-గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు కంటే జగన్ బలహీనమైన ముఖ్యమంత్రి
– ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతికవిలువలు అన్నా..8 మంది ఐఏఎస్ లకు న్యాయస్థానం వేసిన శిక్షకు బాధ్యత వహిస్తూ వెంటనే తనపదవికి రాజీనామాచేసేవాడు
అందుకే కేబినెట్ మంత్రులు తప్పుచేసినా, అవినీతికిపాల్పడినా వారిపైచర్యలు తీసుకోలేకపోతున్నాడు
• 8మంది ఐఏఎస్ అధికారులకు న్యాయస్థానం శిక్షవేయడమనేది దేశచరిత్రలోఎన్నడూలేదు. బ్రిటీష్ వారి హయాంలో కూడా ఇలాజరగలేదు
• ముఖ్యమంత్రి రాచరికపు పోకడలు.. ఆయన దుందుడుకు చర్యలు.. ఆయన అసమర్థత వల్లే ఐఏఎస్ లకు శిక్షపడింది
• ఈ ముఖ్మమంత్రి స్థానంలో మరెవరుఉన్నా వెంటనే ఐఏఎస్ లకు పడిన శిక్షకునైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి ఉండేవారు. అలాచేయలేదనే ఈ ముఖ్యమంత్రికి నైతిక విలువలు లేవంటున్నాం
• మాటతప్పను.. మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి మాటలన్నీ అవాస్తవాలే. అడుగడుగునా మాటతప్పి.. మడమతిప్పడమే ఆయననైజం
• బెంజ్ కారు తీసుకున్న గుమ్మనూరు జయరామ్ ని, 5కోట్లసొమ్ముని అక్రమంగా రవాణాచేసిన బాలినేనిని, క్యాసినో నిర్వహించిన బూతులమంత్రిని, బెట్టింగ్ లమంత్రిని తొలగించేధైర్యం చేయలేకపోయాడు
• కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. బొత్స సత్యనారాయణ ను తొలగించే ధైర్యం ముఖ్యమంత్రి ఉందా?
• రోజా.. ధర్మానప్రసాదరావు.. పార్థసారథి లాంటివారిని కొత్త మంత్రివర్గంలోకి తీసుకోకుండా వారిని పక్కన పెట్టే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా?
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
నైతిక విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉండటం ప్రజలదురదృష్టమని, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి పాలనపై పట్టులేదని, ఎందుకోతెలియ దుగానీ, ఆయన మానసికంగా న్యాయవ్యవస్థపై వ్యతిరేకత పెంచు కున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.
ముఖ్యమంత్రి మనసులో న్యాయవ్యవస్థపై వేళ్ళూనుకున్న వ్యతిరేక భావం వల్ల 8 మంది ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లకుండా బతికిపోయారు. న్యాయస్థానం ఏదో ఉదారంగావ్యవహరించబట్టి సరిపోయిందిగానీ..లేకపోతే సదరుఐఏఎస్ అధికారులందరికీ జైలు శిక్ష పడి ఉంటే, దానికి ఎవరు కారణం ప్రజలంతా ఆలోచించాలి.
ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్ట్ వేసిన రెండువారాల శిక్ష అనేది ముఖ్యమంత్రికి, ఏపీప్రభుత్వానికి వేసినట్టు. ఎందుకంటే పరిపాల నావ్యవస్థకు అధ్యక్షుడు, బాధ్యుడు ముఖ్యమంత్రికాబట్టి.. ఆరెండు వారాల శిక్షనున్యాయస్థానం ఆయనకు వేసినట్టే. పరిపాలనాపర మైన నిర్ణయాల్లో..జీవోకాపీల్లో అధికారులపేర్లుఉంటాయికాబట్టి.. న్యాయస్థానం వారి పేర్లు చదివింది కానీ… వాస్తవంగా శిక్ష ముఖ్యమంత్రికి పడినట్టే లెక్క.8మంది ఐఏఎస్ అధికారులకు న్యాయస్థానం జైలుశిక్షవేసిన దాఖ లాలు దేశంలో ఎక్కడాలేవు.
