– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
జగన్ నా ఎస్సీలు అంటూనే రోజుకొక ఎస్సీని చంపేయిస్తున్నాడు. దళిత ఎమ్మెల్యే నియోజకవర్గం, దళిత హోం మంత్రి ఇలాఖాలో దళిత యువకుడు మహేంద్ర పోలీసులు వేధింపులు తాళలేక ఆత్మహత్యకి పాల్పడటం రాష్ట్రంలో దళితులపై అధికార వైసీపీ సాగిస్తున్న దమనకాండకి మరో నిదర్శనం. బాధితుడు పిన్ని వైసీపీ జెడ్పీటీసీ విజయలక్ష్మి వైసీపీ పెద్దల్ని వేడుకున్నా కనికరించలేదు. మహేంద్రని కస్టడీలోకి తీసుకుని హింసించిన పోలీసులని విధుల నుంచి తొలగించాలి. ఎస్సీలపై దాడులు అరికట్టాల్సిన ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంటే.. ఇంకో డాక్టర్ సుధాకర్, ఇంకో ఓంప్రతాప్, మరో చీరాల కిరణ్‌కుమార్‌లాగే దళితులు బలవుతూనే ఉంటారు.