– అబద్దానికి ప్యాంటు, షర్ట్ వేస్తే అచ్చం జగన్ లానే ఉంటుంది
-నాలుగేళ్ల మూడు నెలల్లో జగన్ పీకింది ఏమీ లేదు
–అంబటి రాంబాబు డ్యాన్సులు వేసింది నిజం కాదా?
-సంజన, సుకన్య తో మాట్లాడింది నిజం కాదా?
-జరిగింది సినిమాలో పెడితేనే కోపం వస్తే మాకెంత కోపం రావాలి?
-కట్టు కథతో సినిమా తీసిన రోజు ఈ వైసిపి కుక్కలకు విలువలు గుర్తు రాలేదా?
-జగన్ కి కరెంట్ షాక్ ఇవ్వండి
-200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు
-డయాఫ్రం వాల్ గురించి తెలియదు కానీ…సంజన గురించి తెలుసు..
-పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేడు కానీ..సుకన్య ఎక్కడికి రావాలో చెబుతాడు
-నోటిదూల. కాంబాబుకి పగలు వాగుడు…రాత్రి గోకుడు
-కన్నా లక్ష్మీనారాయణ ని ఆశీర్వదించండి
-సత్తెనపల్లి నియోజకవర్గం చౌటపాపాయపాలెంలో యువగళం సారధి నారా లోకేష్ బహిరంగ సభ…
సత్తెనపల్లి అదిరిపోయింది. పల్నాడు ముఖద్వారం సత్తెనపల్లి. వికటకవి తెనాలి రామకృష్ణుడు జన్మించిన నేల సత్తెనపల్లి. స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య పుట్టిన గడ్డ సత్తెనపల్లి.పల్నాటి పులి కోడెల శివప్రసాద్ అభివృద్ధి చేసిన నేల సత్తెనపల్లి. ఎంతో ఘన చరిత్ర ఉన్న నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
యువగళం..మనగళం..ప్రజాబలం. జగన్ ఏపీ కమల్ హాసన్.అబద్దానికి ప్యాంటు, షర్ట్ వేస్తే అచ్చం జగన్ లానే ఉంటుంది.పోలవరం విషయంలో జగన్ చెప్పిన అబద్దాలు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్ట్ కడతా అన్నాడు. ఇప్పుడు మాట మార్చాడు, మడమ తిప్పాడు. కేంద్రం డబ్బులు ఇస్తేనే పోలవరం అంటున్నాడు.2020 డిసెంబర్, 2021 ఖరీఫ్, 2022 ఖరీఫ్, 2023 ఖరీఫ్, ఇప్పుడు 2025 ఖరీఫ్ అంటున్నాడు.
ఒక నోటి పారుదల మంత్రి పోయాడు…రెండో నోటి పారుదల మంత్రి వచ్చాడు. డేట్ మారుతుంది కానీ, పోలవరం ఫేట్ మారటం లేదు. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్, గైడ్ బండ్ నాశనం చేసాడు జగన్. నిర్వాసితుల్ని నిండా ముంచేసాడు. పోయిన ఏడాది గోదావారి జిల్లాకి వెళ్లి, సెప్టెంబర్ లోగా నేనే డబ్బులు ఇస్తా, కేంద్రంతో పని లేదు అన్నాడు. నిన్న వెళ్లి, నాదేమీ లేదు, దేవుడు దయతో, మోడీ గారే బటన్ నొక్కాలని చేతులు ఎత్తేశాడుభూమికి అదనంగా ఇస్తానన్న రూ.3.85 లక్షలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద ఇస్తానన్న రూ.10 లక్షల ప్యాకేజ్ అన్ని గాల్లో కలిసిపోయాయి.
ప్రాజెక్టులు కట్టే చంద్రబాబు గారు పోలవరం డ్యామ్ అయితే ఉన్నవి కూలగొట్టే జగన్ మురుగు కాలువతో సమానం.టిడిపి సర్కారు ఐదేళ్లలో 72 శాతం పనులు చేశాం కాబట్టి ధైర్యంగా, గర్వంగా బస్సులలో వేలాది మంది జనాన్ని తీసుకెళ్లి పోలవరం ప్రాజెక్టు చూపించాం. సైకో జగన్ నాలుగేళ్ల పాలనలో 7 శాతం పనులు చేయకపోవడంతో ప్రాజెక్టు వద్దకి ఎవ్వరినీ వెళ్లనివ్వడంలేదు. కేసులు నమోదు చేస్తున్నారు.
చిరంజీవి గారు మాట్లాడితే వైసిపి కుక్కలు అన్ని రోడ్ల పైకి వచ్చి మొరుగుతున్నాయి. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది? సినిమా పరిశ్రమ పై రాజకీయాలు చెయ్యొద్దు అన్నారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం పై ద్రుష్టి పెట్టండి. సంక్షేమ పధకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించండి అన్నారు. నాలుగేళ్ల మూడు నెలల్లో జగన్ పీకింది ఏమీ లేదు కాబట్టే వైసిపి కుక్కలకు కోపం వచ్చింది.
అంబటి రాంబాబు డ్యాన్సులు వేసింది నిజం కాదా? సంజన, సుకన్య తో మాట్లాడింది నిజం కాదా?
జరిగింది సినిమాలో పెడితేనే కోపం వస్తే మాకెంత కోపం రావాలి?
చంద్రబాబు గారిని, నన్ను, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ కట్టు కథతో సినిమా తీసిన రోజు ఈ వైసిపి కుక్కలకు విలువలు గుర్తు రాలేదా?జగన్ పాలన లో ఆంధ్రప్రదేశ్ అంధకారప్రదేశ్ గా మారిపోయింది. విద్యుత్ ఉద్యోగులు కూడా జగన్ బాధితులే. విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు టిడిపి పూర్తి మద్దతు ఇస్తుంది.
టిడిపి హయాంలో విద్యుత్ ఉద్యోగులకు 25% ఫిట్మెంట్ ఇస్తే జగన్ కేవలం 7% ఫిట్మెంట్ ఇచ్చాడు. మూడు డిఏలు పెండింగ్ పెట్టాడు. కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగులరైజ్ చేస్తానని మోసం చేశాడు. జిపిఎఫ్, పెన్షన్, లీవ్ ఫండ్ లో ఉన్న రూ.12 వేల కోట్లను పక్కదారి పట్టించాడు. పాదయాత్ర లో జగన్ విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి.విద్యుత్ ఉద్యోగులు చెయ్యాల్సింది పెన్ డౌన్, సెల్ డౌన్ కాదు..జగన్ కి కరెంట్ షాక్ ఇవ్వండి అప్పుడు కానీ దున్నపోతు ప్రభుత్వం నిద్రలేవదు.
జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా.జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు.
మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి.
జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్.
జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు.
2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం.మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.
జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.
యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం.
అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది.
రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.
ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా కోతపెట్టాడు జగన్. 15 శాతం అలవెన్స్ కట్ చేసాడు.ఎస్ఐ కి 10 వేలు, హెడ్ కానిస్టేబుల్ కి 8 వేలు, కానిస్టేబుల్ కి 6 వేలు కట్ చేసాడు. జగన్ తెచ్చిన జిఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్ యధాతధంగా ఇస్తాం.
బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న, సీఐ ఆనందరావు వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూశారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు.
మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి హయాంలోనే సత్తెనపల్లి అభివృద్ధి చెందింది.2014 నుండి 2019 వరకూ సత్తెనపల్లికి స్వర్ణయుగం. రూ.1400 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపి.
పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. తాగు, సాగునీటి ప్రాజెక్టులు, సిసి రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, టిడ్కో ఇళ్లు, ఆర్ అండ్ బి రోడ్లు, మరుగుదొడ్లు, స్మశానాలను కూడా అభివృద్ధి చేసింది టిడిపి.చెరువులు నిర్మించి సత్తెనపల్లి పట్టణానికి తాగునీరు అందించాం. మెయిన్ రోడ్డు విస్తరించాం. ప్రభుత్వాసుపత్రిని నిర్మించాం. తారకరామ సాగర్, వావిలాల స్మృతి వనం ఏర్పాటు చేశాం. సత్తెనపల్లి నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయ, బీసీ బాలికల గురుకుల పాఠశాల, ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలు తీసుకొచ్చింది తెలుగుదేశం. కానీ మీరు ఏమి చేసారు పాలిచ్చే ఆవుని కాదనుకొని తన్నే ఆంబోతుని తెచ్చుకున్నారు.
సత్తెనపల్లి ని అభివృద్ధి చేస్తాడని అంబటి రాంబాబు ని గెలిపించారు. రాంబాబు నాకు పని తగ్గించాడు. సత్తెనపల్లి లో వైసిపి కార్యకర్తలు, నాయకులే ఆయనకి ముద్దుగా నోటిదూల. కాంబాబు అని పేరు పెట్టుకున్నారు అంట.మన రాష్ట్రం దరిద్రం..నోటిదూల. కాంబాబు నీటిపారుదల శాఖా మంత్రి కూడా అయ్యాడు. నీటి పారుదల శాఖా మంత్రిగా కంటే…నోటి పారుదల శాఖా మంత్రిగా అతను ఫ్యామస్.
డయాఫ్రం వాల్ గురించి తెలియదు కానీ…సంజన గురించి తెలుసు.. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేడు కానీ..సుకన్య ఎక్కడికి రావాలో చెబుతాడు.. నోటిదూల. కాంబాబుకి పగలు వాగుడు…రాత్రి గోకుడు…ఇదే పని.
హస్కీ వాయిస్ తో సుకన్యా ఇంకేం చెయ్యదా? అన్ని చేస్తారా అంటాడు నోటిదూల. కాంబాబు. పోలవరం ప్రాజెక్టు కి నిధులు కావాలని ఏ రోజూ ఢిల్లీ వెళ్లని కాంబాబు సిగ్గులేకుండా పవన్ కళ్యాణ్ సినిమా బ్రో సినిమా మీద ఫిర్యాదు చెయ్యడానికి ఢిల్లీ వెళ్తాడు. మన బహిరంగ సభ జరుపుకుంటున్న రాజుపాలెం మండలం నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా.. గత నాలుగేళ్లలో ఈ మండలంలో ఒక్క జగనన్న కాలనీలోనైనా ఒక్క ఇల్లయినా కట్టారా? బీసీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణానికి చంద్రబాబు గారు 38 కోట్ల నిధుల్ని మంజూరు చేయిస్తే ఈ నాలుగేళ్లలో ఒక్క ఇటుకైనా పెట్టావా నోటిదూల కాంబాబు.
పులిచింతల పునరావాస కాలనీల ప్రజల ఇబ్బందుల్ని ఏనాడైనా పట్టించుకున్నాడా?కొండమోడు లో అవినీతి అనకొండ కాంబాబు అక్రమ మైనింగ్ పై వైకాపా నాయకులు కోర్టుకెక్కారు. మొన్నటి వరకు తమ్ముడు, ఇప్పుడు అల్లుడు, మండలానికి ఒక బ్రోకర్ని పెట్టుకొని దోచేస్తున్నాడు. ఋషికొండలా నకరికల్లు, రాజుపాలెం కొండలకి గుండు కొట్టి కోట్లు కొల్లగొడుతున్నాడు.
చికెన్ వేస్టే తరలించే వాళ్ల దగ్గరా.. పుచ్చకాయల అమ్మే బండ్లు దగ్గరా వసూళ్లు చేస్తున్నాడంటే ఎంతకి దిగజారిపోయాడో అర్థం అవుతోంది.పారిశుద్ధ కార్మికుల ఉద్యోగాలు వేయించడంలోనూ, వారి వేతనాల్లోనూ కాంబాబు వాటాలు అడుగుతున్నాడు. 2019 ఎన్నికలకు ముందు సత్తెనపల్లిలో సెంటు స్థలం లేని అంబటి ఇప్పుడు అవినీతి సొమ్ముతో నియోజకవర్గమంతా పొలాలు, స్థలాలు కొనేశాడు. కొట్టేశాడు. సత్తెనపల్లి వినాయక హోటల్లో తురక అనిల్ అనే యువకుడు చనిపోతే ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన ఐదు లక్షల్లో రెండున్నర లక్షలు ఇస్తేనే చెక్కు ఇస్తానన్న అవినీతి కాంబాబు.
