• అమరావతి నిర్మాణం చేతగాకే జగన్ రెడ్డి ఆప్రాంతంపై, పాదయాత్ర చేస్తున్న రైతులపై విధ్వంసరచన చేస్తున్నాడు
• స్వప్రయోజనాలకోసమే ధర్మాన, బొత్స, ఇతరమంత్రులు అమరావతి రైతులపై అక్కసు వెళ్లగక్కుతున్నారు
• కోర్టు అనుమతితో, ప్రజలమద్ధతుతో సాగుతున్న రైతులపాదయాత్రను కిరాయిమూకలతో అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నాడు
• ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణలు నాలుకలు మడతేయడంలో సిద్ధహస్తులు
• గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని అనరాని మాటలని, ఇప్పుడేమో పదవులకోసం ఉత్తరాంధ్రపై మొసలికన్నీరు కారుస్తున్నారు
• నక్కా ఆనంద్ బాబు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని స్వాగతించిన జగన్ రెడ్డి, అధికారం దక్కగానే ఎక్కడలేని అక్కసు వెళ్లగక్కుతూ, ఆప్రాంత రైతులపై విద్వేషంతో వ్యవహరిస్తున్నా డని, 6నెలల్లో రాజధానినిర్మాణం పూర్తిచేయాలన్న హైకోర్టు ఆదేశాలను పెడచెవినపెట్టి, తనకులేని అధికారం హక్కుల కోసం పాకులాడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!
“రాజ్యాంగాన్ని, కోర్టు తీర్పులను లెక్కచేయకుండా, అమరావతిపై, ఆప్రాంత రైతులపై జగన్ రెడ్డి విధ్వంసరచన చేస్తున్నాడు. అమరావతి రైతుల పాదయాత్రను చూసి ఓర్వలేకే జగన్ రెడ్డి వికేంద్రీకరణ నినాదం ఆలపిస్తున్నాడు. వికేంద్రీకరణ ఊసెత్తడానికి ముఖ్యమంత్రికి మంత్రులకు సిగ్గుందా? పరిపాలనా సౌలభ్యం కోసం ఎన్టీఆర్ మండల వ్యవస్థను తెస్తే జగన్ ప్రభుత్వం దాన్ని విచ్ఛిన్నం చేసింది. అభివృద్ధికి రోల్ మోడల్ గా నిలిచింది చంద్రబాబు అని దేశమంతా తెలుసు. రాజధాని మార్చే అధికారం తనకు లేదని జగన్ రెడ్డికి తెలియదా? ఆ అధికారం లేదని ఒప్పుకుంటూ విజయసాయిరెడ్డి ప్రైవేట్ బిల్లు తీసుకొచ్చింది వాస్తవంకాదా ? ఏపీలో రాజధానుల ఏర్పాటుపై రాష్ట్రశాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యంగ సవరణ చేయాలంటూ విజయసాయిరెడ్డి, పార్లమెంటులో బిల్లుపెట్టడం ముమ్మాటికీ దుర్మార్గమే. మార్చి3న హైకోర్ట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో రాజధాని మార్చే అధికారం శాసనసభకు లేదని చెప్పిన విషయం ముఖ్యమంత్రికి తెలియదా? మంగళ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్ట్ ఇచ్చినతీర్పుని కూడా హైకోర్టు ప్రస్తావించింది. హైకోర్టు ఆదేశాలప్రకారం 6నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తిచేయడం చేతగాకనే జగన్ రెడ్డి, అమరావతిపై సుప్రీంకోర్టుకి వెళ్లాడు. కోర్టు తీర్పులకు విరుద్ధంగా తనకులేని హక్కులు, అధికారం కోసం జగన్ రెడ్డి ప్రాకులాడుతున్నాడు. చీటింగ్ ముఠాలసాయంతో ఒకలయర్ (అబద్ధాలకోరు) రాష్ట్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని ఇప్పటికే ప్రజలు వాపోతున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రజాభిప్రాయసేకరణ జరిపితే, 52శాతంప్రజలు అమరావతికి మద్ధతుపలికారు. ఇదే విషయాన్ని శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో పేర్కొన్నది.
పంచాయతీల్లో పారిశుధ్యపనులు చేయలేని దుస్థితిలో ఉన్న జగన్ ప్రభుత్వం… అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తుందా?
జగన్ రెడ్డి దృష్టిలో అభివృద్ధి వికేంద్రీకరణ అంటే స్థానికసంస్థలను నిర్వీర్యంచేసి, సర్చంచ్ లు, మేయర్లను ఉత్సవవిగ్రహాలను చేయడమా? 14, 15 ఆర్థికసంఘాలనుంచి పంచాయతీలఅభివృద్ధికోసం కేటాయించిన రూ.12వేలకోట్లసొమ్ముని దిగమింగిన జగన్ రెడ్డి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిచేస్తాడని ప్రజలంతా నిలదీస్తున్నారు. గ్రామాల్లో కనీసం పారిశుధ్య పనులు కూడా చేయలేని దుస్థితిలోఉన్న జగన్ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ జపంచేయడం సిగ్గుచేటు. స్థానిక సంస్థలకు హక్కులు, అధికారాలు బదలాయిస్తూ చట్టంచేస్తే, దాన్నికూడా జగన్ రెడ్డి ధ్వంసం చేశాడు. ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్ లు, మేయర్లను జగన్ రెడ్డి ఎందుకూ పనికిరాని డమ్మీలను చేశాడు. స్వలాభం దోపిడీకోసమే జగన్ రెడ్డి వార్డు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. రాజధానిగా అమరావతి ఏర్పాటుని ప్రతిపక్షనేతగా స్వాగతించిన జగన్ రెడ్డి, ఇప్పుడు మాటమార్చి, మడమ తిప్పడమేనా అభివృద్ధి వికేంద్రీకరణ?
విశాఖపట్నంసహా, 13జిల్లాల్లో అభివృద్ధికి బాటలువేసింది చంద్రబాబే…
మూడున్నరేళ్ల తన పాలనలో విశాఖపట్నంలో జగన్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో, విశాఖలో అభివృద్ధి జరిగిందంటే అది చంద్రబాబుగారి హాయాంలోనే. అసలు అభివృద్ధి అనే పదానికి రోల్ మోడల్ చంద్రబాబు. ఆయన పాలనను అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. హైదరాబాద్ లో నిర్మాణం జరిగిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదలు విభజనానంతరం నవ్యాంధ్రప్రదేశ్ లోని 13జిల్లాల్లో అభివృద్ధిని వేగవంతం చేసింది చంద్రబాబుగారు. విశాఖను ఐటీకేంద్రంగా తీర్చిదిద్దడమేగాక, ఎన్నోజాతీయ, అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థలను అక్కడికి తీసుకొచ్చారు. ఐ.ఐ.ఎమ్, పెట్రోలియం యూనివర్శిటీ, మెడ్ టెక్ జోన్, 2లక్షలచదరపు అడుగుల్లో మిలీనియం టవర్స్, క్లౌడ్ సిటీ ఏర్పాటుతోపాటు, 3సార్లు సీఐఐసమ్మిట్ ల నిర్వహించి సాగరనగరాన్ని ప్రపంచపటంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబుగారిది, టీడీపీప్రభుత్వానిది. ఈ విధంగా చెప్పుకోవడానికి జగన్ రెడ్డి విశాఖలో ఏమైనా చేశాడా? తన దోపిడీకి, భూములకబ్జాకు జగన్ రెడ్డి విశాఖను అడ్డాగా మార్చాడు. టీడీపీ హాయాంలో ఏజెన్సీప్రాంతంలో కాఫీతోటలుసాగుచేస్తే, జగన్ రెడ్డి వచ్చాక గంజాయిసాగుతో రాష్ట్రంపరువు తీశాడు.
కర్నూల్లో హైకోర్ట్ పెడతానంటున్న జగన్ రెడ్డి అక్కడైనా ఈమూడున్నరేళ్లలో అక్కడేంచేశాడో చెప్పగలడా? టీడీపీ ప్రభుత్వంలో కర్నూలుజిల్లాలో రూ.5వేలకోట్లతో ఏర్పాటైన సోలార్ హబ్, ట్రిపుల్ ఐటీ, ఉర్దూయూనివర్శిటీ, పాణ్యంలో రెన్యువల్ ఎనర్జీప్రాజెక్ట్, ఓర్వకల్లు ఇండిస్ట్రియల్ కారిడార్, నందికొట్కూరులో మెగాసీడ్ పార్క్ లాంటి ఎన్నో గొప్పప్రాజెక్ట్ ల ఏర్పాటుతో 15వేలపైచిలుకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ? చంద్రబాబునాయుడి గారి ఘనతకు ప్రబల నిదర్శనంగా నిలిచిన కియాకార్ల పరిశ్రమ కళ్లముందు కనిపిస్తోంది. ఇలా చెప్పకోవడానికి జగన్ రెడ్డి తనప్రభుత్వంలో ఒక్కటైనా చేశాడా? తన సొంతజిల్లా కడపకైనా జగన్ రెడ్డి ఏం ఒరగబెట్టిందిలేదు.
స్వప్రయోజనాలకోసం నాలుకమడతేస్తున్న మంత్రులంతా రాజకీయ వ్యభిచారులే…
ముఖ్యమంత్రి దుర్మార్గపు ఆలోచనలను సమర్థిస్తూ, కేబినెట్ మంత్రులు వ్యవహరించడం సిగ్గుచేటు. అమరావతి రైతుల్ని ఉత్తరాంధ్రప్రాంతంలో అడుగుపెట్టనీయమని మంత్రులు మాట్లాడటం నిజంగా క్షమించరానినేరం. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్లు నరంలేని నాలుకతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. గతంలో కాంగ్రెస్ లోఉన్నప్పుడు ఇదే ధర్మాన జగన్ రెడ్డిని అనని మాటలులేవు. ‘జగన్ పత్రికలో అన్నీ అబద్ధాలేనని, జగన్ పత్రిక ఒకకరపత్రమని, జగన్ పదవీదాహానికి అంతులేదని’ ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. అలాంటి ధర్మాన ఇప్పుడు తన నాలుక మడతేసి సిగ్గులేకుండా ఉత్తరాంధ్రను ఉద్ధరించేవాడిలా మాట్లాడుతున్నాడు. బొత్స సత్యనారాయణ అయితేఏకంగా వైఎస్ మరణం వెనుక, జగన్ హస్తమే ఉందని గతంలో ఒక సందర్భంలో మాట్లాడాడు. జగన్ అవినీతిపై బొత్స స్పందిస్తూ, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా దక్కాల్సింది దక్కుతుందిలే అని చెప్పలేదా? ఎవరు వడ్డించారో సీబీఐ తేలుస్తుందని అనలేదా? ఏరోటికాడ ఆపాటపాడుతూ, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే నిజంగా వారంతా రాజకీయ వ్యభిచారులే. జగన్ రెడ్డికి, ఇలాంటి పనికిమాలిన మంత్రులకు ఎందుకు అధికారం ఇచ్చామా అని ప్రజలంతా లెంపలేసు కుంటున్నారు. కిరాయిమూకలతో అమరావతి రైతుల్ని అడ్డుకొని, వారినేదో చేయాలనే దుష్టఆలోచనలో ఈప్రభుత్వం, జగన్ రెడ్డి ఉన్నారు. విశాఖ వాసులకు జగన్ రెడ్డి పొడ, వాసన గిట్టదు. ప్రశాంతమైన వాతావరణాన్ని అక్కడివారు ఇష్టపడతారు కాబట్టే, గతంలో విజయమ్మను ఓడించారు. జగన్ రెడ్డి కొత్తగా విశాఖను రాజధానిచేయాల్సిన పనేంలేదు. భారతదేశంలో అభివృద్ధిచెందిన నగరాల జాబితాలో విశాఖపట్నం ఎప్పుడూఉంటుంది. రాజ్యాంగాన్ని, కోర్టు తీర్పులు ధిక్కరిస్తూ, అమరావతిపై, ఆప్రాంత రైతులపై విషం చిమ్ముతున్నవారికి త్వరలోనే తగినవిధంగా ప్రజలు బుద్ధిచెబుతారు. జగన్ రెడ్డి ఇప్పటికైనా తన విధ్వంసరచనకు స్వస్తిచెప్పకపోతే, ఏపీప్రజలు ఆయనకు సమాధికట్టడం ఖాయం” అని ఆనంద్ బాబు హెచ్చరించారు.