Suryaa.co.in

Andhra Pradesh

తలకు పెట్టబోయిన టోపీని వద్దని ముస్లిం జాతిని జగన్ అవమానించారు

• ప్రజలు రోడ్ల మీదకు వచ్చి జగన్ అసమర్థతను నిలదీయాలి.
• ఎక్కడికి వెళ్లినా ఏపీలో జరిగే ఘోరాలనే ప్రస్తావిస్తున్నారు
• ప్రజల చేతిలో వైసీపీ నేతలకు భంగపాటు తప్పదు
• ఎమ్మెల్యే తలారి వెంకట్రావును చితకబాదడమే ఇందుకు తార్కానం
– టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్

ఉద్యోగులు, కార్మికులు పడుతున్న కష్టాలు చూస్తే జాలేస్తోందని, కూలీ పనులు చేసుకునే వారికి కూలీ లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు…

‘‘గతంలో ముఠా పని చేసుకుని రూ.15 వందల నుండి రూ.2వేల సంపాదించుకునే కార్మికుడు నేడు రెండు వందలు కూడా సంపాదించుకోలేని స్థితిలో ఉన్నారు. కార్మికులను ఈ దుస్థితిలో చూస్తుంటే ఆవేదనగా ఉంది. ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు. మంచినీటికి మీటర్లు బిగించి డబ్బులు వసూలు చేసినా సరిగ్గా నీళ్లిచ్చే పరిస్థితి లేదు. కేటీఆర్ ఒకమాట అంటే ఇరవైమంది వైసీపీ నేతలు మాట్లాడారు. వంటినిండా వాసన బెట్టుకుని నేను అత్తరు రాసుకున్నానన్న చందంగా మంత్రులు మాట్లాడుతున్నారు.

విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్లాంటే గంటలో వెళ్తున్నామంటే దానికి కారణం చంద్రబాబు వేసిన రోడ్ల వల్లే. విజయవాడ కృష్ణాకట్ట మీద సాయంత్రం ఆరు తర్వాత వెళ్లాలంటే భయపడేవాళ్లు. అలాంటి రోడ్లను కూడా బ్రహ్మాండంగా చంద్రబాబు తయారు చేశారు. విజయవాడలో మూడు ఫ్లై ఓవర్ నిర్మాణాలు కూడా నిర్మించారు. వైసీపీ వేసిన ఒక్క రోడ్డునైనా చూపించగలరా.?

రోడ్లు బాగున్నాయని మంత్రులు అడ్డగోలుగా దబాయిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంత చదువులేకపోయినా రెండేళ్లలో అంజయ్య సీఎంగా బాగా పనిచేశారు. కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క ఛాన్స్ అని అడిగారు..ఒక్క ఛాన్సే కష్టం అయింది. జీ.కొత్తపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేని ప్రజలు చితకబాదారు. పెద్దిరెడ్డిని ఇఫ్తార్ విందుకు రానివ్వలేదు. ప్రజల్లో వైసీపీకి వ్యతిరేకత ఎదురవుతుందన్నడానికి ఇదే నిదర్శనం.

చంద్రబాబు హయాంలో నిర్మించిన షాదీఖానా జగన్ ప్రారంభించడానికి వెళ్తే.. అక్కడి ముస్లిం సోదరుడు జగన్ కు టోపీ పెట్టడానికి ప్రయత్నిస్తే వద్దని అవమానించారు. ముస్లిం జాతినే జగన్ అవమానించారు. ముస్లిం ఓట్ల కోసం టోపీ పెట్టుకని ఇంటింటికీ తిరిగిన వ్యక్తి ఇప్పుడు టోపీ పెట్టుకోవడానికి ఏమైంది.? ఇప్పటికైనా ముస్లింలు జగన్ మనస్థత్వాన్ని అర్థం చేసుకోవాలి. గజదొంగ వచ్చినట్లు పోలీసులను అడ్డంపెట్టుకుని, కూలీ డబ్బులిచ్చి జనాన్ని సభలకు తెచ్చుకున్నారు.

పదవ తరగతి లీకైందని చెప్తుంటే లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. ఆదాయం లేని శాఖగా బొత్స విద్యాశాఖను చూస్తున్నారు. గ్యాస్, పెట్రోల్, నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగాయి. నేను వస్తే బాదుడే బాదుడు అని జగన్ చెప్పినా ప్రజలు ఆనాడు ఆలోచించలేదు. ఏడు లక్షల కోట్లు అప్పులు చేశారు. గతంలో నీళ్లు కరెంట్ లేని తెలంగాణ బాగుపడింది.

ఏపీ నాశనం అయింది. మోడీ కూడా చంద్రబాబు చేసిన అభివృద్ధి చూసి నేర్చుకున్నానని సీఎంగా ఉన్నప్పుడు చెప్పారు. చంద్రబాబు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గౌరవం దక్కుతుంది. మహిళలకు హాని జరగకుండా పాలిస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పట్టపగలే అత్యాచారాలు జరగుతున్నాయి. మగవారికి కూడా రక్షణ లేదు. హత్యలు, నేరాలతో భయపడుతున్నారు.

పోలీసులు కూడా శాంతిభద్రతలు కాపాడటంలో ఫెయిల్ అయ్యారు. రోజుకొక ఘోరం రాష్ట్రంలో జరుగుతోంది. సీఎంపై ప్రజలు ఎదురుతిరిగి ప్రశ్నించాలి. చంద్రబాబు మరోసారి సీఎం అయివుంటే రాష్ట్రం దశదిశ మారేది. మూడేళ్లలో ఎన్నో మానబంగాలు జరిగాయి. ఏ రాష్ట్రానికి వెళ్లినా ఏపీలో జరిగే ఘోరాల గురించే చెప్తున్నారు. ఆనవాయితీ ప్రకారం పెడుతున్న టోపీని జగన్ వద్దన్నారు. ఓట్లేసిన ముస్లింలు కూడా దీనికి సిగ్గుపడాలి.

ముస్లింలకు ఏం చేశారు.? డబ్బుల్లేని చైర్మన్ పదవులు దేనికి.? కేటీఆర్ చెప్పింది వాస్తవమే. అనారోగ్యం వస్తే ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు హైదరాబాద్ కు వెళ్తున్నారు. ఒక్క కంపెనీ, ఉద్యోగం కూడా ఏపీకి వచ్చింది లేదు. యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు జగన్.? సచివాలయాల ద్వారా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. అమ్మఒడి ఎంత మందికి ఇస్తున్నారు.?

మూడేళ్లుగా ముఖ్యమంత్రి బయటకు కూడా రావడం లేదు. ప్రతిపక్షంగా టీడీపీ పాత్ర నిర్వర్తిస్తోంది. ప్రజలు రోడ్ల మీదకు రావాలి. ఒక్కో ఎమ్మెల్యే, మంత్రి ఎంత సంపాదించుకుంటున్నారో ప్రజలు గమనించాలి. సంపద కోసమే వైసీపీ నేతలు మూడేళ్లుగా పాలిస్తున్నారు.’’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

LEAVE A RESPONSE