రైతుల్ని బెదిరించి ఎకరా 10 లక్షలకి కొని సెంటు స్థలాల కోసం ప్రభుత్వానికి ఎకరా 40 లక్షలకి అమ్మేసాడు కాంబాబు. 2 కోట్లకి భూమి కొని ఎస్టీపీ ప్లాంట్ కోసం ప్రభుత్వానికి 8 కోట్లకే అమ్మేందుకు కాంబాబు ప్రయత్నిస్తున్నాడు. మైకుల ముందు రంకెలు వేయడం కాదు.. ఇరిగేషన్ మంత్రిగా ఒక్క పిల్ల కాలువ అయినా తవ్వించావా. 2018లో గోదావరి, పెన్నా నదుల అనుసంధానానికి సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు లోనే చంద్రబాబు శ్రీకారం చుట్టారు.. దేశంలోనే తొలి నదుల అనుసంధానంతో అద్భుత ఫలితాలు తెచ్చిన చంద్రన్న ప్రయత్నాలని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకువెళ్ళలేదు కాంబాబు.
టిడిపి పాలనలో 1500 కోట్లతో ప్రారంభించిన అభివృద్ధి పనులు పూర్తి చేసి వుంటే సత్తెనపల్లి నియోజకవర్గం ఒక రేంజులో ఉండేది. 80 శాతం టిడిపి సర్కారు పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను 20 శాతం పూర్తి చేయలేని చేతకాని మంత్రి. వైకాపా పాలనలో గంజాయి అడ్డాగా సత్తెనపల్లి నియోజకవర్గం మారిపోయింది.. ఏ2 విజయసాయిరెడ్డి బంధువులు సేఫ్ ఫార్మా కంపెనీలో ఉగ్రవాదులకి అవసరమైన డ్రగ్స్ తయారు చేస్తుంటే…మంత్రిగా ఏం చేస్తున్నావు కాంబాబు.
ఓటమి భయంతో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వేధిస్తున్నాడు. ధూళిపాళ్లలో ఉచిత వైద్య శిబిరానికి అనుమతిచ్చారని దళిత ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయించాడు ఈ కాంబాబు. 2024 లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయం. సత్తెనపల్లి లో భారీ మెజారిటీతో టిడిపి ని గెలిపించండి. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం.పేదలకు టిడ్కో ఇళ్లు పూర్తిచేసి లబ్దిదారులకు అందిస్తాం.మేజర్ స్టేడియం, షాది ఖానా భవనాల్ని పూర్తి చేస్తాం. చెక్ డాంల పనులను పూర్తి చేసి నీరందిస్తాం. పేరేచర్ల నుంచి కొండమోడ వరకు ప్రధాన రహదారి విస్తరిస్తాం.స
త్తెనపల్లి అచ్చంపేట రోడ్డులోని రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేంద్రం తో సంప్రదించి అమలు అయ్యేలా చేస్తాం. రాజుపాలెం నకరికల్లు మండలాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తాం. కన్నా లక్ష్మీనారాయణ గారిని ఆశీర్వదించండి. టిడిపి ని గెలిపించండి. పులిచింతల పునరావాస కాలనీలని నగర పంచాయతీలతో సమానంగా అభివృద్ధి చేస్తాం. కార్యకర్తల్ని వేధించిన వారిని వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా.కాంబాబు అరాచకాలు నేను మర్చిపోను. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన వారు సత్తెనపల్లిలో ఉన్నా సింగపూర్ పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా.