• నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి
• ధన దాహంతో కుటుంబ వ్యవస్థనే జగన్ అగౌరవపరుస్తున్నారు
• తల్లి, చెల్లిని వీధికి లాగి ఆస్తికోసం వెంపర్లాడుతున్న వ్యక్తి
మంగళగిరి: ధన దాహంతో కుటుంబ వ్యవస్థను జగన్ రెడ్డి అగౌరవపరుస్తూ.. తల్లిని, చెల్లిని వీధికి లాగారని.. నైతిక విలువలు లేని వ్యక్తి జగన్ రెడ్డి అని.. షర్మిలకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని.. లేదంటే ఆమె ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దోపిడీ ఆస్తుల పంపకంలో దుష్ట సంప్రదాయానికి జగన్ రెడ్డి తెరతీశారు. భారత కుటంబ వ్యవస్థను ప్రపంచం అంతా గౌవరవిస్తుంటే, ఆ విలువలకు జగన్ రెడ్డి తిలోదకాలిచ్చారు. జగనన్న వదిలిన బాణం షర్మిల అని ఆమె నాడు ప్రచారం చేసింది. ఆ బాణమే నేడు తన గుండెల్లో గుచ్చుకుంది. జగన్ రెడ్డిని చూసి విజయమ్మ ప్రాణ భయంతో నాడు పారిపోయిందని ప్రజలనుకుంటున్నారు. మీ బంగారం మంచిది అయితే స్వర్ణకారులు ఏం చేస్తారు జగన్ రెడ్డి? జగన్ రెడ్డి వద్ద 8 లక్షల 32 వేల కోట్లు అక్రమ ఆస్తులు ఉన్నట్టు ప్రజల వాక్కు.
2004 సంవత్సరంలో జగన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన ఎన్నికల అఫిడవిట్ లో చూపిన ఆస్తి రూ. 1. 76 కోట్లు, 2009 లో చూపింది రూ.2.6 కోట్లు మాత్రమే. జగన్ రెడ్డి 2004 లో ఒక కోటి 73 లక్షలు 2009 లో 38 కోట్లు, 2011 బై ఎలక్షన్ లో 390.73 కోట్లు, 2019 ఎలక్షన్ లో రూ. 500 కోట్లు, 2024 ఎన్నికల్లో 757.65 కోట్లు చూపించారు. ఇంతాల పెరగడం ఎలా సంభవం..? టాటా, బిర్లా, అంబానీల ఆస్తులు కూడా ఈ రేషియోలో పెరగలేదే ? మీకు ఎలా సాధ్యమైంది జగన్ రెడ్డి? ప్రజలకు చెప్పండి. ఆస్తులపై ధైర్యంగా జనాలకు మీరు సమాధానం చెప్పగలరా? అని వర్ల ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
బహిరంగంగా 16 కంపెనీలు… రహస్యంగా 50కి పైగా సూటికేస్ కంపెనీల లకు ఎలా అధిపతి అయ్యారు జగన్ రెడ్డి? వేలాది ఎకరాలు, బెంగళూరు, ఇడుపులపాయతో పాటు పలు రాష్ట్రాల్లో ఉన్న ప్యాలెస్ లు ఎలాకట్టారో చెప్పగలరా? సీబీఐ 43 వేల కోట్లు అన్యాక్రాంతం చేశారని ఛార్జ్ షీట్ వస్తే.. ఆ నేరం నేను చేయలేదని మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు జగన్ రెడ్డి? అక్రమ ఆస్తులు కనుకే కుటుంబ వ్యవస్థను రోడ్డుకు ఈడ్చి చెల్లి, తల్లి అని లేకుండా వారిని ఇబ్బందులు పెడుతున్నారు.
12 ఏళ్ళు బెయిల్ మీద ఉన్న వ్యక్తి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతుంటే న్యాయవ్యవస్థ దేశ ప్రజలకు ఏ సమాధానం చెబుతుంది? సామన్య ప్రజల విషయంలో ఒకరకంగా.. ఆర్థిక ఉగ్రవాదులు, అవినీతి సొమ్ముతో రాజకీయాలను ఏలుతున్న ఉగ్రవాదుల పట్ల కోర్టులు ఎందుకు మరోలా వ్యవహరిస్తున్నాయని ప్రజలనుకుంటున్నారు! దేశంలోనే అత్యధిక ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని ది బ్రింట్, ఏడీఆర్ వంటి సంస్థలు చెప్పాయి.
భారత దేశంలో అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందారో రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా? మీ సంపాదనపై సుప్రీంకోర్టే ఆశ్చర్యం వ్యక్తం చేసింది నిజం కాదా జగన్ రెడ్డి. ఇసుక, మైన్స్, గంజాయి, ల్యాండ్స్, స్మార్ట్ మీటర్స్, కోవిడ్ మందుల కొనుగోలు, భారతి సిమెంట్స్ కట్టబెట్టిన దోపిడీలు అన్నీ కలిపి ఎనిమిది లక్షల కోట్లు పైనే అని ప్రజలు అనుకుంటున్నారు. తల్లిని, చెల్లిని బజారుపాలు చేసిన మీరు ఇంకో మహిళకు న్యాయం చేస్తానంటే రాష్ట్రంలో ఏ మహిళా నమ్మదు. వాసిరెడ్డి పద్మతో సహా.