ముఖ్యమంత్రి రాచరికపోకడలు.. ఆయన అసమర్థత,నియంత్రత్వ విధానాలు.. ఆయన దుందుడుకు చర్యలవల్లే 8మంది ఐఏఎస్ అధికారులు అదృష్టం బాగుండి బయటఉన్నారు. లేకపోతే వారంతా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉండాలి. తనప్రభుత్వ నిర్ణయాలవల్లే 8మంది ఐఏఎస్ అధికారులకు శిక్షపడిందని నేను అంటాను..కాదని ముఖ్యమంత్రిచెప్పగలరా? ముఖ్యమంత్రి మొండివిధానాలు… ఆయన రాచరికపోకడలే అధికారులకు శాపం గా మారాయనడంలోఎలాంటి సందేహంలేదు. న్యాయస్థానం జాలి పడి వేసిన శిక్షను మరోరకంగాకాదని, మరోరకంగా ఐఏఎస్ లను పనిష్ చేసిందికానీ…వాస్తవంగా వారికి రెండువారాల జైలుశిక్ష పడినట్టే లెక్క.
ఈ ముఖ్యమంత్రి విధానాలు.. ఈప్రభుత్వ దరిద్రపు పోకడలవల్లే తమకు శిక్షపడిందని ఆ 8మంది ఐఏఎస్ లు అనుకోరా? కచ్చి తంగా అనుకుంటారు. తెలుగుదేశంపార్టీలోని ముఖ్యనాయకుడిగా ఐఏఎస్ లకు శిక్షపడిన విధానానికి బాధ్యతవహిస్తూ ముఖ్యమం త్రి రాజీనామాచేయరా అని ప్రశ్నిస్తున్నాను. 8మంది ఐఏఎస్ అధికారులకు జైలుశిక్షపడిన వైనంపై ప్రభుత్వపెద్దలుఏం సమాధా నంచెబుతారు? మాకునైతిక విలువలులేవు.. ఎవరేమన్నా.. మేం తుడిచేసుకొనిపోతామంటే చేసేదేంలేదు?
ఇదేపరిస్థితి ఇతరరాష్ట్రాల్లోని ఏ ముఖ్యమంత్రికి ఎదురైనా వెంటనే రాజీనామాచేసేవారు. తనప్రభుత్వంలోని ఐఏఎస్ లు తప్పుచేశా రంటే తానుతప్పుచేసినట్టేనని ఇతర ముఖ్యమంత్రులు భావించే వారు. మాటతప్పను..మడమతిప్పను అనిచెప్పే ముఖ్యమంత్రి మాటలన్నీ అవాస్తవాలే. అదేగానీ నిజమైతే తనవల్లే ఐఏఎస్ లకు శిక్షపడిందని ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఉండేవారు.
ఐఏ ఎస్ లంతా సేవాకార్యక్రమాలుచేయాలన్న న్యాయస్థానం ఆదేశాలుకూడా శిక్షలాంటివే.. అదీ ఒకరకమైన శిక్షే. బ్రిటీష్ వారి పాలనలోకూడా ఇంతభారీస్థాయిలో 8మంది ఐఏఎస్ అధికారుల కు శిక్షపడిన దాఖలాలులేవు. ఐఏఎస్ చరిత్రలోసదరు అధికారు లకు పడినమచ్చ ఎన్నటికీ మాయనిది. దానికి బాధ్యతవహిస్తూ నైతికవిలువలనేవి ఉంటే ముఖ్యమంత్రి తక్షణమే తనపదవికి రాజీ నామాచేయాలి. ఈ ముఖ్యమంత్రి తండ్రి ఇప్పుడు ఇదేస్థానంలో ఉండిఉంటే ఆయనైనా రాజీనామా చేసేవాడు.
రాష్ట్రాన్ని ఇప్పటివరకు పాలించిన ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి బలహీనమైన ముఖ్యమంత్రి. మానసికంగా చాలాచాలా బలహీనమైన వ్యక్తి. జూన్ 6, 2019న ముఖ్యమంత్రి మాట్లాడుతూ సరిగ్గా రెండున్నరసంవత్సరాల తర్వాతఇప్పుడున్న మంత్రిమండ లి మొత్తంతీసేసి,..కొత్తవారిని నియమిస్తానన్నాడు. మరి అదే ముఖ్యమంత్రి ఇంకాఎందుకు మంత్రిమండలిని మార్చలేదు? మంత్రిమండలి మొత్తాన్ని మార్చే ధైర్యం ఈ ముఖ్యమంత్రికిలేదు. గతంలో స్వర్గీయ నందమూరితారకరామారావుగారు ఒకే ఒక్క కలంపోటుతో 33మంది మంత్రులనుమార్చేశారు. అదీ బలమంటే..
