– జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే దళితులపై ఎన్నడూలేనన్ని దుర్మార్గాలు
– దళితులకు నిజంగా మేలుచేసింది స్వర్గీయ ఎన్టీఆర్. చంద్రబాబే
– లోకేశ్ చెప్పింది నిజమని ఒప్పుకొని చెంపలు వాయించుకోవాల్సిన జగన్, అతనిమంత్రులు, సాక్షిలో తప్పుడురాతలు రాయిస్తారా?
– అధికారంకోసం జగన్ పన్నిన నేరవ్యూహాల్లో భాగమే కోడికత్తి డ్రామా.. బాబాయ్ హత్య
• సాక్షి దినపత్రిక పత్రికే కాదు.. చూడగానే యాక్ ఛీ అనిపించే పత్రిక
• తన హయాంలో దళితులపై జరిగిన దారుణాలు, దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలపై జగన్ ఎందుకు నోరెత్తడు?
• తనప్రభుత్వంలో, తనపార్టీనేతలే దళితుల్ని బలితీసుకుంటే, జగన్ ఒక్కరినీ శిక్షించలేదు.
• చంద్రబాబు దళితులకోసం అమలుచేసిన అనేకపథకాల్ని రద్దుచేసిన జగన్, వారికి తాను బిడ్డనని చెప్పడం సిగ్గుచేటు. జగన్ జమానాలో దళితులపై జరిగిన దారుణం జాబితా ప్రజలముందు ఉంచుతాం.
• ముఖ్యమంత్రి, మంత్రివర్గంలో ఎవరైనా సరే దానిపై బహిరంగచర్చకు రావచ్చు
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు
జగన్ రాష్ట్రముఖ్యమంత్రిగా ఉండటం నిజంగా ప్రజల దౌర్భాగ్యమని, ఏపీకి దరిద్రమని, కేవ లం డబ్బు, భూములమీద ఆశ, లక్షలకోట్లు కొట్టేయాలన్న దురాశతప్ప ఆయనకు మరేమీ పట్టడంలేదని, ఈమధ్యకాలంలో జరుగుతున్నవి చూస్తుంటే, జగన్ తన తండ్రి మరణాన్ని కోరుకొని, ఆయన ఎప్పుడుచనిపోతాడా అని ఎదురు చూశాడని అర్థమవుతోందని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
తండ్రి చావుకోసం జగన్ ఎదురుచూశాడనటానికి, రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు జగన్ అన్నమాటలు, తరువాత అతను ప్రవర్తించిన తీరే నిదర్శనం. “రాజశేఖర్ రెడ్డి చనిపోతే బాగుండు, ఆయన అధికారంతో తాను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కవచ్చునని జగన్ దుర్మార్గంగా ఆలోచించాడు. సాక్షి పత్రి కలో రాసేరాతలు.. ఆ ఛానల్ లో చూపించే నీతిమాలిన కథనాలే అందుకునిదర్శనం. సాక్షి దినపత్రిక అసలు పత్రికేకాదు. జర్నలిజం విలువలకుకట్టుబడి, నీతి, నిబద్ధతతో పనిచేసే పత్రి కల్నే ఇప్పటివరకు మనంచూశాం. కానీ జగన్ తనఅవినీతిసొమ్ముతో ఏర్పాటుచేసిన సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ సృష్టించిన విషపురాతలు, రక్తపుమడుగుల్లోంచే జగన్ అధికారంలోకి వచ్చాడు. అతని ఆలోచనావిధానం చూస్తే ఎంతటి దుర్మార్గుడో అర్థమవుతోంది.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. ఆసమయంలో జగన్ మాట్లాడుతూ, “తన తండ్రి చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాను, హెలికాఫ్టర్ ప్రమాదంలో మా నాన్నచనిపోవడం ఏమిటి? రిలయన్స్ వారు, కాంగ్రెస్ కలిసి మా నాన్నను చంపేశారు.” అన్నాడు. ఆయన మాటల్ని యథాతథంగా సాక్షిలో ప్రచురించారు. జగన్ వ్యాఖ్యలతో వై.ఎస్.ని అభిమానించేవారంతా ఆగ్రహంతో రిలయన్స్ సంస్థలపై దాడి కి పాల్పడ్డారు. కాంగ్రెస్ ను భయపెట్టి ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలతో సంత కాలు పెట్టించిన జగన్ ఆటలు సాగలేదు. దాంతో సొంతపార్టీ పెట్టి, ఓదార్పుపేరుతో ప్రజల్ని మాయమాటలతో వంచించి ఎట్టకేలకు 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు.
