– టిడిపి హయాంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేసాం
– జగన్ పాలనలో కనీసం టిడిపి హయాంలో ఖర్చు చేసిన 10 శాతం కూడా ఖర్చు చెయ్యలేదు
– వ్యవసాయ శాఖ మంత్రి కోర్టులో దొంగ తనం చేసే పనిలో బిజీ
– రైతుల ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3 లో ఉంది
– రాయలసీమ లో మామిడి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం.
– మీటర్లు పెడితే పగలగొట్టండి
– కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం మాచాపురంలో రైతులతో ముఖాముఖి సమావేశంలో నారా లోకేష్
నకిలీ విత్తనాల కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయాం. దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది.12 ఎకరాలు కౌలు కి తీసుకొని పంట వేస్తే నష్టం వచ్చి భర్త అంజనయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని ఆవేదన వ్యక్తం చేసిన రంగమ్మ. భూ సర్వే పేరుతో వైసిపి ప్రభుత్వం వేధిస్తుంది అంటూ లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేసిన నాగన్న. ఎన్నో ఏళ్లుగా మా ఆధీనంలో ఉన్న భూమి ప్రభుత్వం లాక్కుంది.మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం. పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అమ్ముకోవడం కోసం యార్డ్ లేక ఇబ్బంది పడుతున్నాం. – ఎమ్మిగనూరు నియోజకవర్గం రైతులు
లోకేష్ మాట్లాడుతూ…
జగన్ ఒక హాలిడే సీఎం. క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, ఆక్వా హాలిడే.టిడిపి హయాంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేసాం. జగన్ పాలనలో కనీసం టిడిపి హయాంలో ఖర్చు చేసిన 10 శాతం కూడా ఖర్చు చెయ్యలేదు. మోటార్లకు మీటర్లు పేరుతో రాయలసీమ రైతుల మెడకు ఉరి తాడు బిగిస్తున్నాడు జగన్. ఖచ్చితంగా కరెంట్ బిల్లు కూడా వసూలు చేస్తాడు. సంతకాలు చేస్తే మీరు బిల్లు కట్టాల్సిందే. మీటర్లు పెడితే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా పోరాడుతుంది. జగన్ రైతు రాజ్యం తెస్తానని రైతులు లేని రాజ్యం తెచ్చాడు.వైసిపి పాలనలో క్యాబినెట్ లో చంచల్ గూడా జైలుకి నెక్స్ట్ వెళ్ళేది ఎవరూ అనే చర్చ తప్ప రైతులు సమస్యల గురించి ఏనాడూ చర్చించ లేదు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే వ్యవసాయ శాఖ మంత్రి కోర్టులో దొంగ తనం చేసే పనిలో బిజీగా ఉన్నారు. జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3 లో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2 లో ఉంది.ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇస్తాం అన్న జగన్ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలేదు.
దళిత రైతు రంగమ్మ కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది. తక్షణమే లక్ష రూపాయిలు ఆర్ధిక సహాయం పార్టీ నుండి అందిస్తాం. అలాగే టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత 10 లక్షల పరిహారం కూడా అందిస్తాం అని హామీ ఇచ్చిన లోకేష్. జగన్ ది శాశ్వత భూ హక్కు పథకం కాదు అది భూ భక్ష పథకం. సర్వే తరువాత భూమి తగ్గించి పాస్ పుస్తకం ఇస్తున్నారు అని మంత్రులే మాట్లాడుతున్నారు. ఆయన సొంత భూమి మీకు ఇస్తున్నట్టు పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మ వేస్తున్నారు. భూమి తగ్గతే అధికారుల చుట్టూ తిరగాలి అని ఉచిత సలహా ఇస్తున్నారు. రాయలసీమ రైతులకు వరంలా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ను జగన్ నిర్వియం చేసాడు. టిడిపి హయాంలో సబ్సిడీ లో డ్రిప్ ఇరిగేషన్ అందజేసాం. టీడీపీ హయాంలో రూ.50వేల కంటే తక్కువ ఉన్న రైతు రుణాలు అన్ని ఒక్క సంతకం తో మాఫీ చేసాం.టిడిపి హయాంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సబ్సిడీ ధరకు అందజేసాం.
టిడిపి హయాంలో భూసార పరీక్షలు, మైక్రో నూట్రియెంట్స్ అందజేసాం. ఏ పంటలు వెయ్యాలో కూడా చెప్పే వాళ్ళం. ఇప్పుడు జగన్ పాలనలో రైతులని గాలికి వదిలేశారు.జగన్ పాలనలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రేట్లు రెట్టింపు అయ్యాయి. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సరఫరా చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.నకిలీ విత్తనాలు విచ్చల విడిగా అమ్ముతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది.నకిలీ విత్తనాలు అమ్ముతున్న కంపెనీల పై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ప్రకృతి పై నెపం నెట్టేస్తున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీల పై చర్యలు తీసుకుంటాం. మిర్చి రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. గిట్టుబాటు ధర కల్పించడం తో పాటు ఆదోని లో మిర్చి యార్డ్ ఏర్పాటు చేస్తాం.జగన్ చెప్పిన రూ.3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఎం అయ్యింది.12,500 రైతు భరోసా అన్న జగన్ ఇప్పుడు 7,500 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఒక్కో రైతు దగ్గర నుండి రూ.25 వేలు కొట్టేసాడు జగన్.
జగన్ పాలనలో ఆర్బికే సెంటర్లు ఒక బోగస్. వాటి ద్వారా ఒక్క రైతుకి కూడా సాయం అందలేదు.మిర్చి, టొమాటో, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం తో పాటు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తాం. రాయలసీమ లో మామిడి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. మొదటి మూడు ఏళ్లలో సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.టీడీపీ హయాంలో రూ.1986 కోట్ల తో ప్రారంభించిన ఆర్డీఎస్ రైట్ కెనాల్ పనులు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తాం.ఎల్ ఎల్ సి ఆధునీకరణ పనులు పూర్తి చేస్తాం.రాయలసీమ ను హార్టి కల్చర్ హబ్ గా మారుస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సబ్సిడీ లో డ్రిప్ ఇరిగేషన్. అందిస్తాం.