అందుకే అంటున్నా.. ఈరాష్ట్రానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి బలహీనమైన వ్యక్తి అని. అది నిజంకాదు..తాను బలవంతుడిని అని ముఖ్యమంత్రిభావిస్తే వెంటనే మంత్రివర్గంలో ఉన్నఅందరినీ మార్చేసి కొత్తమంత్రిమండలి ఏర్పాటుచేయాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రివర్గంనుంచి తొలగించే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా? అతన్ని తొలగిస్తే.. ఈ ముఖ్యమంత్రి ఆయన పార్టీ.. ఆయనప్రభుత్వం పతనమైపోతాయి.
బొత్స సత్య నారాయణను మంత్రివర్గంనుంచి ముఖ్యమంత్రి తొలగించగలడా? బాలినేనిశ్రీనివాసరెడ్డి కారులో రూ.5కోట్లు పట్టుబడిన నాడే ఆయన్నిమంత్రివర్గంనుంచి తొలగించిఉంటే… ఈ ముఖ్యమంత్రి బలవంతమైన వాడేనని ప్రజలంతా నమ్మేవారు. ఈ ముఖ్యమంత్రి బలమైనవాడే అయితే బెంజికారుతీసుకున్నాడన్న ఆరోపణలు వచ్చినప్పుడు గుమ్మనూరు జయరామ్ ని కేబినెట్ నుంచి తొల గించేవాడు. బూతులుమాట్లాడిన నాడే కొడాలినానీకి గడ్డిపెట్టి. … అతన్ని తొలగించేవాడు.
అందుకే అంటున్నాం… ఈ ముఖ్యమంత్రికి కేబినెట్ ను పూర్తిగాతొలగించేంత శక్తి , సామర్థ్యా లు లేవు. అంతటి సామర్థ్యమే ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఉంటే రేపు మంత్రివర్గంలోకి శ్రీమతిరోజాను.. ధర్మానప్రసాదరావు.. కొలు సుపార్థసారథిలను తీసుకోకుండా ఉండగలరా? అలా చేయగల ధైర్యం మీకుందా ముఖ్యమంత్రిగారు? మంత్రిమండలి కూర్పు..చేర్పుఅనేవి మీ ఇష్టం ముఖ్యమంత్రి గారు.దానిగురించి మేం మాట్లాడటంలేదు. కానీ రెండున్నరేళ్లలో కొత్తమంత్రివర్గాన్ని నియమిస్తాననిచెప్పిన మీరు ఎందుకు మాటతప్పారని మేం ప్రశ్ని స్తున్నాం.
రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి వాస్తవంగా ప్రజలు అనుకునేటంత బలవంతుడుకాడు. ఆయనచాలా బలహీనమైన ముఖ్యమంత్రి.పంచాయతీ రాజ్ వ్యవస్థమొత్తం నివ్వెరపోయింది. గ్రామసర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులకు తెలియకుండా పంచాయతీల ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం లాగేసుకోవడం రాజ్యాంగానికి విరుద్ధంకాదా? రాజ్యాంగంలోని 72, 73 అధికరణలకు వ్యతిరేకం కాదా? ముఖ్యమంత్రికి పరిపాలన విధానం తెలియకనే ఐఏఎస్ అధికారులు జైలుపాలయ్యారు.
వారు జైలుకు వెళ్లకపోయినా..న్యాయస్థానమిచ్చిన ఆదేశాలు, వారుచేసిన తప్పులు వారి సర్వీస్ రిజిస్టర్ లో నమోదు అవుతాయి. కాబట్టి వారికిశిక్షపడినట్టేలెక్క. ఐఏఎస్ లు చేసినదానికి ఒక్కనిమిషం కూడా పదవిలోకొనసాగే అర్హత ఈ ముఖ్యమంత్రికి లేదు. ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతికవిలువలు, ధైర్యం ఉన్నా వెంటనే తనపదవికి రాజీనామాచేసేవాడు.. తాను చెప్పినవిధంగా వెంటనే కేబినెట్లో ఉన్న వాళ్లందరినీ తొలగించి, కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేవాడు.