరికా వెళ్తారా?
– కోర్టు తీర్పులన్నీ వారికి అనుకూలంగానే రావాలా?
– బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య వెనుక పెద్ద కుట్ర ఉందని, ఈ విషయం కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు తెలుసని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. మనిషికి అసంతృప్తి ఉంటే ఎన్ని దారుణాలైనా చేస్తాడన్నారు.

సీఎం పదవి వచ్చిందన్న తృప్తి సీఎం జగన్‌కు లేదని, ప్రధాని పదవి కూడా కావాలని ఆయనకు ఆశ పుట్టిందని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పథకం ప్రకారమే వివేకాను హత్య చేశారు. దీనితో సంబంధమున్న వారంతా బయటకు వస్తారు. హత్య చేసి ఆధారాలు చెరిపేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అరెస్టు చేస్తారన్న భయంతోనే ముందస్తు బెయిల్‌ కోసం ఎంపీ అవినాష్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. సీబీఐ విచారణను ఎందుకు తప్పు పడుతున్నారు? వివేకా హత్య కేసు దర్యాప్తు చేయాలని అమెరికా వెళ్తారా? కోర్టు తీర్పులన్నీ వారికి అనుకూలంగానే రావాలా?’’ అని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు

LEAVE A RESPONSE