Suryaa.co.in

Andhra Pradesh

పాదయాత్రలో అల్లర్లు సృష్టించి లండన్ లో చలికాచుకుంటున్న జగన్

– గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ

యువగళం పాదయాత్ర దిగ్విజయాన్ని తట్టుకోలేక ఎక్కడ జగన్ పాదయాత్ర మైలురాయిని దాటిపోతుందనే భయం అక్కసుతోనే యువగళం పాదయాత్రలో అల్లర్లు సృష్టించి లండన్ లో చలికాచుకుంటున్న ముఖ్యమంత్రి వలంటీర్ల అక్రమ అరెస్టునుతీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే అక్రమ కేసులు ఎత్తివెయ్యకపోతే ఆందోళనలు చేస్తామని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆగ్రహంవ్యక్తం చేశారు.

200 రోజులుగా ఎక్కడ లేని అక్రమ అరెస్టులు కేవలం ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలలోనే ఎందుకు జరుగుతున్నాయనేది పౌర సమాజం గ్రహిచాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో తనకు దక్కిన రికార్డు మరొకరికి దక్కకూడదనే అక్కసుతోనే ఎక్కడ యువనేత నారా లోకేష్ 3000 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటిపోతారో అనే భయం దిగులుతో ముఖ్యమంత్రి లండన్ లో కూర్చొని వణికిపోతున్నారని విమర్శించారు.

ఇప్పటి దాక ఏ జిల్లాలోనూ లేని అక్రమ అరెస్టులు ఇప్పుడే జరుగుతున్నాయంటే ఇది కుట్ర గానే భావించాలంని 2019 ఎన్నికలకు ముందు కూడా ఇదేమాదిరిగా గోదావరి జిల్లాలోనే అల్లర్లు జరిగిన విషయాన్నీ ప్రజానీకం గ్రహించాలని ఓటమి భయంతోనే పాదయాత్రలో అల్లర్లు సృష్టించాలని వైకాపా కుట్ర చేస్తుందని ఆరోపించారు. కానీ యువనేత నేత నారా లోకేష్ ప్రభంజనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిపోయిందని స్వచ్ఛందంగా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని అన్నారు.

వెంటనే అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేసిన వాలంటీర్లను విడిచిపెట్టి అక్రమ కేసులు ఎత్తివేయాలని లేకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

LEAVE A RESPONSE