Suryaa.co.in

Andhra Pradesh

బీసీ నేతలే లక్ష్యంగా జగన్ దాడులు చేయిస్తున్నారు

-జగన్ పాలనలో బీసీల రక్తచరిత్ర నడుస్తోంది
– టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్

గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ రౌడీ మూకల దాడి దుర్మార్గం. బీసీ నేతలే లక్ష్యంగా జగన్ దాడులు చేయిస్తున్నారు. జగన్ పాలనలో బీసీల రక్తచరిత్ర నడుస్తోంది. టీడీపీ బీసీ కార్యకర్తల్ని హత్యలు చేయిస్తూ మరో వైపు టీడీపీ బీసీ నేతల్ని అక్రమ కేసులతో వేధిస్తున్నారు. ఒకవైపు పదవులు ఇచ్చామని చెప్పుకుంటూ మరోవైపు బీసీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. జగన్ పాలనలో బీసీలపై జరిగిన దాడులు,దౌర్జన్యాలు గతంలో ఎన్నడూ జరగలేదు. బీసీలపై రోజుకో దాడి, పూటకో దౌర్జన్యంగా అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి నెలకొంది. బీసీలని వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బీసీల ఉసురు తగలక తప్పదు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని,చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.

LEAVE A RESPONSE