Suryaa.co.in

Andhra Pradesh

ఓటమిభయంతోనే జగన్ దిగజారి మాట్లాడుతున్నాడు

• తనభాష, పద్ధతి మార్చుకోకుంటే ముఖ్యమంత్రి భారీమూల్యం చెల్లించుకుంటాడు
• వచ్చేఎన్నికల యుద్ధం నీతిపరుడైన చంద్రబాబుకి, అవినీతి ప్రతిరూపమై న జగన్ కు మధ్య
• ఓట్లేశారు కాబట్టి, ప్రజాస్వామ్యనిబంధనల ప్రకారం జగన్ ను ప్రజలు భరిస్తున్నారుకానీ, కాల్ బ్యాక్ సదుపాయం ఉంటే మూడేళ్లక్రితమే ముఖ్యమంత్రిని ఇంటికి పంపేవారు
• జగన్ ను మించిన సైకో, పెత్తందారు ఎవరైనా ఉంటారా?
• జగన్ మాట్లాడే ప్రతిమాట, అతనిలోని భయానికి, అభద్రతకు నిదర్శనం
• జగన్ లాంటి గాడిదల్ని చంద్రబాబు కాశారని మేం అంటే, ముఖ్యమంత్రి తలఎక్కడ పెట్టుకుంటాడు?
• 4 ఏళ్లలో తానేంచేశాడో చెప్పుకోలేని అసమర్థస్థితిలో ఉన్నాడుకాబట్టే జగన్, చంద్రబాబుని, ఈనాడుని, ఆంధ్రజ్యోతిని, ఇతర ఛానెళ్లను తిడుతున్నాడు
• జగన్ కు దమ్ము, ధైర్యముంటే ఆంధ్రజ్యోతికి ఆపేసినట్టు, ఈనాడుకి ప్రభుత్వప్రకటనలు ఇవ్వడం ఆపేయాలి
• బీజేపీ అంటే జగన్ కు భయంలేకపోతే, వచ్చేపార్లమెంట్ సమావేశాల్లో తనపార్టీ ఎంపీలతో ప్రత్యేకహోదా, రాష్ట్రానికి రావాల్సిన ఇతరప్రయోజనాలపై నిరసన వ్యక్తంచేయించాలి
టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

జగన్మోహన్ రెడ్డి మాటల్లో, ఆయనముఖంలో భయంకొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, విద్యాకానుక కార్యక్రమంలో భాగంగా నేడు పల్నాడుజిల్లా కోసూరులో ముఖ్య మంత్రి మాట్లాడిన తీరుచూస్తుంటే, చంద్రబాబునాయుడికి ఆయన భయపడు తున్నట్టు అర్థమైందని టీడీపీఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!

జగన్ ప్రతిమాట, అతనిలోని భయానికి, అభద్రతాభావానికి నిదర్శనం
“విద్యాకానుక పథకం అనేది కేంద్రప్రభుత్వసాయంతో రాష్ట్రప్రభుత్వం అమలుచే స్తోంది. విద్యార్థులకు ఇచ్చేప్రతివస్తువు తానే ఇస్తున్నట్టు, ప్రభుత్వసొమ్ముతో పత్రి కల్లో భారీప్రకటనలు ఇచ్చిన ముఖ్యమంత్రి, దానిగురించి మాట్లాడకుండా చంద్ర బాబుపై విమర్శలు చేయడంఏమిటి? జగన్ ప్రతిమాట అతనిలోని భయానికి, అభద్రతలకు నిదర్శనం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఏంచేశాడని జగన్ లాంటి అవినీతిపరుడు అనడం విచిత్రంగాఉంది. చంద్రబాబుగాడిదలు కాశారా అని జగన్ అన్నాడు. అవును జగన్ లాంటి గాడిదల్ని చంద్రబాబుకాశారు అని మేమంటే ముఖ్యమంత్రి తలఎక్కడ పెట్టుకుంటాడు? 4ఏళ్లలో తానేంచేశాడో చెప్పుకోవాల్సిన జగన్, గతముఖ్యమంత్రులపై విమర్శలు చేయడం అతని కు సంస్కారానికి నిదర్శనం. తనతండ్రి కూడా ఏమీచేయలేదు.. అలాంటప్పుడు జగన్ ఆయన్ని కూడా గాడిదనే అంటాడా? గాడికొడుకు కూడా గాడిదే అవుతాడని మేంఅంటే ముఖ్యమంత్రి, మంత్రులుఏం చెబుతారు?

ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడటం.. పిల్లల ముందు అసభ్యకర భాష వాడటం జగన్ సంస్కారానికి నిదర్శనం
పాఠశాలలు ప్రారంభం అవుతున్నసందర్భంగా ముఖ్యమంత్రి విద్యాకానుక పేరుతో అట్టహాసం చేస్తున్నాడు. గతేడాది ఇంతకంటే ఆర్భాటంగా విద్యాకానుక ప్రారం భించి, విద్యార్థులకు పనికిరానివస్తువుల్ని ప్రభుత్వం కానుకగా ఇచ్చింది. ప్రభు త్వం ఇచ్చిన బ్యాగులు మధ్యలోనే చినిగిపోతే, తల్లిదండ్రులు వారిపిల్లలకు కొత్తవి కొనిచ్చారు. యూనిఫామ్ రంగులుమార్చిన జగన్, దానినాణ్యతను మాత్రం గాలి కి వదిలేశాడు. నాసిరకం యూనిఫామ్ వేసుకున్నవిద్యార్థులకు క్లాసురూముల్లో నగుబాట్లే మిగిలాయి. ప్రభుత్వప్రకటనలు తనపత్రిక సాక్షితోపాటు, ఈనాడు, కూడా ఇస్తున్నముఖ్యమంత్రి, పనిగట్టుకొని ఆ పత్రికను, దానియాజమాన్యాన్ని ఎందుకు తిడుతున్నాడు? జగన్ కు దమ్ము, ధైర్యముంటే ఆంధ్రజ్యోతికి ఆపేసి నట్టే, ఈనాడుకి ప్రభుత్వప్రకటనలు ఆపేయాలి. ప్రభుత్వకార్యక్రమంలో రాజకీ యాలు, పిల్లలముందు అసభ్యకరంగా మాట్లాడటమే తప్పుయితే, ముఖ్యమంత్రి మరీ హద్దులుమీరి మాట్లాడాడు.

విదేశీవిద్య పథకంకింద చంద్రబాబు 5,200మంది విద్యార్థుల్ని విదేశాలకు పంపితే, జగన్ చచ్చీ చెడి 213 మందిని పంపాడు
విదేశీవిద్యపథకం కింద చంద్రబాబుగారు 5,200 మందిని విదేశాలకుపంపారు. జగన్ నాలుగేళ్లలో తూతూమంత్రంగా 213మందిని పంపి, గొప్పలు చెప్పుకుం టున్నాడు. కొంగకు పళ్లెంలో అన్నంపెట్టినట్టు, టాప్ యూనివర్శిటీల్లో సీట్లు వచ్చినవారినే తనప్రభుత్వం విదేశాలకు పంపిస్తుందనే నిబంధనపెట్టాడు. ఏపీలో విద్యాప్రమాణాలు దిగజార్చిన జగన్ నిర్వాకంతో రాష్ట్రంలోచదివే విద్యార్థులకు టాప్ విద్యాసంస్థల్లో సీట్లువస్తాయా? పాఠశాలలవిలీనంతో దాదాపు 6లక్షల మంది విద్యార్థుల్ని విద్యకు దూరంచేశాడు. నాడు-నేడుపేరుతో విద్యారంగాన్ని నాశనంచేసి, కమీషన్లకోసం ఉత్తుత్తిపనులు చేయించి, ప్రభుత్వసొమ్ము దిగమిం గాడు. ఇంటర్ ఫలితాలు గడచినపదేళ్లలో ఎప్పుడూలేనంతగా ఎందుకు దిగజారా యో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. విద్యాప్రమాణాలు తగ్గిపోవడం, 40వేల ఉపాధ్యాయఖాళీలు భర్తీచేయకపోవడం వంటి ముఖ్యమంత్రి చర్యలు విద్యారంగా నికి శాపంగామారాయి.

చంద్రబాబుది వెన్నుపోటు అయితే నీది గొడ్డలిపోటు జగన్ రెడ్డి
విద్యార్థులముందు ఏంమాట్లాడాలో, ఎలామాట్లాడాలో కూడా ముఖ్యమంత్రికి తెలి యకపోవడం దురదృష్టకరం. చంద్రబాబుది వెన్నుపోటు అయితే నీది గొడ్డలిపోటు జగన్ రెడ్డి. ఆగొడ్డలిపోటు నుంచి బయటపడటానికే బీజేపీపెద్దలకాళ్లుపట్టుకుం టున్నావు. తెలుగుదేశంపార్టీని నీలాంటి దుర్మార్గులబారి నుంచి కాపాడారుతప్ప చంద్రబాబు ఎవరికీ ఏపోటు పొడవలేదు. బాబాయ్ ని గొడ్డలిపోటుకి గురిచేసి, అతనిభార్యాపిల్లల్ని ఇష్టమొచ్చినట్టుతిడుతూ, సిగ్గులేకుండా తమ్ముడిని కాపాడుకోవడానికి ఏకంగా రాష్ట్రాన్నే తాకట్టుపెట్టే దుస్థితికి దిగజారావు. తండ్రి చనిపోగానే శవాన్నిముందుపెట్టుకొని ముఖ్యమంత్రి పదవికోసం సంతకాలు సేకరించిన నువ్వుకూడా మాట్లాడితే ఎలా జగన్? నిన్నుమించిన సైకో, పెత్తందారు ఎవరూ ఉండరు. ఇప్పటివరకు నీతాడేపల్లి ప్యాలెస్ ముఖంచూడని నీ పార్టీఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. పెత్తందారుపదానికి నిజరూపం నువ్వు. అలాంటి నువ్వు చంద్రబాబుని పెత్తందారు అంటావా? ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు కలవలేకపోవడం అనేది బహుశా నీపార్టీలోనే సాధ్యమైంది. దేశంలోనే ధనికముఖ్యమంత్రివి అయిననువ్వు పెత్తందారుల గురించి మాట్లా డటం సిగ్గుచేటు. 56ఫెడరేషన్లు పెట్టిన నువ్వు కులాలగురించి, వాటిఉద్ధరణ గురించి మాట్లాడుతున్నావు?

4ఏళ్లలో ఒక్క కొత్త పథకమైనా జగన్ తీసుకొచ్చాడా? విద్యాసంస్థలకు చెల్లించాల్సిన ప్రభుత్వ సొమ్ముని తల్లులకు ఇవ్వడం కొత్త పథకమా?
4ఏళ్లలో నువ్వు ఏదైనా ఒక్కపథకం కొత్తగా పెట్టావా జగన్ రెడ్డి? చంద్రబాబుగారు విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులసొమ్ముని నేరుగా కళాశాలలకు చెల్లించారు. నువ్వువచ్చాక దాన్ని తల్లులకు ఇస్తున్నావు. దాంతో చాలామంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. అలానే పాఠశాలవిద్యార్థులకు గతప్రభు త్వంకూడా యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగులు అందించింది. చంద్రబాబు ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం పథకం అమలుచేస్తే, నువ్వు రాగానే దాన్నితీసేశావు. అన్నాక్యాంటీన్లు ఎత్తేశావు, దళితులు, బీసీలు, మైనారిటీలకు చంద్రబాబు ప్రత్యేకంగా అమలుచేసిన పథకాల్ని నిర్దాక్షణ్యంగా తొలగించావు. నువ్వు వచ్చికొత్త గాచేసింది ఏమిటయ్యా అంటే అన్నిపథకాలకు పేర్లుమార్చి నీపేరుపెట్టుకోవడం. ఈనాడు సంస్థను, యాజమాన్యాన్ని తిడుతూనే ఈనాడుని తిడుతున్నావు. రూ.2లక్షలకోట్లను డీ.బీ.టీవిధానంలో ప్రజలకు ఇచ్చానంటున్నావు.. మరి 10లక్షలకోట్ల అప్పు ఎందుకుఅయ్యింది. మిగిలిన సొమ్మంతా నీ తాడేపల్లి ఖజానాకు తరలించావా?

అవసరానికి వాడుకొని తల్లిని, చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్ ది.. అధికారం కోసం బాబాయ్ ని చంపించిన చరిత్ర జగన్ ది.
నీ చరిత్ర ఏమిటో మర్చిపోయి నువ్వు చంద్రబాబుని విమర్శిస్తే ఎలా జగన్ రెడ్డి? వాడుకున్నంతకాలం వాడుకొని, అవసరంతీరాక తల్లిని, చెల్లిని ఇంటినుంచి వెళ్లగొట్టిన చరిత్రనీది. నీదుష్టరాజకీయాలకు అడ్డువస్తున్నాడని తండ్రితర్వాత తండ్రి అయిన బాబాయ్ ని అధికారంకోసం చంపించిన నీచచరిత్ర నీది? అవినీతి కేసులతో జైలుకు వెళ్లివచ్చిన చరిత్రనీది. ఇప్పటికీ కోర్టుకేసుల్లో విచారణకు హజరవుతున్న చరిత్ర నీది. నా వెంట్రుక కూడా పీకలేరు అంటున్న జగన్, నాలుగేళ్లు ముఖ్యమంత్రిగాఉండి చంద్రబాబుని ఏంపీకాడు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు విమర్శలుచేసి, చివరకు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వెంట్రుకకూడా పీకలేకపోయాడుగా!

వచ్చేఎన్నికలయుద్ధం పేదలకు పెత్తందార్లకు మధ్యకాదు.. నీతికి అవినీతికి మధ్య
వచ్చేఎన్నికల్లో జరిగే యుద్ధం పేదలకు పెత్తందార్లకుమధ్యకాదు జగన్ రెడ్డి. నీతికి అవినీతికి మధ్య. నీతిపరుడైన చంద్రబాబు, అవినీతికిప్రతిరూపమైన నీతో తలపడుతున్నారని తెలుసుకో. జగన్ తీసుకొచ్చే ప్రతిస్కీమ్ లో స్కామ్ ఉంటుం ది. స్కామ్ …జగన్ కవలపిల్లలు. డీ.బీ.టీ విధానంలో జగన్ 10లక్షలకోట్లు ప్రజలకుపంచినా వచ్చేఎన్నికల్లో గెలవడు. 2024లోచంద్రబాబు ముఖ్యమంత్రి అయినవెంటనే జగన్, అతనిప్రభుత్వ అవినీతిలెక్కలు తేలుస్తారు. దుష్టచతు ష్టయం అని ఈనాడుని దూషిస్తున్న జగన్ కు దమ్ము, ధైర్యముంటే, ఆ పత్రికకు ప్రభుత్వప్రకటనలు ఆపేయాలి. మాటతప్పను మడమతిప్పను అన్న జగన్, ఉద్యోగులవిషయంలో ఎందుకుమాటతప్పాడు? ఉద్యోగులహామీల అమల్లో ఆరు సార్లు మడమతిప్పాడు. ప్రజాస్వామ్యంలో నిబంధనఉండబట్టి ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగుతున్నాడుగానీ, కాల్ బ్యాక్ సదుపాయం ఉండుంటే, ప్రజలు జగన్ ముఖ్యమంత్రపీఠం నుంచి దిగిపోయి ఇప్పటికే మూడేళ్లు అయ్యిఉండేది. వచ్చేఎన్నికల్లో ఏపీప్రజలు జగన్ ను, అతనిపార్టీని బంగాళాఖాతంలో కలపడాని కి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి తనభాష, ప్రవర్తన మార్చుకోకుంటే, భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

విలేకరులు అడిగిన ప్రశ్నలకు అశోక్ బాబు సమాధానాలు..
బీజేపీ అంటే భయంలేకపోతే, జగన్ తనపార్టీ ఎంపీలతో పార్లమెంట్ లో ప్రత్యేకహో దాకోసం ఎందుకు నిరసనవ్యక్తం చేయించడు? రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటిపై కేం ద్రాన్ని ఎందుకు నిలదీయడు? ఢిల్లీవెళ్లి అక్కడిపెద్దలతో జరిపేమంతనాల్ని మీడి యా వారికిఎందుకు చెప్పడు? హడావుడిగా ఢిల్లీవెళ్లడం, తనపనులు చక్కబెట్టు కోవడం, మరలా ఎవరికీతెలియకుండా తాడేపల్లికి చేరడం.. ఈ నాలుగేళ్లలో జగన్ చేసింది ఇదేగా? జగన్ కు అతనిపార్టీఎంపీలకు నిజంగా ధైర్యముంటే ప్రత్యేకహో దాపైఢిల్లీలో మాట్లాడాలి.

విశాఖరైల్వేజోన్ ని ప్రైవేటీకరిస్తుంటే, ఎందుకు నోరెత్తడం లేదు? చంద్రబాబు ప్రజలకోసం ప్రకటించినపథకాలు పులిహోరో, బిర్యానీనే గాడి దలు కాసే జగన్ కు ఏంతెలుస్తుంది? జగన్ ఒక్కడే విద్యార్థులకు యూనిఫామ్, బ్యాగులు, పుస్తకాలు ఇచ్చాడా? ఆయనొచ్చాకే పిల్లలకు చదువులు పరిచయ మయ్యాయా? చంద్రబాబు ముందా.. జగన్ ముందా? ఎవరిపథకాలు ఎవరు కాపీ కొట్టారు. కేంద్రప్రభుత్వంఇచ్చేసొమ్ముని ప్రజలకు ఇవ్వడం జగన్ కాపీ కొట్ట డంకాదా? సందర్భం, మాట్లాడేవిధానం తెలియకుండా భయంతో, మేకపోతుగాం భీర్యంతో నేడు క్రోసూరులో మాట్లాడిన ముఖ్యమంత్రి, ప్రజలకుఅడ్డంగా దొరికిపోయాడు.” అని అశోక్ బాబు ఎద్దేవాచేశారు.

LEAVE A RESPONSE