తండ్రిని చంపింది రిలయన్స్ సంస్థ అని, ఆ సంస్థఆస్తులపై దాడులుచేయించినజగన్, ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే అదేసంస్థ చెప్పినవారికి రాజ్యసభపదవి ఎలా ఇచ్చాడు?
తనతండ్రి చావుకి రిలయన్స్ కారణమని గతంలో చెప్పిన జగన్, ముఖ్యమంత్రి కాగానే అదే రిలయన్స్ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ చెప్పిన పరిమల్ నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చాడు. అంబానీ సంస్థకు, అదానీకి అప్పనంగా రాష్ట్రంలోని భూముల్ని, ఆస్తుల్ని, పోర్టు ల్ని, విమానాశ్రయాల్ని కట్టబెడుతున్నాడు. తనతండ్రిని రిలయన్స్ సంస్థ చంపించిందని చెప్పిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక అదేసంస్థకు ఎందుకు ఊడిగం చేస్తున్నాడు? అంటే రాజశేఖర్ రెడ్డిని రిలయన్స్ సంస్థ చంపించింది అన్న జగన్ మాటలు పచ్చి అబద్ధాలు. ఆ సమయంలో సాక్షి రాసినరాతలు విషపురాతలు అని తేలిపోయింది. అంతటితో ఆగకుండా చంద్రబాబుపై సాక్షి మీడియాలో నీతిమాలిన ప్రచారం చేయించిన వ్యక్తి జగన్. పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లోఉందని, వేంకటేశ్వరస్వామి నగలు టీడీపీ అధినేత ఇంట్లో ఉన్నాయని సాక్షిమీడియాలో దిక్కుమాలిన ప్రచారం చేయించి, హిందువుల్ని నమ్మించాడు. తన అవినీతి మీడియాతో ఒకపక్క ప్రజల్ని ఏమారుస్తూనే, మరోపక్క కోడికత్తి డ్రామాకు, సొంత బాబాయ్ హత్య కు పథకరచన చేశాడు.
కోడికత్త్రి డ్రామా.. బాబాయ్ హత్యను చంద్రబాబుపైకి నెట్టి, ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ ను మించిన దుర్మార్గుడు ఉండడు. నేరవ్యూహాలు, దుర్మార్గాలతో ప్రజల్ని వంచించడంలో జగన్ ను మించినవారు లేరు. విశాఖవిమానాశ్రయంలో చిన్నకోడికత్తితో దళితయువకుడైన శ్రీనివాస్ తో భుజంపై గీయించు కొని, అక్కడే నానాయాగీ చేసి, ఏపీప్రభుత్వాన్ని, పోలీసుల్ని అనరానిమాటలని ఎంచక్కా వి మానం ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయాడు. అక్కడ పెద్ద ఆసుపత్రిలోచేరి, చిన్నకట్టుకట్టించుకొ ని దానిగురించి కూడా సాక్షిమీడియాలో చిలువలుపలువలుగా దుర్మార్గపు ప్రచారంచేశాడు. ‘కోడికత్తి సర్కారుకత్తే’ అని, ‘నారావారి కత్తి’ అని ‘శ్రీనివాస్ కు చంద్రబాబు కత్తి ఇచ్చి జగన్ ను పొడిపించాడని, జగన్ కు వస్తున్న ఆదరణచూసి ఓర్వలేకే ఈపనిచేశారు’. అని సాక్షిమీ డియా 2018లో సిగ్గు, శరంలేకుండా పచ్చిగా బొంకింది. దాంతో జగన్ ప్రజల్లోసానుభూతి పొందాడు.
దాని తర్వాత 2019లో సొంత బాబాయ్ ని గొడ్డలితోవేయించిన జగన్, ఆ దుర్మార్గా న్ని కూడా సాక్షిమీడియాద్వారా చంద్రబాబుకి, టీడీపీకి అంటగట్టేందుకు విఫలయత్నం చేశాడు. బాబాయ్ ని తానేచంపించి, తానే మీడియా ముందుకు వచ్చి నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలుచెప్పాడు. ఆఖరికి సాక్షిమీడియాలో చంద్రబాబుకత్తిపట్టుకున్న ఫోటోలు వేసి ప్రజ ల్ని నమ్మించే ప్రయత్నంచేసి, ప్రజలఓట్లు కొల్లగొట్టి, ఎట్టకేలకు బాబాయ్ రక్తపు మరకలతో అధికారాన్ని దక్కించుకున్నాడు. ఇన్నిదుర్మార్గాలు, హత్యలు, హత్యావ్యూహాలు, స్వీయ హత్యారచనలు చేసింది కేవలం ముఖ్యమంత్రి కావడానికే.
ఇలా అధికారంకోసం జగన్ చేయని నేరవ్యూహాలు, దుర్మార్గాలులేవు. అలాంటి వ్యక్తి ఈ నాలుగేళ్లల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, ఘోరాలకు తెగబడుతూ, మరలా దళితులే తనబంధువులు అన్నట్లు వారిని నమ్మించడానికి సాక్షిలో తప్పుడు రాతలు రాయిస్తూ విషప్రచారానికి తెరలేపాడు. తాను పేదవాడిని అని, తనకు పత్రికలు, టీవీలు లేవని, అంగబలం..అర్థబలం లేదని పచ్చిగా బొంకుతున్నాడు. అదేదో తెలుగు సినిమాలో మాదిరితానే పొడిపించుకొని, తానే నాటకాలు ఆడి, తానే తనఅవినీతిమీడియాతో చంద్రబాబుపై, టీడీపీపై బురదజల్లాడు.
నిజంగా చంద్రబాబు తప్పుచేస్తే, 4ఏళ్లుగా అధికారం లో ఉన్న జగన్ ఎందుకు ఎలాంటిచర్యలు తీసుకోలేదు? ఎందుకంటే టీడీపీ అధినేత ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే. కోడికత్తి ఘటనలో దళితయువకుడు శ్రీను ఎవరుచెబితే ఆపనిచేశాడు? నారాసుర రక్తచరిత్ర అని బాబాయ్ హత్యను చంద్రబాబుపైకి నెట్టినట్టే, కోడికత్తి డ్రామాను కూడా జగన్ తనరాజకీయంకోసం వేసిన పథకమే. జగన్ మనస్తత్వం చూస్తుంటే ఆయన్ని మించిన దుర్మార్గుడు, దుష్టుడు మరొకడు ఉండడు అనిచెప్పక తప్ప దు. రాష్ట్రంలో ఎన్నో దినపత్రికలు..ఎన్నో టీవీఛానళ్లున్నాయి. కానీ జగన్ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ లా ఎవరూ సిగ్గులేకుండా, బరితెగించి నీతిమాలిన రాతలురాయడంలేదు. తప్పుడు కథనాలు వండి వారుస్తూ ప్రజల్ని ఏమార్చడంలేదు.
జగన్ దళితులబిడ్డకాదు.. పెద్దబోడిగడ్డ. చంద్రబాబు దళితులకోసం ప్రత్యేకంగా అమలు చేసిన పథకాల్నీరద్దుచేసి, అమ్మఒడి, నవరత్నాలపేరుతో వారిని దారుణంగా వంచిస్తున్నజగన్ వారి బిడ్డ ఎలా అవుతాడు?
తాను దళితులబిడ్డనని జగన్ చెప్పడం సిగ్గుచేటు. చంద్రబాబు దళితులకు అమలుచేసిన విదేశీ విద్య, ల్యాండ్ పర్చేజ్ స్కీమ్, ఎన్.ఎస్.డీ.సీ. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, క్రిస్మస్ కాను క, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వంటి వాటిని ఐదేళ్లపాటు అమలుచేసి, దళితుల్ని ఆర్థికంగా సామాజికంగా ముందునిలిపాడు. జగన్ ముఖ్యమంత్రి కాగానే వాటన్నింటినీ రద్దుచేసి, నవ రత్నాలపేరుతో దళితుల్ని వంచించాడు. దళితజాతిని నిలువునామోసగించి, వారి ప్రాణాలు తీస్తూ, దళితఆడబిడ్డల మానప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్ దళితులబిడ్డా? జగన్ చేయాల్సింది బిడ్డబిడ్డ అనడంకాదు.. రాజ్యాంగం ప్రకారం వారికి రావాల్సినవాటిని ఇవ్వాలి. అమ్మఒడి, విద్యాదీవెన, చేయూత వంటివి జగన్ కేవలం దళితులకే ఇస్తున్నాడా? కేవలం మాయమాటలుచెబుతూ, బిడ్డని అంటూ దళితుల్ని వంచించి వారి ఓట్లుకొల్లగొట్టడమే జగన్ లక్ష్యం. జగన్ దళితులపాలిట పెద్దబోడిగడ్డే కానీ బిడ్డకాడు.
లోకేశ్ అన్నదేంటి.. సాక్షిలో రాసిందేంటి? లోకేశ్ చెప్పిందినిజమేనని అంగీకరించి జగన్, అతనిమంత్రివర్గం లెంపలేసుకోవాల్సిందపోయి, చేతిలో అవినీతిపత్రిక ఉందని, తప్పుడు ప్రచారం చేస్తారా?
లోకేశ్ యువగళం యాత్రలో మాట్లాడుతూ, చంద్రబాబు దళితులకోసం అమలుచేసిన అనేక పథకాల్నిజగన్ తీసేశాడు అని చెప్పాడు.అంబేద్కర్ పేరుతోనే విదేశీవిద్యపథకాన్ని కొనసాగి స్తామని, భూమికొనుగోలుపథకం, ఫీజురీయింబర్స్ మెంట్ వాటిని జగన్ రద్దుచేశాడని, తాము అధికారంలోకి వస్తే అన్నీఅమలుచేస్తామని చెప్పాడు. లోకేశ్ చెప్పిందానికి వాస్తవంగా జగన్, అతని మంత్రివర్గం చెంపలేసుకోవాలి. అదిమానేసి, చేతిలో విషపత్రిక ఉందని సాక్షిలో లోకేశ్ అననిదానిని అన్నట్టు బదనాంచేస్తారా? దళితులకు జగన్ పీకింది ఏం లేదని లోకేశ్ అంటే, దళితులు పీకిందేమీ లేదుఅని రాసిన వాడు… రాయించినవాళ్ల పుట్టుక కరెక్టేనా? జగన్ నడత, నడవడిక కరెక్ట్ అయితే తండ్రిని చంపినవారికి మరలా భూములు, పదవులు, ఆస్తులు కట్టబెడతాడా? జగన్ ఆలోచనలు కరెక్ట్ అయితే సొంతతల్లి, చెల్లి, అతన్ని వదిలేసి పొరుగురాష్ట్రానికి వెళ్లేవారా? సొంతతల్లి, చెల్లే జగన్ ను నమ్మకపోతే, దళితులు అతన్ని నమ్మాలా? ఆయన దళితులకు బిడ్డకాదు..ముమ్మాటికీ క్యాన్సర్ గడ్డే. దళితుల్ని చంద్రబా బు ఏదో అన్నాడని గతంలో కూడా జగన్, అతని సాక్షి మీడియా దుష్ప్రచారం చేసింది. సాక్షి దినపత్రిక కాదు.. యాక్ ఛీ పత్రిక, యాక్ త్పూ పత్రిక.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే దళితులపై దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయి. రాజ్యాంగాన్నిలిఖించి, భారతదేశానికి ప్రజాస్వామ్యాన్ని అందించిన అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా?
జగన్ అధికారంలోకి వచ్చాకే దళితులపై దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయి. 4ఏళ్లజగన్ పాలన దాదాపు 6వేలమంది దళితుల్ని బలితీసుకుంది. వైసీపీప్రభుత్వంలో దళితులపై జరిగిన దారుణాలజాబితాను జగన్ కు, దళితమంత్రులకు పంపిస్తాను. దానిపై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం మీకుందా? తూర్పుగోదావరి జిల్లాలో ఇసుకమాఫియాపై ప్రశ్నించిన దళితయువకుడు వరప్రసాద్ కు శిరోముండనంచేయించింది జగన్ కాదా? అతను తనకు స్వచ్ఛందమరణం ప్రసాదించమని రాష్ట్రపతికి లేఖరాస్తే, రాష్ట్రపతి కార్యాలయం జరిగినదారుణంపై విచారణకు ఆదేశిస్తే వైసీపీప్ర భుత్వం ఏంచేసింది? డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాడిని చేసి చంపింది జగన్, అతనిప్రభుత్వం కాదా? పులివెందులలో నాగమ్మను హత్యాచారంతో బలితీసుకుంది వైసీపీవాళ్లుకాదా? దళి త యువకుడు సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్ గాపనిచేస్తుంటే, అతన్ని చంపిన సొంతపార్టీఎమ్మెల్సీపై జగన్ఎందుకు చర్యలుతీసుకోలేదు?
సుబ్రహ్మణ్యాన్నిచంపి జైలుకెళ్లిన అనంతబాబుకి ఘనస్వాగతాలు పలుకుతారా? దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణను బలితీసుకుంది మంత్రిపెద్దిరెడ్డి తమ్ముడుకాడా? అతనిపై జగన్ ఏంచర్యలు తీసుకున్నాడు? ఈ విధంగాచెప్పుకుంటూ పోతే జగన్ అధికారమదానికి, దళితులపై ఆయనకున్న ఈర్ష్యాభా వానికి బలైన దళితులజాబితాకు అంతేలేదు. అసలు జగన్ గొప్పా..అంబేద్కర్ గొప్పా? ప్రపం చం గర్వించే రాజ్యాంగాన్ని రచించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని సృష్టించి, భారతదేశానికి ప్రజా స్వామ్యాన్ని అందించిన గొప్పవ్యక్తి అంబేద్కర్. ఆయనపేరుతో ఉన్న పథకాల్ని తీసేసి, ఆ పథకాలకు తనపేరు పెట్టుకుంటున్న జగన్ దళితులబిడ్డా? జగన్ నిజంగా దళితులకు మం చిచేసే వాడు అయితే తక్షణమే విదేశీవిద్య పథకానికి అంబేద్కర్ పేరుపెట్టాలి. జగన్ కు దళి తులంటే ప్రేమ, అంబేద్కర్ అంటే గౌరవముంటే రాజధానిలో చంద్రబాబు నిర్మించతలపెట్టిన అంబేద్కర్ స్మృతివనం పనుల్ని వెంటనే ప్రారంభించాలి. దళితరాజధాని అమరావతిలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి.
దళితులకు ఎవరి హాయాంలో మేలుజరిగిందో, ఏప్రభుత్వం వారిజీవితాలు బాగుచేసిందో ఆధారాలతో సహా నిరూపించడానికి తాముసిద్ధం. వైసీపీనుంచి ఎవరైనా సరే చర్చకు రావచ్చు
దళితులకు ఎవరిహయాంలో మేలుజరిగిందో, ఎవరు నిజంగా దళితులకు మంచిచేశారో చెప్పడానికి, ఆధారాలతో సహా నిరూపించడానికి తాముసిద్ధం. జగన్ గానీ, అతనిప్రభుత్వం లోని వారుగానీ చర్చకు వస్తే, వైసీపీప్రభుత్వంలో దళితులపై జరిగిన దారుణాలు.. మారణ హోమాన్నికళ్లకుకట్టినట్టు చూపిస్తాం. జగన్ అవినీతిపత్రిక అయిన సాక్షిఅసలు దినపత్రికే కాదు. దాన్నిచూస్తేనే యాక్ ఛీ అనాలనిపిస్తుంది. అందుకే అదొక యాక్ ఛీపత్రిక. జగన్ విసి రే చిల్లరకు ఆశపడి, తమజ్ఞానాన్ని ప్రజలవినాశనానికి వినియోగించే పేటీఎమ్ బ్యాచ్ వారి చదువుని, జ్ఞానాన్ని, తెలివిని తప్పుడు మార్ఫింగ్ లకు వినియోగించవవద్దని, సమాజవినా శనంలో పావులుకావొద్దని హితవుపలుకుతున్నాం. జగన్ విసిరే విషపువలలో చిక్కి, ప్రజల పై, రాష్ట్రంపై విషం చిమ్మేవారంతా ఏదోఒకరోజు దారుణంగా శిక్షింపబడతారు. జగన్ చేసే నేర ఆలోచనలు, నేరవ్యూహాల్లో భాగస్వాములై ఫేక్ బ్యాచ్ వారిజీవితాల్ని నాశనంచేసుకోవద్దు.” అని మాణిక్యరావు హితవుపలికారు.