– వైస్సార్సీపీ పార్టీ ని రప్పా రప్పా పార్టీగా పేరు మార్చుకోవాలి
– పేర్ని నాని నోరు డ్రైనేజ్ లాంటిది
– మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం
విజయవాడ: తూర్పు నియోజకవర్గం లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సకల సౌకర్యాలతో ప్రతి ఒక్కరూ నూరేళ్లు బతకాలని చంద్రబాబు కోరుకుంటుంటే, రప్పా రప్పా అంటూ తలకాయలను నరికి ఆయుష్షును అర్ధాంతరం చేయాలని జగన్ చూస్తున్నారు… తల రాతను మార్చే నాయకుడు చంద్రబాబు, తలకాయలను తొక్కించే నాయకుడు జగన్ అని మండిపడ్డారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..
వైస్సార్సీపీ పార్టీ ని రప్పా రప్పా పార్టీ గా పేరు మార్చుకోవాలి. గత 5 ఏళ్ళ పాలనలో తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాని జగన్, గంజాయి బ్యాచ్ ను, బెట్టింగ్ మాఫియాను పరామర్శించేందుకు, వాళ్ళకి విగ్రహాలు పెట్టేందుకు వెళ్తాడు. ఇలాంటి రాక్షస స్వభావం కలిగిన వారిని సభ్య సమాజం ఎప్పటికీ క్షమించదు. పేర్ని నాని నోరు డ్రైనేజ్ లాంటిది. ఆయన నోట్లో ఎన్ని లీటర్ల ఫినాయుల్ పోసినా మురికి మాటలే వస్తాయి. వైసీపీ నేతల నోటి దురుసు, బూతుల వల్లే 11 సీట్లకు దిగజారారు. ఇంకా ధోరణి మార్చుకోకపోతే ఈసారి 11లో ఒక నెంబర్ పోతుంది.
మొదటి సంవత్సరం జగన్ రూ 250 పింఛన్ పెంచితే, చంద్రబాబు వృద్దులకు రూ. 1000, దివ్యాంగులకు 3వేలు పెంచారు.
పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను జగన్ రద్దు చేస్తే, నేడు 210 అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకు 2లక్షల 50 వేల మంది కి కడుపు నింపుతున్నాం. గత ప్రభుత్వంలో మొదటి ఏడాది ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. నేడు తొలి ఏడాది 16 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాం.