– అమరావతి సహా ప్రాజెక్టులు అన్నీ పూర్తి అయ్యి ఉంటే….నేడు రాష్ట్రం కళకళలాడేది
-మహానాడులో అగ్రవర్ణ పేదల సంక్షేమంపై తీర్మానం పై చర్చలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
జగన్ విధ్వంస పాలనలో రాష్ట్ర ఆదాయం దెబ్బతింది.ఒక తుగ్లక్ పాలన, ఒక సైకో పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. మేధావులు ఆలోచించాలి. ఒకప్పుడు తెలంగాణ కంటే ఎక్కువ ఉన్న ఎపి ఆదాయాలు…ఇప్పుడు తగ్గిపోయాయి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేసింది.
2019లో AP రెవెన్యూ రూ.66786 కోట్లు. తెలంగాణ రెవెన్యూ రూ.69620 కోట్లు. 2022- 23 కు వచ్చే సరికి…ఎపి రెవెన్యూ రూ.94916 కోట్లు కాగా….తెలంగాణ ఆదాయం రూ. 132175 కోట్లకు చేరుకుంది.అంటే ap కంటే తెలంగాణ ఆదాయం రూ.37,259 కోట్లు ఎక్కువ. నాడు దాదాపు సమానంగా ఉన్న రెండు రాష్ట్రాల ఆదాయాలు ఇప్పుడు జగన్ విధ్వంస పాలన వల్ల పూర్తిగా మారిపోయాయి.
ఏపీ కంటే తెలంగాణలో దాదాపు 40 శాతం ఆదాయం అధికంగా వస్తోంది. అక్కడ నాడు చేసిన అభివృద్ధి వల్ల ఆదాయాలు.అమరావతి సహా ప్రాజెక్టులు అన్నీ పూర్తి అయ్యి ఉంటే….నేడు రాష్ట్రం కళకళలాడేది. 2019లో జిఎస్టి వసూళ్లు ఎపిలో రూ.24957 కోట్లు ఉండగా….తెలంగాణలో రూ.18779 కోట్లు మాత్రమే ఉండేవి. అంటే ఎపిలో తెలంగాణ కంటే దాదాపు రూ.6 వేల కోట్లు అదనంగా ఆదాయం వచ్చేది.
అయితే 2022-23లో ఎపి జిఎస్టి వసూళ్లు రూ.38840 కోట్లు ఉండగా…తెలంగాణ వసూళ్లు రూ.41888 కోట్లకు చేరుకున్నాయి. ఎపిలో ఎటువంటి కార్యకలాపాలు జరగకపోవడం ఎపిలో జిఎస్ టి తగ్గిపోయింది.2018-19 లో ఎపిలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ. 5427 కోట్లు కాగా తెలంగాణలో రూ. 5344 కోట్లు ఉంది.
2022 -23లో ఎపి లో రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.8022 కోట్లు ఉండగా…తెలంగాణలో 14,228 కోట్లు గా ఉంది.2018-19లో సేల్స్ టాక్స్ లో ఎపి ఆదాయం రూ. 21914 కోట్లు ఉండగా, తెలంగాణ ఆదాయం రూ.20290 కోట్లు.2022-23 ఎపిలో సేల్స్ టాక్స్ ఆదాయం రూ.18,004 కోట్లకు ఉండగా….తెలంగాణ సేల్స్ టాక్స్ ఆదాయం రూ. 29604 కోట్ల కు చేరింది.
అంటే 2019లో ఉన్న ఎపిలో ఉన్న సేల్స్ టాక్స్ ఆదాయం కంటే 2023లో ఎపిలో సేల్స్ టాక్స్ ఆదాయం రూ. 4 వేల కోట్లు తగ్గింది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో సేల్స్ టాక్స్ ఆదాయం దాదాపు రూ. 10 వేల కోట్లు పెరిగింది. జగన్ రివర్స్ పాలన వల్ల ఇక్కడ వచ్చిన ఫలితాలు ఇవి. రాష్ట్రంలో మాదిగలు, దూదేకుల వర్గం లో ప్రత్యేక డిమాండ్లు ఉన్నాయి.జనాభా దామాషా లెక్కన అన్ని వర్గాలకు న్యాయం చేస్తాము అని మహానాడు నుంచి హామీ ఇస్తున్నా.